తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సిన వాడిని టీజర్ రిలీజ్…

kiran abbavaram: కిరణ్ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సిన వాడిని టీజర్ రిలీజ్…

HT Telugu Desk HT Telugu

10 July 2022, 11:48 IST

  • కిరణ్ అబ్బవరం హీరోగా  నటిస్తున్న నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా టీజర్ ఆదివారం విడుదలైంది. మాస్, యాక్షన్, వినోదం అంశాలతో ఈ టీజర్ ఆసక్తిని పంచుతోంది. 

కిరణ్ అబ్బవరం
కిరణ్ అబ్బవరం (twitter)

కిరణ్ అబ్బవరం

సమ్మతమే సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చారు యువ హీరో కిరణ్ అబ్బవరం. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమాతో సెప్టెంబర్ లో ప్రేక్షకులను పలకరించేందుకు కిరణ్ అబ్బవరం సిద్ధమయ్యాడు. ఈ సినిమా టీజర్ ను ఆదివారం విడుదలచేశారు. ఇందులో కారు డ్రైవర్ గా కిరణ్ అబ్బవరం కనిపిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Payal Rajput Rakshana Release Date: పాయల్ రాజ్‌పుత్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ డేట్ ఇదే.. వచ్చే నెలలోనే..

Pushpa 2 Anasuya First Look: పుష్ప 2 నుంచి అనసూయ ఫస్ట్ లుక్.. దాక్షాయణి మళ్లీ వచ్చింది

Devara First Single: దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది ఆ రోజే.. ఫియర్ సాంగ్ అంటూ భయపెడుతున్న మేకర్స్

Janhvi Kapoor Partner: తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన జాన్వీ కపూర్.. ఈ లక్షణాలు తప్పనిసరిగా ఉండాల్సిందేనట

ఈ టీజర్ లో కిరణ్ అబ్బవరం, బాబా భాస్కర్ మధ్య వచ్చే సన్నివేశాలు నవ్విస్తున్నాయి. ఆ అమ్మాయి యావరేజ్ గా ఉంది అని బాబా భాస్కర్ చెప్పిన డైలాగ్ కు యావరేజ్ గా ఉన్న అమ్మాయి విలువ నాలా కరువులో ఉన్న వాడికి తెలుస్తుంది కానీ నీలా కడుపు నిండిన వాళ్లకు ఏం తెలుస్తుంది అంటూ కిరణ్ అబ్బవరం చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటున్నది. కామెడీ, పంచ్ డైలాగ్స్, మాస్ అంశాలతో టీజర్ అలరిస్తుంది

ఈ సినిమాతో దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా టాలీవుడ్ లో అరంగేట్రం చేస్తోంది. శ్రీధర్ గాదే దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఆర్. కళ్యాణ మండపం తర్వాత కిరణ్ అబ్బవరం, శ్రీధర్ గాదే కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. సంజన ఆనంద్ హీరోయిన్ గా నటిస్తోంది. సెప్టెంబర్ 9న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొన్నది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం