తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Malayalam Movies In Ott: ఓటీటీల్లోకి రాబోతున్న అదిరిపోయే మలయాళం సినిమాలు ఇవే

Malayalam Movies in OTT: ఓటీటీల్లోకి రాబోతున్న అదిరిపోయే మలయాళం సినిమాలు ఇవే

Hari Prasad S HT Telugu

10 April 2023, 16:08 IST

    • Malayalam Movies in OTT: ఓటీటీల్లోకి రాబోతున్న అదిరిపోయే మలయాళం సినిమాలు ఇవే. ఈ మధ్య కాలంలో మాలీవుడ్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
మలయాళ మూవీ కరోనా పేపర్స్
మలయాళ మూవీ కరోనా పేపర్స్

మలయాళ మూవీ కరోనా పేపర్స్

Malayalam Movies in OTT: మలయాళం ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాలకు ఈ మధ్య కాలంలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా కరోనా సమయంలో ఓటీటీలకు అలవాటు పడిన తెలుగు ప్రేక్షకులు కూడా మాలీవుడ్ సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. అక్కడి స్టార్లు ఫహద్ ఫాజిల్, పృథ్విరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్ లాంటి వాళ్ల నటనకు మనవాళ్లు ఫిదా అయిపోయారు.

ట్రెండింగ్ వార్తలు

Thug Life Movie: ఆ విషయంలో రికార్డు సృష్టించిన కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ సినిమా!

Hotstar OTT Top-10: కొనసాగుతున్న మంజుమ్మల్ బాయ్స్ జోరు.. ఇంకా ఫస్ట్ ప్లేస్‍లోనే.. హాట్‍స్టార్ ఓటీటీలో టాప్-10 లిస్ట్ ఇదే

Krishnamma Day 3 Collections: కృష్ణమ్మ సినిమా కలెక్షన్ల జోరు.. తొలి రోజు కంటే మూడో రోజు ఎక్కువగా..

Bollywood: వాటి గురించి సుశాంత్ సింగ్ చాలా బాధపడేవారు: మనోజ్ బాజ్‍పేయ్

అక్కడి సినిమాల రీమేక్స్ కూడా తెలుగులో చాలానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓటీటీల్లో మలయాళం సినిమాల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే రొమాంచం, ప్రణయ విలాసం, ఖాళీ పర్స్ బిలియనీర్స్, పురుష ప్రేతమ్ లాంటి సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ ఓటీటీలలో త్వరలో రాబోతున్న మాలీవుడ్ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఓటీటీల్లోకి వస్తున్న మలయాళ సినిమాలు

కరోనా పేపర్స్ - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు)

పూక్కాలం - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు)

ఎంతడ సాజి - అమెజాన్ ప్రైమ్ వీడియో (రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు)

వేదికెట్టు - జీ5 (ఏప్రిల్ 28)

డియర్ వప్పి - మనోరమా మ్యాక్స్ (ఏప్రిల్ 13)

పాకలమ్ పాతిరావుమ్ - జీ5 (ఏప్రిల్ 21)

శేషం మైక్-ఇల్ ఫాతిమా - నెట్‌ఫ్లిక్స్ (రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు)

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం