తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nandamuri Chaitanya Krishna Breathe: నంద‌మూరి వార‌సుడి కొత్త ప్ర‌య‌త్నం - బ్రీత్ మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

Nandamuri Chaitanya Krishna Breathe: నంద‌మూరి వార‌సుడి కొత్త ప్ర‌య‌త్నం - బ్రీత్ మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

05 March 2023, 13:15 IST

  • Nandamuri Chaitanya Krishna Breathe: నంద‌మూరి ఫ్యామిలీ నుంచి మ‌రో వార‌సుడు హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. నంద‌మూరి చైత‌న్య కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న తాజా సినిమా టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను ఆదివారం రిలీజ్ చేశారు.

నంద‌మూరి చైత‌న్య కృష్ణ
నంద‌మూరి చైత‌న్య కృష్ణ

నంద‌మూరి చైత‌న్య కృష్ణ

Nandamuri Chaitanya Krishna Breathe: నంద‌మూరి ఫ్యామిలీ నుంచి మ‌రో హీరో టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయ‌బోతున్నాడు. బ్రీత్ అనే సినిమాతో నంద‌మూరి చైత‌న్య కృష్ణ కథానాయకుడిగా తొలి అడుగు వేయబోతున్నాడు. ఆదివారం ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌ రిలీజ్ చేశారు. న‌టుడిగా గ‌తంలో ప‌లు సినిమాలు చేశాడు చైత‌న్య కృష్ణ‌. బ్రీత్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో వ‌ర్షంలో గొడుగు ప‌ట్టుకొని సీరియ‌స్ లుక్‌లో చైత‌న్య కృష్ణ క‌నిపిస్తోన్నాడు. టైటిల్‌తో పాటు అంతిమ పోరాటం అనే క్యాప్ష‌న్ ఆస‌క్తిని పంచుతోంది. వంశీకృష్ణ ఆకెళ్ల‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాను దివంగ‌త ఎన్టీఆర్ మొద‌టి కొడుకు జ‌య‌కృష్ణ నిర్మిస్తోన్నారు.

త‌న‌యుడు చైత‌న్య కృష్ణ‌ను హీరోగా నిలబెట్టడం కోసం జ‌య‌కృష్ణ స్వ‌యంగా బ‌స‌వ‌తార‌కం క్రియేష‌న్స్ ప‌తాకంపై బ్రీత్ సినిమాను నిర్మిస్తోన్నారు. ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ చూస్తుంటే సీరియ‌స్ సోష‌ల్ డ్రామాగా ఈ సినిమా తెర‌కెక్కుతోన్న‌ట్లు క‌నిపిస్తోంది.

ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ ఆకెళ్ల‌కు ఇదే మొద‌టి సినిమా కాదు. గ‌తంలో ర‌క్ష‌, జ‌క్క‌న సినిమాల్ని తెర‌కెక్కించాడు. . ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేవంగా జ‌రుగుతోన్న‌ట్లు స‌మాచారం. బ్రీత్ సినిమాకు మార్క్ కె రాబిన్ సంగీతాన్ని అందిస్తోన్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం