తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Parineeti-raghav Engaged: పరిణీతి పరిణయానికి వేళాయే.. ఆప్ ఎంపీ రాఘవ్‌తో ఘనంగా నిశ్చితార్థం

Parineeti-Raghav Engaged: పరిణీతి పరిణయానికి వేళాయే.. ఆప్ ఎంపీ రాఘవ్‌తో ఘనంగా నిశ్చితార్థం

14 May 2023, 5:30 IST

    • Parineeti-Raghav Engaged: బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ఎంగేజ్మెంట్ ఆప్ ఎంపీ రాఘవ్ చడ్ఢాతో ఘనంగా జరిగింది. శనివారం నాడు జరిగిన ఈ నిశ్చితార్థానికి ప్రియాంక చోప్రా తదితరులు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పరిణీతి-రాఘవ్ ఎంగేజ్మెంట్
పరిణీతి-రాఘవ్ ఎంగేజ్మెంట్

పరిణీతి-రాఘవ్ ఎంగేజ్మెంట్

Parineeti-Raghav Engaged: బాలీవుడ్ హీరోయిన్ పరణీతి చోప్రా.. ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ రాఘవ్ చడ్ఢా ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. శనివారం నాడు రాత్రి దిల్లీలోని రాఘవ్ స్వగృహంలో వీరిద్దరూ ఉంగరాలు మార్చుకోవడంతో నిశ్చితార్థం పూర్తయింది. ఈ వేడుకకు ఇరువురు కుటుంబ సభ్యులతో పాటు ఇతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో జరిగింది. పరిణీతి వేలుకు రాఘవ్.. డైమండ్ రింగు తొడిగారు. ఇందుకు సంబందించిన ఫొటోలను ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Prabhas: నా బుజ్జిని చూస్తారా: కల్కి 2898 ఏడీపై ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్

Prasanna Vadanam OTT Release date: ప్రసన్న వదనం ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఇలా చేస్తే 24 గంటలు ముందుగానే చూడొచ్చు..

Devara fear song promo: దేవర ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ప్రోమో చూశారా.. అదిరిపోయిన బీజీఎం

Suresh Babu on Theatres: ఓటీటీ మమ్మల్ని దెబ్బ కొడుతోంది.. థియేటర్లలను ఫంక్షన్ హాల్స్‌గా మార్చాల్సిందే: సురేశ్ బాబు

అంతేకాకుండా అవును అని చెప్పడానికి అన్నింటినీ ప్రార్థించాను. అని పరిణితీ రాసుకొచ్చారు. పరిణీతి-రాఘవ్ ఇద్దరూ తెలుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఈ దుస్తుల్లో వీరిద్దరూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన వేలుకు ఉన్న పెద్ద నిశ్చితార్థపు ఉంగరాన్ని హీరోయిన్ షేర్ చేసింది. వీరి ఎంగేజ్మెంట్ సంప్రదాయ సిక్ పద్ధతిలో జరిగినట్లు తెలుస్తోంది. సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమైనట్లు సమాచారం.

పరిణీతి-రాఘవ్ నిశ్చితార్థానికి కుటుంబ సభ్యులతో అత్యంత సన్నిహితులు, స్నేహితులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. వేడుకకు ముందే పరిణీతి కజిన్ ప్రియాంక చోప్రా, మనీష్ మల్హోత్రా, పవన్ సచ్‌దేవ, సహాజ్ చోప్రా, శివాంగ్ చోప్రా తదితరులు వెన్యూ వద్దకు వచ్చారు. వీరితో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ న్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఇతర రాజకీయ నేతలు హాజరయ్యారు. అత్యంత భారీ భద్రతల నడుమ కనీసం సెల్‌ఫోన్ కూడా అనుమతించకుండా వీరి నిశితార్థం జరిగింది. ఎంగేజ్మెంట్‌కు ముందు రాఘవ్ సింపుల్ పైజామా-కుర్తా ధరించి టీ తాగడం కెమెరా కంటికి చిక్కింది.

మార్చి నెలలో పరిణీతి-రాఘవ్ లంచ్ డేట్‌లో కలిసిన తర్వాత డేటింగ్ రూమర్లు మొదలయ్యాయి. ఆ తర్వాత చాలా సందర్భాల్లో వారు కెమెరాకు చిక్కారు. అయితే ఈ వార్తలను వారు ధ్రవీకరించనూ లేదు.. అలాగని ఖండించనూ లేదు. అప్పుడప్పుడు డిన్నర్లకు వెళ్లడం మాత్రం కొనసాగిస్తూనే వచ్చారు. పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు మాత్రం ఎప్పుడూ సమాధానం చెప్పలేదు. కానీ ఇప్పుడు ఏకంగా నిశ్చితార్థం చేసుకుని ఆ ఊహాగానాలను నిజం చేశారు.

కొన్ని బీటౌన్ నివేదికల ప్రకారం పరిణితీ-రాఘవ్ ఇద్దరూ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో కలిసి చదువుకున్నారు. అప్పటి నుంచే చాలా కాలంగా స్నేహితులుగా ఉన్నారు. రాఘవ్ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఎంపీ కొనసాగుతుంటే.. పరిణీతి సినిమాలతో బిజీగా ఉంది. ఆమె చివరగా సూరజ్ బర్జాత్య ఉంఛాయ్‌లో కనిపించింది. ప్రస్తుతం దిల్జీతో దోసాంజే‌తో చమ్కీలా, అక్షయ్ కుమార్‌తో క్యాప్సుల్ గిల్ అనే సినిమాలు చేస్తోంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం