తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kerala Crime Files Teaser: సెక్స్ వర్కర్ మర్డర్ చుట్టూ తిరిగే క్రైమ్ థ్రిల్లర్.. కేరళ క్రైమ్ ఫైల్స్ టీజర్

Kerala Crime Files Teaser: సెక్స్ వర్కర్ మర్డర్ చుట్టూ తిరిగే క్రైమ్ థ్రిల్లర్.. కేరళ క్రైమ్ ఫైల్స్ టీజర్

Hari Prasad S HT Telugu

15 May 2023, 22:09 IST

    • Kerala Crime Files Teaser: సెక్స్ వర్కర్ మర్డర్ చుట్టూ తిరిగే క్రైమ్ థ్రిల్లర్ స్టోరీతో వచ్చేసింది కేరళ క్రైమ్ ఫైల్స్ టీజర్. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో వస్తున్న తొలి మలయాళం వెబ్ సిరీస్ ఇదే.
కేరళ క్రైమ్ ఫైల్స్ వెబ్ సిరీస్ లో లాల్
కేరళ క్రైమ్ ఫైల్స్ వెబ్ సిరీస్ లో లాల్

కేరళ క్రైమ్ ఫైల్స్ వెబ్ సిరీస్ లో లాల్

Kerala Crime Files Teaser: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అందిస్తున్న తొలి మలయాళ వెబ్ సిరీస్ కేరళ క్రైమ్ ఫైల్స్ టీజర్ సోమవారం (మే 15) రిలీజైంది. ఓ సెక్స్ వర్కర్ మర్డర్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది. మధురం, జూన్ లాంటి సినిమాలు తీసిన డైరెక్టర్ అహ్మద్ కబీర్ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Prasanna Vadanam OTT Release date: ప్రసన్న వదనం ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఇలా చేస్తే 24 గంటలు ముందుగానే చూడొచ్చు..

Devara fear song promo: దేవర ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ప్రోమో చూశారా.. అదిరిపోయిన బీజీఎం

Suresh Babu on Theatres: ఓటీటీ మమ్మల్ని దెబ్బ కొడుతోంది.. థియేటర్లలను ఫంక్షన్ హాల్స్‌గా మార్చాల్సిందే: సురేశ్ బాబు

Prabhas Instagram Story: ప్రభాస్ పెళ్లి కాదు.. అతని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వెనుక అసలు విషయం ఇదీ

మలయాళ నటులు లాల్, అజూ వర్గీస్ ఇందులో ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎంతో ఆసక్తి రేపుతోంది. సెక్స్ వర్కర్ ను హత్య చేసిన వ్యక్తిని పట్టుకునే ఇద్దరు పోలీసులు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. షిజు పేరుతో ఓ తప్పుడు అడ్రెస్ మాత్రం ఈ కేసులో క్లూగా పోలీసులకు దొరుకుతుంది. మరీ ఈ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారా లేదా అన్నది ఈ సిరీస్ లో చూడాల్సిందే.

ఈ ఏడాది మొదట్లోనే కేరళ క్రైమ్ ఫైల్స్ సిరీస్ షూటింగ్ పూర్తయింది. ఈ సిరీస్ ఆరు ఎపిసోడ్లు పాటు ఉండనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే స్ట్రీమింగ్ తేదీని మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. టీజర్ లో కమింగ్ సూన్ అని మాత్రమే చెప్పారు. ఈ వెబ్ సిరీస్ లో అజు, లాల్ తోపాటు కొందరు కొత్త నటీనటులు కూడా కనిపించారు.

ఓటీటీల్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చాయి. తాజాగా ఈ కేరళ క్రైమ్ ఫైల్స్ కూడా అందులో ఒకటి. భిన్నమైన కథ, కథనాలతో ప్రేక్షకులను ఆకర్షిస్తుంటారు మలయాళ దర్శకులు. ఈ తాజా సిరీస్ టీజర్ చూస్తుంటే కూడా అలాగే అనిపిస్తోంది. నిజానికి ఈ కేరళ క్రైమ్ ఫైల్స్ కూడా వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిందే.

ఈ వెబ్ సిరీస్ మలయాళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మరాఠీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. మలయాళ సినిమాలు, సిరీస్ లను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులు ఈ సిరీస్ ను తెలుగులోనూ చూడొచ్చు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం