తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Annapoorani Teaser: మళ్లీ కామెడీ మూవీ చేస్తున్న నయనతార: ఇంట్రెస్టింగ్‍గా ‘అన్నపూర్ణి’ టీజర్

Annapoorani Teaser: మళ్లీ కామెడీ మూవీ చేస్తున్న నయనతార: ఇంట్రెస్టింగ్‍గా ‘అన్నపూర్ణి’ టీజర్

25 October 2023, 16:41 IST

    • Annapoorani Teaser - Nayanthara: నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న అన్నపూర్ణి మూవీ టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ ఆసక్తిని కలిగించేలా ఉంది.
Annapoorani Teaser: ఇంట్రెస్టింగ్‍గా ‘అన్నపూర్ణి’ టీజర్
Annapoorani Teaser: ఇంట్రెస్టింగ్‍గా ‘అన్నపూర్ణి’ టీజర్

Annapoorani Teaser: ఇంట్రెస్టింగ్‍గా ‘అన్నపూర్ణి’ టీజర్

Annapoorani Teaser - Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార కొన్నేళ్లుగా ఎక్కువగా సీరియస్ సబ్జెక్టులతో సినిమాలు చేస్తున్నారు. ఇటీవల షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాలో హీరోయిన్‍గానూ చేశారు. కాగా, నయనతార మరోసారి కామెడీ ప్రధానమైన సినిమా చేస్తున్నారు. ‘అన్నపూర్ణి’ పేరుతో ఈ మూవీ రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ ఎలా ఉందంటే..

ట్రెండింగ్ వార్తలు

Suchitra Dhanush: హీరో ధనుష్ గే.. రాత్రి 3 గంటలకు నా భర్తతో ఏం పని.. సింగర్ సుచిత్ర కామెంట్స్

Maya Petika OTT: మరో ఓటీటీలోకి కూడా వచ్చేస్తున్న పాయల్ రాజ్‌పుత్ మాయా పేటిక మూవీ

Aquaman and the Lost Kingdom OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్.. ఫ్రీగా చూసేయండి

Dakshina Trailer: తెలుగులో క‌బాలి హీరోయిన్ సైకో కిల్ల‌ర్ మూవీ - ట్రైల‌ర్ రిలీజ్ చేసిన ఉప్పెన డైరెక్ట‌ర్‌

అన్నపూర్ణి సినిమాలో సంప్రదాయ బ్రహ్మణ కుటుంబంలో అమ్మాయి ‘అన్నపూర్ణి’ పాత్ర చేస్తున్నారు నయనతార. అద్భుతమైన శ్రీరంగం నగరం వ్యూతో అన్నపూర్ణి టీజర్ మొదలైంది. అగ్రహారంలో ఉండే బ్రహ్మణ కుటుంబం ఇల్లు ఆ తర్వాత కనిపిస్తుంది. ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు పూజ చేస్తుంటారు. ఆ తర్వాత ఈ టీజర్లో నయనతార క్యారెక్టర్ కనిపిస్తుంది.

మేనేజ్‍మెంట్, బిజినెస్‍కు సంబంధించిన బుక్‍ను నయనతార చాలా సీరియస్‍గా చదువుతున్నట్టు టీజర్లో కనిపిస్తుంది. అయితే, ఆ పుస్తకంలో చికెన్ వంటకం రెసిపీని పెట్టుకొని నయనతార రహస్యంగా చూస్తుంటారు. అప్పుడు వాళ్లమ్మ రేణుక ఆమెను పిలుస్తారు. పరీక్ష ఉందా అని అడిగితే.. అవునంటారు నయనతార. చీరకట్టులో నయనతార అద్భుతంగా కనిపించారు. సంగీత దర్శకుడు థమన్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా సరిగ్గా ఈ టీజర్‌కు సూటైంది.

అన్నపూర్ణి సినిమాకు నీలేశ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. జై, సత్యరాజ్, అచ్యుతకుమార్, కేఎస్ రవికుమార్, రెడిన్ కింగ్‍స్లే, కుమారి సంచు, రేణుక, కార్తీక్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. జీస్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్.. సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.

నయనతార రీసెంట్‍గా ఇరైవన్ (తెలుగులో గాడ్) అనే సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో నటించారు. జయం రవి ఈ సినిమాలో హీరోగా చేశారు. ఐ.అహ్మద్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం మిక్స్డ్ రివ్యూలను అందుకుంది. నటీనటుల పర్ఫార్మెన్స్ బాగున్నా.. సినిమా ఆసక్తికరంగా లేదనే మిక్స్డ్ టాక్ వచ్చింది. కాగా, ఈ చిత్రం అక్టోబర్ 26న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది.

షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాతో ఈ ఏడాదే హిందీలో అరంగేట్రం చేశారు నయనతార. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. రూ.1,000కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం