తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Naga Chaitanya: అప్పుడు సమంత.. ఇప్పుడు చైతన్య.. ఈ విషయంలో ఇద్దరిదీ ఒకటే మాట

Naga Chaitanya: అప్పుడు సమంత.. ఇప్పుడు చైతన్య.. ఈ విషయంలో ఇద్దరిదీ ఒకటే మాట

Hari Prasad S HT Telugu

22 January 2024, 8:13 IST

    • Naga Chaitanya: నాగ చైతన్య, సమంత ఒక విషయంలో మాత్రం ఒకే మాటపై ఉన్నారు. అది తాజాగా వచ్చి సంచలనం సృష్టిస్తున్న హనుమాన్ మూవీని పొగడటం విషయంలో కావడం విశేషం.
నాగ చైతన్య, సమంత
నాగ చైతన్య, సమంత

నాగ చైతన్య, సమంత

Naga Chaitanya: నాగ చైతన్య తన ఇష్టాయిష్టాలను ప్రభావితం చేశాడని ఈ మధ్యే సమంత పరోక్షంగా చెప్పిన నేపథ్యంలో ఈ ఇద్దరూ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా హనుమాన్ మూవీ విషయంలో మాత్రం ఈ ఇద్దరిదీ ఒకే మాటగా ఉంది. ఆ మధ్య ఈ సినిమాను ఆకాశానికెత్తుతూ సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. తాజాగా చై కూడా అదే పని చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

The First Omen OTT: ఓటీటీలో భయపెట్టనున్న సరికొత్త హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Siddharth40: సిద్ధార్థ్ హీరోగా 40వ సినిమా.. తెలుగు తమిళంలో ద్విభాషా చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే?

Balakrishna vs Jr NTR: బాక్సాఫీస్ వద్ద బాబాయి, అబ్బాయి పోటీ ఉండనుందా?

Kalki 2898 AD Bujji: ‘బుజ్జీ’ కోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన కల్కి 2898 ఏడీ టీమ్.. ఎప్పుడు.. ఎక్కడ అంటే!

హనుమాన్.. గూస్‌బంప్స్ ఖాయం

హనుమాన్ మూవీ రిలీజైన పదో రోజు నాగ చైతన్య ఈ సినిమాను పొగుడుతూ ట్వీట్ చేశాడు. ఈ సినిమా మొత్తం గూస్‌బంప్ మూమెంట్సే ఉన్నాయని అతడు అన్నాడు. "హనుమాన్ బ్లాక్ బస్టర్ అయినందుకు ప్రశాంత్ వర్మకు కంగ్రాట్స్. సరికొత్త రైటింగ్, దానిని తెరపైన ఆవిష్కరించడం, సినిమా మొత్తం గూస్‌బంప్స్ తెప్పించావు. నన్ను కూడా మీ ప్రపంచంలోకి తీసుకెళ్లావు.

తేజ సజ్జ అద్భుతంగా నటించాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇతర నటీనటులు వరలక్ష్మి శరత్ కుమార్, అమృత, విజయ్ రాయ్ లతోపాటు ఈ కథను నమ్మిన ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డికి శుభాకాంక్షలు. మొత్తం టీమ్ కు ఛీర్స్" అని చైతన్య ట్వీట్ చేశాడు.

జనవరి 12న రిలీజైన హనుమాన్ మూవీని ఈ మధ్యే సమంత కూడా కొనియాడింది. "మనల్ని చిన్న పిల్లలుగా మార్చేసే సినిమాలే బెస్ట్ సినిమాలు. అద్భుతమైన విజువల్స్, సినిమాటిక్ హైస్, హ్యూమర్, మ్యాజిక్.. ఇలా అన్నింటినీ కలిపి అద్భుతమైన మ్యూజిక్, నటనతో అందించారు.

స్క్రీన్ పై హనుమాన్ మాయ చేసింది. ఈ సినిమా అందించిన ప్రశాంత్ వర్మకు థ్యాంక్స్. మీ యూనివర్స్ లో తర్వాతి సినిమాల కోసం ఎదురు చూస్తున్నాను" అని సమంత చెప్పింది.

ఇప్పుడు చైతన్య కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు. నిజానికి సినిమా రిలీజైన తొలి రోజు నుంచే మంచి టాక్ సంపాదించింది. తొలి 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.195 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఈ సినిమా హవా కొనసాగుతూనే ఉంది. ఫస్ట్ వీకెండ్ కంటే కూడా సెకండ్ వీకెండ్ మూవీ కలెక్షన్లు మరింత పెరగడం విశేషం.

సమంత, నాగ చైతన్యలే కాదు ఇప్పటి వరకూ బాలకృష్ణ, శివ రాజ్ కుమార్, రిషబ్ శెట్టి, డైరెక్టర్ నాగ్ అశ్విన్ లాంటి వాళ్లు కూడా ఈ హనుమాన్ మూవీపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా తెలుగులో రూ.100 కోట్ల కలెక్షన్లకు చేరువ కాగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల మార్క్ సోమవారం (జనవరి 22) అందుకోబోతోంది. ఈ సినిమా మేకర్స్ పై లాభాల వర్షం కురిపించింది.

అయోధ్య రామాలయానికి విరాళం

హనుమాన్ మూవీకి వచ్చిన ప్రతి టిక్కెట్ నుంచి 5 రూపాయల చొప్పున అయోధ్యలోని రామ మందిరానికి విరాళం ఇచ్చింది. దీంతో అయోధ్యలోని భగవాన్ శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట వేడుకల్లో చేరింది హనుమాన్ మూవీ టీమ్. అయితే, హనుమాన్‌ మూవీకి ఇప్పటివరకు 53,28,211 టిక్కెట్లు అమ్ముడుపోయాయి. వాటి నుంచి రూ.2,66,41,055 అందిస్తున్నట్లు హనుమాన్ మూవీ నిర్మాతలు ప్రకటించారు. కాగా ఇప్పటికే హనుమాన్ ప్రీమియర్ షోల నుంచి విక్రయించిన 2,97,162 టిక్కెట్ల నుంచి రూ.14,85,810 చెక్కును అందజేశారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం