తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kgf 2 | హైదరాబాద్‌లో కేజీఎఫ్‌ టీమ్‌.. అచ్చ తెలుగులో మాట్లాడి అలరించిన యశ్‌

KGF 2 | హైదరాబాద్‌లో కేజీఎఫ్‌ టీమ్‌.. అచ్చ తెలుగులో మాట్లాడి అలరించిన యశ్‌

HT Telugu Desk HT Telugu

11 April 2022, 21:48 IST

    • KGF టీమ్‌ ప్రమోషన్లలో తీరిక లేకుండా గడుపుతోంది. సినిమా రిలీజ్‌కు మరో మూడు రోజుల సమయం ఉన్న వేళ ఈ టీమ్‌ సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించింది.
హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్లో ప్రెస్ మీట్ కు వస్తున్న యశ్
హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్లో ప్రెస్ మీట్ కు వస్తున్న యశ్ (Twitter)

హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్లో ప్రెస్ మీట్ కు వస్తున్న యశ్

హైదరాబాద్‌: కేజీఎఫ్‌.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట. కొన్నాళ్ల కిందటి వరకూ ఆర్‌ఆర్ఆర్‌ మూవీ గురించి దేశమంతా ఎలా చర్చించుకుందో ఇప్పుడు కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 మూవీ గురించీ అలాంటి చర్చే నడుస్తోంది. మూడున్నరేళ్ల కిందట వచ్చిన ఫస్ట్‌ పార్ట్‌ సృష్టించిన సంచలనాల కారణంగా ఇది ప్రధానంగా కన్నడలో రూపొందించిన మూవీయే అయినా.. తెలుగుతోపాటు హిందీ ప్రేక్షకుల్లోనూ ఎంతో ఆసక్తి రేపుతోంది.

ట్రెండింగ్ వార్తలు

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. స్క్రిప్ట్, టైటిల్ ఫిక్స్ అయినా పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

ఇలాంటి పరిస్థితుల్లో కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 సినిమా ప్రమోషన్లలో మూవీ టీమ్‌ బిజీగా ఉంది. ఇందులో భాగంగా సోమవారం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పర్యటించింది. తిరుపతి, విశాఖపట్నంతోపాటు హైదరాబాద్‌లోనూ ప్రెస్‌మీట్లు నిర్వహించింది. అయితే వీటిలో హీరో యశ్‌ అచ్చ తెలుగులో మాట్లాడటం ఎంతో ఆకట్టుకుంది. తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానంతో తాను కూడా తెలుగు నేర్చుకున్నట్లు యశ్‌ చెప్పడం విశేషం.

ఈ రాకీ భాయ్ అడుగు పెట్టిన ప్రతి చోటా అభిమానులు కూడా అలాగే అతన్ని అక్కున చేర్చుకున్నారు. కేజీఎఫ్‌ తనలో చాలా మార్పులు తీసుకొచ్చిందని, తెలుగులో మాట్లాడటం కూడా అందులో భాగమేనని అతను నవ్వుతూ అన్నాడు. ఓచోట ప్రెస్‌మీట్‌కు ఆలస్యంగా రావడంపై ఓ జర్నలిస్ట్‌ ప్రశ్నించినప్పుడు అతడు క్షమాపణ కూడా చెప్పి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు.

రాకీ భాయ్‌ క్యారెక్టర్‌తో ఎమోషనల్‌గా తాను కనెక్ట్‌ అయ్యానని హైదరాబాద్‌ ప్రెస్‌మీట్‌లో యశ్‌ చెప్పాడు. అయితే సినిమా షూటింగ్‌లో ఉన్నంతసేపు మాత్రమే తాను క్యారెక్టర్‌తో కనెక్ట్‌ అవుతానని, ఆ తర్వాత సినిమా ఎంత పెద్ద హిట్‌ అయినా కూడా దానిని తనదిగా ఇక భావించనని అన్నాడు. ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చిత్రీకరించామని, తెలుగు టెక్నీషియన్లు కూడా ఎంతోమంది దీనికి పని చేశారని చెప్పాడు. ఈ సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకునే అనుమతి లభిస్తుందని తాను భావిస్తున్నట్లు యశ్‌ అన్నాడు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం