తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Heroines Marriage: వీరి ప్రేమకు అవధుల్లేవు.. పెళ్లికి సరిహద్దులు సరిపోవు

Heroines Marriage: వీరి ప్రేమకు అవధుల్లేవు.. పెళ్లికి సరిహద్దులు సరిపోవు

30 November 2021, 11:30 IST

    • ఫలానా హీరోయిన్ పెళ్లి చేసుకుంటుందంటే.. ఎవరు? ఎప్పుడు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి? లాంటి విషయాల గురించి అభిమానులు తప్పకుండా నెట్టింట వెతుకుతారు. అయితే కొంతమంది హీరోయిన్ల ప్రేమ సరిహద్దులు దాటింది. విదేశీ వ్యక్తులను పరిణయమాడి ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.
విదేశీయులను వివాహం చేసుకున్న హీరోయిన్లు
విదేశీయులను వివాహం చేసుకున్న హీరోయిన్లు (Hindustan times)

విదేశీయులను వివాహం చేసుకున్న హీరోయిన్లు

ప్రేమకు.. కులం, మతం, రంగు, వయస్సు, ప్రాంతంతో సంబంధం లేదు. అది ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరిలోనైనా పుట్టవచ్చు. అయితే ప్రేమ పెళ్లి వరకు వెళ్తేనే ఆ బంధం విజయవంతమవుతుంది. ముఖ్యంగా సినీ ప్రముఖులు ఎవరైనా ప్రేమలో పడ్డారంటే అందరి దృష్టి వారిపైనే ఉంటుంది. అందులోనూ హీరోయిన్ల విషయంలో ఈ హడావిడి ఎక్కువగా ఉంటుంది. ఫలానా హీరోయిన్ పెళ్లి చేసుకుంటుందంటే.. ఎవరు? ఎప్పుడు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి? లాంటి విషయాల గురించి అభిమానులు తప్పకుండా నెట్టింట వెతుకుతారు. అయితే కొంతమంది హీరోయిన్ల ప్రేమ సరిహద్దులు దాటింది. విదేశీ వ్యక్తులను పరిణయమాడి ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశాంతర వివాహాలు చేసుకున్న ముద్దుగుమ్మలెవరో ఇప్పుడు చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

ప్రియాంక చోప్రా- నిక్ జోనస్..

బాలివుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరి పక్కన నటించి చక్కటి గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక చోప్రా. మహిళా ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు హాలీవుడ్ లోనూ తన మార్కును చూపించింది. ప్రేమ విషయంలోనూ అంతే ప్రత్యేకతను చాటుకుందీ ముద్దుగుమ్మ. తనకంటే పదేళ్ల చిన్న వాడైన అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ను వివాహం చేసుకుంది. 2018లో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. అనంతరం ఈ జంట సామాజిక మాధ్యమాల్లో ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇటీవల వీరిద్దరూ విడిపోతున్నారంటూ వార్తలు వచ్చినప్పటికీ ప్రియాంక ఆ వదంతులకు చెక్ పెట్టి తమ ప్రేమ బంధం గురించి బహిర్గతపరిచింది.

శ్రియా శరణ్- ఆండ్రూ కొశ్చివ్..

తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఇలా చాలా భాషల్లో నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకుంది శ్రియా. తన వ్యక్తిగత జీవితాన్ని ఎంతో గోప్యంగా ఉంచే శ్రియా రష్యాకు చెందిన ఆండ్రూ కొశ్చివ్ ను వివాహం చేసుకుంది. 2018లో వీరి వివాహం జరిగింది. భర్తతో పాటు గడిపిన ఆనందకరమైన క్షణాలను, స్మృతులను ఎప్పుడూ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు షేర్ చేస్తోంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ తో పాటు తమిళం, హిందీలో చెరో చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.

రాధికా ఆప్టే- బెన్ డిక్ట్ టేలర్..

రక్త చరిత్ర, లెజెండ్ లాంటి సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రాధికా ఆప్టే. అనంతరం హిందీలో వరుస చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. బోల్డ్ నటనకు పెట్టింది పేరుగా రాధిక ఆప్టేకు గుర్తింపు ఉంది. ఈ బాలివుడ్ ముద్దుగుమ్మ 2012లో బ్రిటన్ కు చెందిన ప్రముఖ వయోలినిస్ట్ బెన్ డిక్ట్ టేలర్ ను వివాహం చేసుకుంది. చాలాకాలం సహజీవనం తర్వాత పెళ్లిపీటలెక్కింది.

ప్రీతి జింతా- జీన్..

బాలివుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రీతి జింతా అనంతరం ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టు యజమానిగా బిజీ అయింది. 2016లో తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ జీన్ గుడ్ఇనఫ్ ను వివాహం చేసుకుంది. అనంతరం వీరిద్దరూ అమెరికాలోని లాస్ ఏంజెల్స్ కు షిఫ్ట్ అయ్యారు. అప్పుడప్పుడు భారత్ కు వస్తూ పోతూ ఉంది ప్రీతి. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ కవలలకు జన్మనిచ్చింది.

సెలినా జెట్లీ- పీటర్ హాగ్..

తెలుగులో మంచు విష్ణు సరసన సూర్యం(2004) చిత్రంతో సందడి చేసిన సెలీనా జెట్లీ అనంతరం బాలివుడ్ లో పలు సినిమాల్లో నటించింది. ఎక్కువగా ప్రత్యేక గీతాలతోనే ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ 2011లో ఆస్ట్రియాకు చెందిన పీటర్ హాగ్ ను వివాహం చేసుకుంది. వీరికి ముగ్గురు పిల్లలు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం