తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ntr30 Release Date: యంగ్‌ టైగర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఎన్టీఆర్‌30 రిలీజ్ డేట్‌ ఫిక్స్‌

NTR30 Release Date: యంగ్‌ టైగర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఎన్టీఆర్‌30 రిలీజ్ డేట్‌ ఫిక్స్‌

Hari Prasad S HT Telugu

01 January 2023, 13:02 IST

    • NTR30 Release Date: యంగ్‌ టైగర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ వచ్చింది. ఎన్టీఆర్‌30 రిలీజ్ డేట్‌ ఫిక్స్‌ చేశారు మేకర్స్‌. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ప్రీప్రొడక్షన్‌ స్టేజ్‌లో ఉన్నప్పుడే రిలీజ్‌ డేట్‌ వచ్చేయడం విశేషం.
ఎన్టీఆర్30 రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్
ఎన్టీఆర్30 రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్

ఎన్టీఆర్30 రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్

NTR30 Release Date: కొత్త ఏడాది తొలి రోజే యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు ఎన్టీఆర్30 మేకర్స్‌. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేశారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ అధికారిక ట్విటర్‌ ద్వారా ఎన్టీఆర్‌30 రిలీజ్‌ డేట్‌ను వెల్లడించారు. ఇంకా టైటిల్‌ కూడా ఖరారు కాని ఈ సినిమా ప్రీప్రొడక్షన్‌ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఇలా రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేయడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

Blink OTT Streaming: వీకెండ్‌లో ఈ కన్నడ సై-ఫి థ్రిల్లర్ మూవీ అస్సలు మిస్ కావద్దంటున్న ఓటీటీ ప్రేక్షకులు

Flop Movies With super hit songs: పాట హిట్.. బొమ్మ ఫట్.. తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్న ఫ్లాప్ మూవీస్ ఇవే

Korean Movies in Cannes: కేన్స్‌లో దుమ్ము రేపిన ఈ కొరియన్ సినిమాలను ఏ ఓటీటీల్లో చూడాలంటే..

Love Me Trailer: భయపెడుతున్న వైష్ణవి చైతన్య లవ్ మి ట్రైలర్.. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు?

ఎన్టీఆర్30 మూవీని ఏప్రిల్‌ 5, 2024లో రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ వచ్చే నెల నుంచే ప్రారంభం కాబోతున్నట్లు కూడా చెప్పారు. ఈ సినిమాను ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుద్ధ్ రవిచందర్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. కొరటాల శివతో ఎన్టీఆర్‌ చేయబోతున్న మూడో సినిమా ఇది.

"ఒక మనిషి ఆవేశమే ధైర్యం అనే వ్యాధికి మందు. ఎన్టీఆర్30 ఏప్రిల్‌ 5, 2024న థియేటర్లలోకొ వస్తోంది. షూటింగ్‌ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. హ్యాపీ న్యూ ఇయర్‌" అని మేకర్స్‌ ట్వీట్‌ చేశారు. దీంతోపాటు ఓ ఇంటెన్స్‌ పోస్టర్ ను కూడా రిలీజ్‌ చేశారు. ఇందులో కత్తి పట్టుకున్న ఎన్టీఆర్‌ చేతులు మాత్రమే కనిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ 30లో ఫీమేల్ లీడ్‌గా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్‌గా చేసేందుకు మూవీ టీమ్ జాన్వీతో సంప్రదింపులు జరుపుతున్నాయట. ప్రస్తుతం ఈ చర్చలు తుది దశలో ఉన్నాయని సమాచారం. జాన్వీ కూడా తారక సరసన నటించేందుకు ఆసక్తి చూపిస్తుంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందట.

ఈ మధ్యే అమెరికా టూర్ కు వెళ్లిన ఎన్టీఆర్.. న్యూయార్క్‌‍లోని జునూన్ ఓ భారతీయ రెస్టారెంట్‌కు వెళ్లారు. ఆ రెస్టారెంటులో వంటల రుచి చూసిన ఈ యాక్టర్ అక్కడ చెఫ్‌లతో కలిసి ఓ ఫొటో దిగారు. ఆ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నారు. అంతేకాకుండా ఆ స్టోరీ కింద క్యాప్షన్‌ను కూడా జోడించారు.

అంతర్జాతీయ పర్యటనలోనూ అత్యుత్తమ భారతీయ ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. న్యూయార్క్‌లోని జునూన్ అనే రెస్టారెంటులో స్పైసీగా అదిరిపోయే వంటలను రుచిచూశాను. అద్భుతంగా ఉంది. అని తారక్ తన స్టోరీకి క్యాప్షన్‌ను జత చేశారు. అంతేకాకుండా ఈ స్టార్ హీరోతో రెస్టారెంటు సిబ్బంది కలిసి ఫొటో దిగారు. గుబురు మీసాలు, గడ్డంతో ఎన్‌టీఆర్ ఫుల్ మాస్ లుక్‍‌లో కనిపించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం