తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Extra Ordinary Man: నితిన్ కెరీర్‌లో బిగ్ రిస్క్ - ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Extra Ordinary Man: నితిన్ కెరీర్‌లో బిగ్ రిస్క్ - ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

06 December 2023, 10:11 IST

  • Extra Ordinary Man: నితిన్ కెరీర్‌లో హ‌య్యెస్ట్ ప్రీ రిలీజ్ చేసిన మూవీగా ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ నిలిచింది. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

నితిన్, శ్రీలీల
నితిన్, శ్రీలీల

నితిన్, శ్రీలీల

Extra Ordinary Man: ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్‌తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ రిస్క్ చేయ‌బోతున్నాడు నితిన్‌. క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. డిసెంబ‌ర్ 8న ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. కాగా నితిన్ కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ ప్రీ రిలీజ్ చేసిన మూవీగా ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ నిలిచింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ సినిమా 24 కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన‌ట్లు స‌మాచారం. 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ రిలీజ్ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Scam 2010 Web Series: స్కామ్ 2010.. మరో వెబ్ సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. ఈసారి సుబ్రతా రాయ్ స్కామ్

Jayanthi Kannappan: కొడుకు మృతితో బాధ.. ఇద్దరి మధ్య దూరం: లలితతో ప్రకాశ్ రాజ్ విడాకులపై జయంతి కన్నప్పన్ వ్యాఖ్యలు

Janhvi Kapoor: ఎంఎస్ ధోనీ ఫిలాసఫీ మా సినిమాలో ఉంటుంది: జాన్వీ కపూర్

Aranmanai 4 - Rathnam OTT: ఒకే రోజు ఓటీటీలోకి త‌మ‌న్నా అరాణ్మ‌ణై 4...విశాల్ ర‌త్నం - ట్విస్ట్ ఏంటంటే?

ఆంధ్రాలో హయ్యెస్ట్…

ఆంధ్రాలో అత్య‌ధికంగా 9 కోట్ల వ‌ర‌కు థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రిగిన‌ట్లు స‌మాచారం. నైజాంలో దాదాపు ఏడు కోట్ల వ‌ర‌కు ఓన్‌గానే నితిన్ తండ్రి సుధాక‌ర్‌రెడ్డి ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. సీడెడ్‌లో మూడు కోట్లు, ఓవ‌ర్‌సీస్‌లో రెండున్న‌ర కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన‌ట్లు చెబుతోన్నారు. ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ కంటే ముందు నితిన్ కెరీర్‌లో రంగ్ దే ఒక్క‌టే ఇప్ప‌టివ‌ర‌కు 24 కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ ఆ సినిమా డిజాస్ట‌ర్‌గా మిగిలింది. ప్ర‌స్తుతం నితిన్‌కు ఉన్న మార్కెట్ దృష్ట్యా ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్‌తో నితిన్ రిస్క్ చేయ‌బోతున్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.

నాని పోటీ…

నితిన్ మూవీకి పోటీగా నాని హాయ్ నాన్న కూడా ఈ వారం బాక్సాఫీస్ బ‌రిలో నిలిచింది. నాని ఫ్యామిలీ ఆడియెన్స్‌లో గ‌ట్టి ప‌ట్టు ఉండ‌టంతో నితిన్ యూత్ ప్రేక్ష‌కులపైనే ఎక్కువ‌గా ఆశ‌లు పెట్టుకున్నాడు. మ‌రోవైపు యానిమ‌ల్‌ హ‌వా ఇంకా కొన‌సాగుతూనే ఉంది. యానిమ‌ల్ యూత్‌ను ఎక్స్‌ట్రా ఆడుతోన్న‌ థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డం అంటే ఛాలెంజ్ అనే బాక్సాఫీస్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.

ఈ అడ్డంకుల‌ను దాటుకొని నితిన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు చేరువ అవుతాడా? లేదా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఎక్స్‌టా ఆర్డిన‌రీ మ్యాన్ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది. రాజ‌శేఖ‌ర్ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నాడు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా త‌ర్వాత వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సెకండ్ మూవీ ఇది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం