తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kaikala Satyanarayana Death: నవరస నట సార్వభౌముడికి టాలీవుడ్‌ ప్రముఖుల నివాళులు

Kaikala Satyanarayana Death: నవరస నట సార్వభౌముడికి టాలీవుడ్‌ ప్రముఖుల నివాళులు

Hari Prasad S HT Telugu

23 December 2022, 9:48 IST

    • Kaikala Satyanarayana: దివికేగిన నవరస నట సార్వభౌముడు సత్యనారాయణకు టాలీవుడ్‌ ప్రముఖులు నివాళులు అర్పించారు. సోషల్‌ మీడియాలో తమ సంతాప సందేశాలను పోస్ట్ చేస్తున్నారు.
కైకాల సత్యనారాయణ పార్థివదేహం
కైకాల సత్యనారాయణ పార్థివదేహం

కైకాల సత్యనారాయణ పార్థివదేహం

Kaikala Satyanarayana: నవరస నట సార్వభౌముడు అన్న బిరుదే కైకాల సత్యనారాయణ ఎంతటి ప్రతిభావంతుడో చెబుతుంది. గంభీరమైన స్వరం, అన్ని భావాలను ముఖంలో పలికించగలిగే తీరు టాలీవుడ్‌ ఆయనను ప్రత్యేకంగా నిలిపింది. జానపద, పౌరాణిక, సాంఘీక చిత్రాలన్న తేడా లేకుండా తనకు వచ్చిన పాత్రలో జీవించేసే నటుడాయన. 700కుపైగా సినిమాల్లో నటించి మెప్పించిన అంతటి నటుడు కొంతకాలంగా అనారోగ్యానికి గురై శుక్రవారం (డిసెంబర్‌ 23) తెల్లవారుఝామున కన్నుమూశారు. ఆ గొప్ప నటుడిని స్మరించుకుంటూ టాలీవుడ్‌ ప్రముఖులు ఎందరో తమ నివాళులు అర్పిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Jai Ganesh OTT: ఓటీటీలోకి భాగ‌మ‌తి హీరో మ‌ల‌యాళం క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ - తెలుగులో స్ట్రీమింగ్‌

Game Changer Release Date:రామ్ కోసం భీమ్ త్యాగం...దేవ‌ర డేట్‌కు థియేట‌ర్ల‌లోకి వ‌స్తోన్న గేమ్‌ఛేంజ‌ర్‌

Pawan Kalyan Vote: హెలికాప్టర్‌లో వచ్చి ఓటేసిన పవన్ కల్యాణ్ దంపతులు.. ఫొటోలు, వీడియోలు వైరల్

Allu Arjun Vote: అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నాడా? నంద్యాలో వైఎస్సార్సీపీ అభ్యర్థికి మద్దతుపై ఇదీ అతని సమాధానం

తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ, నవరస నటనా సారభౌముడు సత్యనారాయణ మృతి చెందడం తనను ఎంతగానో కలచి వేస్తోందని మెగాస్టార్‌ చిరంజీవి తన సంతాపం వ్యక్తం చేశాడు. నటన అన్నా, రుచికరమైన భోజనం అన్నా ఆయనకు ఎంతగానో ఇష్టమని, తన శ్రీమతి సురేఖ చేతి వంటను బాగా ఇష్టపడేవారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. అంతేకాదు చివరిసారి ఆయన పుట్టిన రోజు వేడుకల్లో తాను పాల్గొన్న ఫొటోలను కూడా ట్విటర్‌లో షేర్‌ చేసుకున్నాడు.

అటు నందమూరి బాలకృష్ణ కూడా సత్యనారాయణకు నివాళులర్పించాడు. ఆయన మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, తమ కుటుంబంతో ఆయనకు స్నేహ సంబంధాలు ఉన్నాయని ఈ బాలకృష్ణ అన్నాడు. సినీ జీవితంలోనూ, ఎంపీగా ప్రజా జీవితంలోనూ సత్యనారాయణ తనదైన ముద్ర వేశారని కొనియాడాడు.

రామ్‌చరణ్‌ ట్విటర్‌లో స్పందిస్తూ.. కైకాల సత్యనారాయణ మరణం తనను ఎంతగానో కలిచి వేసిందని అన్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా మిగిలిపోతాయని అన్నాడు.

తన ఫేవరెట్‌ నటుల్లో కైకాల సత్యనారాయణ ఒకరని మరో నటుడు నాని తన సంతాప సందేశంలో అన్నాడు. మన ఇంట్లో మనిషిలా అనిపిస్తారని, ఆయనో లెజెండ్‌ అంటూ నివాళులు అర్పించాడు. మరో నటుడు నందమూరి కల్యాణ్‌ రామ్‌ కూడా ట్విటర్‌ ద్వారా కైకాల మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం