తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kbkj Collections: భారీగా తగ్గిన 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' వసూళ్లు.. 'దసరా'లో సగం కూడా రాలేదు..!

KBKJ Collections: భారీగా తగ్గిన 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' వసూళ్లు.. 'దసరా'లో సగం కూడా రాలేదు..!

22 April 2023, 22:18 IST

    • KBKJ Collections: సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా కిసీ కా జాన్ మూవీ రంజాన్ కానుకంగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీకి డిజాస్టర్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ భారీగా తగ్గాయి.
కిసీ కా భాయ్ కిసీ కా జాన్ వసూళ్లు
కిసీ కా భాయ్ కిసీ కా జాన్ వసూళ్లు

కిసీ కా భాయ్ కిసీ కా జాన్ వసూళ్లు

KBKJ Collections: సల్మాన్ ఖాన్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన సరికొత్త చిత్రం కిసీ కా భాయ్ కిసీ కా జాన్. ఈ మూవీలో వెంకటేష్, భూమికా చావ్లా కీలక పాత్రలు పోషించారు. తమిళంలో సూపర్ హిట్టయిన అజిక్ వీరమ్ సినిమాకు రీమేక్‌గా ఇది తెరకెక్కింది. సల్మాన్ ఇందులో సరికొత్త రూపంలో దర్శనమిచ్చాడు. రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అంతేకాకుండా వసూళ్లపై కూడా భారీగా ప్రభావం పడింది. ఆడియెన్స్‌ను పెద్దగా ఆకట్టులేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రావట్లేదు.

ట్రెండింగ్ వార్తలు

Aranmanai 4 - Rathnam OTT: ఒకే రోజు ఓటీటీలోకి త‌మ‌న్నా అరాణ్మ‌ణై 4...విశాల్ ర‌త్నం - ట్విస్ట్ ఏంటంటే?

OTT Weekend Movies: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఈ సినిమాలు, వెబ్ సిరీస్‍ను మిస్ అవ్వొద్దు!

Furiosa A Mad Max Saga: మ్యాడ్‌మ్యాక్స్‌కు ప్రీక్వెల్ వ‌స్తోంది… 1400 కోట్ల విజువ‌ల్ వండ‌ర్‌ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

NNS Serial May 16th Episode: అమ‌ర్‌ను ఆట‌ప‌ట్టించిన మిస్స‌మ్మ‌- అరుంధ‌తిని చంపిన‌ మ‌నోహ‌రి - మంగ‌ళ ఫైర్‌

ఏప్రిల్ 21న విడుదలైన ఈ మూవీకి తొలి రోజు ఓపెనింగ్స్ కేవలం రూ.15.82 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇది గత 10 సంవత్సరాల్లో సల్మాన్ నటించి ఈద్‌కు విడుదల చేసిన సినిమాల వసూళ్ల కంటే అతి తక్కువగా వచ్చాయి. దశాబ్దా కాలంలో సల్మాన్ ఓపెనింగ్స్ భారీగా డ్రాప్ అవడం ఇదే తొలిసారి. చివరగా 2010 దబాంగ్ చిత్రానికి మొదటి రోజు రూ.14.50 కోట్లు వచ్చాయి. ఆ తర్వాత బాడీగార్డ్ చిత్రానికి రూ.21.60 కోట్లు లభించాయి.

ఈ పదేళ్లలో సల్మాన్‌కు వచ్చిన అతి తక్కువ కలెక్షన్లు కిసీ కా భాయ్ కిసీ కా జాన్‌కే వచ్చాయి. ఈ పదేళ్లలో ఆయన నటించిన ఏక్ థా టైగర్, బజరంగీ భాయ్ జాన్, రేస్-2, భారత్ లాంటి మూవీస్‌కు కూడా కనీసం రూ.20 కోట్ల వసూళ్లు వచ్చాయి. భారీగా వసూళ్లు డ్రాప్ అవుతుండటంతో మూవీ మేకర్స్ ఆందోళన చెందుతున్నారు.

ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమంటే తెలుగులో ఇటీవల సూపర్ హిట్టయిన నేచురల్ స్టార్ నాని నటించిన దసరా ఓపెనింగ్స్ కంటే కూడా సల్మాన్ మూవీ తక్కువగా వచ్చాయి. దసరాకు రెండో రోజు దాదాపు రూ.38 కోట్లు రాగా.. అందులో సగం కూడా ఇప్పుడు సల్మాన్ మూవీకి రాకపోవడం గమనార్హం.

కిసీ కా భాయ్ కిసీ కా జాన్ మూవీకి రివ్యూస్ అన్నీ బిలో యావరేజ్ రేటింగ్సే వచ్చాయి. లాజిక్ లెస్ సీన్లు, బోరింగ్ డ్రామాతో సినిమా ఆసక్తికరంగా లేదని రివ్యూస్‌లో తేలింది. అంతేకాకుండా ఆడియెన్స్ కూడా మొదటి నుంచి ఈ మూవీపై సానుకూల స్పందనను తెలియజేయలేదు. దీంతో మూవీకి డిజాస్టర్ టాక్ వచ్చింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం