NTR30 Heroine Confirm: ఎన్టీఆర్30లో హీరోయిన్ కన్ఫార్మ్.. ఆ బాలీవుడ్ ముద్దుగుమ్మకే ఛాన్స్..!-janhvi kapoor as the female lead actress in ntr ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Janhvi Kapoor As The Female Lead Actress In Ntr

NTR30 Heroine Confirm: ఎన్టీఆర్30లో హీరోయిన్ కన్ఫార్మ్.. ఆ బాలీవుడ్ ముద్దుగుమ్మకే ఛాన్స్..!

Maragani Govardhan HT Telugu
Nov 02, 2022 09:11 AM IST

NTR30 Heroine Confirm: జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివ కాంబో రానున్న చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఎన్టీఆర్ 30లో హీరోయిన్‌గా జాన్వీ
ఎన్టీఆర్ 30లో హీరోయిన్‌గా జాన్వీ

NTR30 Heroine Confirm: ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతుందనే విషయం అందిరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రకటన వచ్చి చాలా రోజులైనప్పటికీ ఇంత వరకు రెగ్యూలర్ షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న తారక్.. తన తదుపరి చిత్రానికి సంబంధించిన కసరత్తులు కూడా ప్రారంభించారు. కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్ర రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఇంతవరకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది మాత్రం క్లారిటీ రాలేదు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఎన్టీఆర్ 30లో ఫీమేల్ లీడ్‌గా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్‌గా చేసేందుకు మూవీ టీమ్ జాన్వీతో సంప్రదింపులు జరుపుతున్నాయట. ప్రస్తుతం ఈ చర్చలు తుది దశలో ఉన్నాయని సమాచారం. జాన్వీ కూడా తారక సరసన నటించేందుకు ఆసక్తి చూపిస్తుంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందట.

తొలుత ఈ సినిమాలో ఆర్ఆర్ఆర్ హీరోయిన్ ఆలియా భట్‌ను తీసుకోవాలని చిత్రబృందం భావించిందట. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఆమె ఆ ప్రాజెక్టును పక్కకు తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మృణాల్ పేరు కూడా వినిపించింది. చివరకు జాన్వీ కపూర్‌ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై స్పష్టత రావాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి ఉండాల్సిందే.

ఇప్పటికే ఎన్టీఆర్ కూడా ఈ సినిమా కోసం కసరత్తులు ప్రారంభించారు. జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన వీరి కాంబినేషన్‌ కోసం తారక్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కాబట్టి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ ఓ సినిమాకు పచ్చజెండా ఊపారు.

ఎన్టీఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణ కే నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్ రామ్ ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహిరంచారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్చున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా సాబు సిరిల్, రత్నవేలు ఛాయగ్రహణం, శ్రీకర ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మొదలు కానుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్