తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kangana Ranaut: ఇందిరాగాంధీ పాత్ర‌లో కంగ‌నా...మేక‌ప్‌మెన్‌గా ఆస్కార్ విన్న‌ర్‌...

Kangana Ranaut: ఇందిరాగాంధీ పాత్ర‌లో కంగ‌నా...మేక‌ప్‌మెన్‌గా ఆస్కార్ విన్న‌ర్‌...

HT Telugu Desk HT Telugu

18 June 2022, 13:11 IST

  • ధాక‌డ్ సినిమాతో గ‌త నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది కంగ‌నా ర‌నౌత్. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం ప‌రాజయాన్ని మూట‌గ‌ట్టుకున్న‌ది. ధాక‌డ్ త‌ర్వాత ఎమ‌ర్జెన్సీ పేరుతో కంగ‌నా ర‌నౌత్ ఓ సినిమా చేయ‌బోతున్న‌ది. ఇందులో ఆమె ఇందిరాగాంధీ పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ సినిమాకు మేక‌ప్ మెన్ గా ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ప‌నిచేయ‌బోతున్నాడు. అత‌డు ఎవ‌రంటే..

కంగ‌నా ర‌నౌత్
కంగ‌నా ర‌నౌత్ (twitter)

కంగ‌నా ర‌నౌత్

ఫ‌లితంతో సంబంధం లేకుండా క‌థాంశాలు, పాత్ర‌ల ప‌రంగా ప్ర‌యోగాలు చేయ‌డానికి ప్రాధాన్య‌మిస్తుంటుంది కంగ‌నా ర‌నౌత్‌. సినిమాలు, వ్య‌క్తిగ‌త విష‌యాల‌కు సంబంధించిన ఏ విష‌యాన్నైనా కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లుగా నిర్మొహ‌మాటంగా వ్య‌క్త‌ప‌రుస్తుంటుంది. ఆ మ‌న‌స్త‌త్వం వల్ల కెరీర్‌లో అనేక వివాదాల్ని ఎదుర్కొన్న‌ది. బాలీవుడ్‌లో వార‌స‌త్వం, గుత్తాధిప‌త్య ధోర‌ణిపై విమ‌ర్శ‌ల్ని సంధిస్తూ త‌ర‌చుగా వార్త‌ల్లో నిలుస్తుంటుంది. 

ట్రెండింగ్ వార్తలు

Bollywood Actor: 200 సినిమాల్ని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ న‌టుడు - సూప‌ర్‌స్టార్ కావాల్సినోడు .. సీరియ‌ల్స్ చేస్తోన్నాడు

Prabhas Marriage: ప్రభాస్ లైఫ్‌లోకి స్పెషల్ పర్సన్.. కాబోయే భార్య గురించేనా డార్లింగ్ పోస్ట్?

Baahubali Crown Of Blood OTT: ఓటీటీలోకి వచ్చేసిన బాహుబలి ప్రీక్వెల్.. కానీ, అదొక్కటే నిరాశ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Anushka: అరుంధ‌తిలో అనుష్క ఫ‌స్ట్ ఛాయిస్ కాదు - ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీని మిస్‌ చేసుకున్న మ‌ల‌యాళం హీరోయిన్ ఎవ‌రంటే?

కంగ‌నా ర‌నౌత్ న‌టించిన గ‌త చిత్రం ధాక‌డ్ బాక్సాఫీస్  వ‌ద్ద బోల్తా కొట్టింది. దాదాపు ఎన‌భై కోట్ల‌ వ్యయంతో రూపొందిన ఈ చిత్రం ఐదారు కోట్ల‌కు మించి క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌లేక‌పోయింది. ఈ ప‌రాజ‌యంతో కంగ‌నా రనౌత్ కు  గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ప్ర‌స్తుతం ఎమ‌ర్జెన్సీ  పేరుతో ఓ సినిమా సినిమాను చేయ‌బోతున్న‌ది కంగ‌నా ర‌నౌత్‌. 1975 నుండి 1977 మ‌ధ్య‌కాలంలో ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో ఇందిరాగాంధీ జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 

టైటిల్ పాత్ర‌లో నటించడమే కాకుండా కంగనా స్వయంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తోంది.  ఇందిరాగాంధీ పాత్ర‌కు సంబంధించి లుక్‌, గెట‌ప్ ఎలా ఉండాల‌నే విష‌యంలో కంగ‌నా ర‌నౌత్ కసరత్తులు చేస్తోంది. ఇందిరాగాంధీని పోలిన విధంగా రియ‌లిస్టిక్ గా ట్రాన్ప్‌ఫ‌ర్మేష‌న్ ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది. ప్రోస్థ‌టిక్ మేక‌ప్‌తో లుక్ ను తీర్చిదిద్దే ప‌నిలో చిత్ర యూనిట్ బిజీగా ఉన్నారు. ఈ  పాత్ర‌కు సంబంధించి మేక‌ప్ కోసం ఆస్కార్ విన్న‌ర్ డేవిడ్ మిలనోవ్ స్కీ ప‌నిచేయ‌బోతున్నారు. 

కంగ‌నాకు అత‌డు మేక‌ప్ వేస్తున్న ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది ధాక‌డ్ యాక్ట‌ర్‌. మిల‌నోవ్ స్కీ ఎమ‌ర్జెన్సీ టీమ్ లోకి స్వాగ‌తం అంటూ ఈ ఫొటోకు క్యాప్ష‌న్ జోడించింది. అంతేకాకుండా ఇంద‌రిగాంధీ లుక్ ఎలా ఉంటుందోన‌ని తాను ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ట్లు పేర్కొన్న‌ది.  ఈ ఫొటోలు అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. డార్కెస్ట్ అవ‌ర్ తో 2017లో ఆస్కార్ అవార్డును అందుకున్నారు మిల‌నోవ్ స్కీ. బ్యాట్‌మాన్‌, వ‌ర‌ల్డ్ వార్ జ‌డ్ తో పాటు ప‌లు చిత్రాల‌కు మేక‌ప్ మెన్ గా ప‌నిచేశాడు. 

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం