తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Waltair Veerayya Title Song : వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ రిలీజ్.. డీఎస్పీ ట్యూన్ అదుర్స్

Waltair Veerayya Title Song : వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ రిలీజ్.. డీఎస్పీ ట్యూన్ అదుర్స్

HT Telugu Desk HT Telugu

26 December 2022, 21:15 IST

    • Waltair Veerayya Title Song Released : మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ఆకట్టుకుంటున్నాయి. మూడో పాట వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది.
వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్
వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ (twitter)

వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వరుస సినిమాలతో బిజిబిజిగా ఉన్నాడు. ఆచార్య, గాడ్ ఫాదర్ తో ఈ ఏడాది సందడి చేశాడు. జనవరి 13 వాల్తేరు వీరయ్య(waltair veerayya)తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఫస్ట్​లుక్ పోస్టర్, టీజర్‌తో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన రెండు పాటలతో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్(waltair veerayya Title Song) సైతం అదరగొట్టాడు డీఎస్పీ.

ట్రెండింగ్ వార్తలు

Scam 2010 Web Series: స్కామ్ 2010.. మరో వెబ్ సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. ఈసారి సుబ్రతా రాయ్ స్కామ్

Jayanthi Kannappan: కొడుకు మృతితో బాధ.. ఇద్దరి మధ్య దూరం: లలితతో ప్రకాశ్ రాజ్ విడాకులపై జయంతి కన్నప్పన్ వ్యాఖ్యలు

Janhvi Kapoor: ఎంఎస్ ధోనీ ఫిలాసఫీ మా సినిమాలో ఉంటుంది: జాన్వీ కపూర్

Aranmanai 4 - Rathnam OTT: ఒకే రోజు ఓటీటీలోకి త‌మ‌న్నా అరాణ్మ‌ణై 4...విశాల్ ర‌త్నం - ట్విస్ట్ ఏంటంటే?

బగ బగ బగ మండే.. మగ మగ మగ మగాడురా వీడే అంటూ పాట సాగుతోంది. పవర్​ ఫుల్​ బీజీఎమ్​తో ఉన్న ఈ పాట ఫ్యాన్స్​కు పూనకాలు తెప్పించేలా ఉంది. చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. అనురాగ్​ కులకర్ణి చాలా అద్భుతంగా పాడారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పవర్ ఫుల్ ట్యూన్ ఇచ్చాడు. యాక్షన్ సీక్వెన్స్ లో ఈ పాట వచ్చేలా ఉందని అర్థం అవుతోంది. ఆన్ లైన్ లో మెుదట పాటను విడుదల చేశారు. కాసేపటికి యూట్యూబ్ లోనూ అప్ లోడ్ చేశారు. ముందుగా ​ చిరంజీవి ఫొటోను చిత్ర యూనిట్​ విడుదల చేసింది. చిరు మాస్​ లుక్​లో సూపర్ గా కనిపిస్తున్నాడు.

మెగాస్టార్ చిరు(Megastar Chiru), శ్రుతిహసన్ పై మంచు కొండల్లో నువ్వు శ్రీదేవైతే.. పాటను షూట్ చేశారు. ఇటీవలే ఈ రెండో పాటను విడుదల చేసింది చిత్రబృందం. శ్రీదేవి చిరంజీవి సాంగ్(Sridevi Chiranjeevi) మీద.. గతంలో మెగాస్టార్ లీక్ ఇచ్చాడు. ఈ పాట తీసిన లొకేషన్ల గురించి., అక్కడ ఉన్న చలి, మంచులోయ అందాలు, మైనస్ 8 డిగ్రీల ఉష్ణోగ్రత గురించి చెప్పుకొచ్చాడు. దీంతో ఈ పాట మీద అందరికీ ఆసక్తి ఏర్పడింది. మెుదట విడుదలైన బాస్ పార్టీ పాట సైతం ఆకట్టుకుంది.

మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మించిన వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి తమ్ముడి పాత్రలో మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) నటిస్తున్నాడు. దర్శకుడు బాబీ సినిమాను ప్రేక్షకులు మెచ్చేలా రూపొందిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న వాల్తేరు వీరయ్య విడుదల కానుంది. సంక్రాంతికి బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి, వాల్తేర్ వీర‌య్య పోటీప‌డ‌బోతున్నాయి. రెండు సినిమాల‌నూ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం