తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Keerthy Suresh: ఆకాశమే నీ హద్దురా ద‌ర్శ‌కురాలితో కీర్తిసురేష్ సినిమా

Keerthy Suresh: ఆకాశమే నీ హద్దురా ద‌ర్శ‌కురాలితో కీర్తిసురేష్ సినిమా

12 August 2022, 6:05 IST

  • సూరారైపొట్రు (Soorarai Pottru) సినిమాతో ద‌ర్శ‌కురాలిగా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు జాతీయ అవార్డును సొంతం చేసుకొని ప్ర‌తిభ‌ను చాటింది సుధా కొంగ‌ర‌(Sudha kongara). తాజాగా ఆమె ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమాలో ఎవ‌రు హీరోయిన్‌గా న‌టించ‌నున్నారంటే...
కీర్తిసురేష్
కీర్తిసురేష్ (instagram)

కీర్తిసురేష్

సూర్య హీరోగా న‌టించిన త‌మిళ చిత్రం సూరారైపొట్రు (తెలుగులో ఆకాశమే నీ హద్దురా పేరుతో రిలీజ్ అయింది) ఐదు జాతీయ అవార్డుల‌ను సొంతం చేసుకున్న‌ది. ఉత్త‌మ సినిమాతో పాటు ప‌లు విభాగాల్లో ఆస్కార్ రేసులో నిలిచి ద‌క్షిణాది సినిమా స‌త్తాను చాటింది. ఎయిర్ ద‌క్క‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు జీఆర్ గోపీనాథ్ జీవితంతో స్ఫూర్తిదాయ‌కంగా ఈ సినిమాను తెర‌కెక్కించి ద‌ర్శ‌కురాలిగా ప్ర‌తిభ‌ను చాటుకున్నారు సుధా కొంగ‌ర‌. సూరారైపొట్రు సినిమాకుగాను బెస్ట్ స్క్రీన్‌ప్లే రైట‌ర్‌గా ఉషానాయ‌ర్‌తో క‌లిసి సుధా కొంగ‌ర జాతీయ అవార్డును ద‌క్కించుకున్న‌ది.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

ప్ర‌స్తుతం అక్ష‌య్ కుమార్ హీరోగా సూరారైపొట్రు సినిమాను సుధా కొంగ‌ర హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ రీమేక్ త‌ర్వాత ఆమె ఓ లేడీ ఓరియెంటెండ్ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో మ‌హాన‌టి సినిమాతో నేషనల్ అవార్డును అందుకున్న కీర్తిసురేష్ హీరోయిన్‌గా న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఛాలెంజింగ్ స్క్రిప్ట్‌తో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ పాత్ర స‌రికొత్త‌గా ఉండ‌నున్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిల్మ్స్ ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని నిర్మించ‌బోతున్న‌ట్లు తెలిసింది. సుధా కొంగ‌ర చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో కీర్తిసురేష్ ఈ సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. త‌మిళంతో పాటు తెలుగులో ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం కీర్తిసురేష్ తెలుగులో చిరంజీవి భోళాశంక‌ర్ సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తోంది. అలాగే నాని ద‌స‌రా సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది.


టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం