తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Trailer | సెగలు పుట్టిస్తోన్న Rgv ‘మా ఇష్టం’ ట్రైలర్.. ఇద్దరు అమ్మాయిల ప్రేమ కథ

Trailer | సెగలు పుట్టిస్తోన్న RGV ‘మా ఇష్టం’ ట్రైలర్.. ఇద్దరు అమ్మాయిల ప్రేమ కథ

HT Telugu Desk HT Telugu

22 March 2022, 21:59 IST

    • ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకుంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే కథాంశంతో రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం మా ఇష్టం. నైనా గంగూలీ, అప్సరా రాణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదల కానుంది.
మా ఇష్టం ట్రైలర్
మా ఇష్టం ట్రైలర్ (twitter)

మా ఇష్టం ట్రైలర్

ఎప్పుడూ సంచలనాలకు తెరలేపే రామ్‌గోపాల్ వర్మ ఏది చేసినా పబ్లిసిటీ కోసమే. ఎప్పుడు ఎవరిని పొగుడుతారో.. ఎవరిపై విమర్శలు సంధిస్తారో ఆయనకు తప్పు మరోకరికి తెలియదు. ఆయన సినిమాలు కూడా రొటీన్‌కు భిన్నంగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో వరుస పెట్టి ఆర్జీవీ సినిమాలు బోల్తా పడుతున్నప్పటికీ.. ఒకప్పుడు విభిన్న కథలకు ఆయన పెట్టింది పేరు. అలాంటి విభిన్న చిత్రమే మా ఇష్టం. ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది అనేదే ఈ చిత్ర కథాంశం. అంతేకాకుండా లవ్ స్టోరీకి యాక్షన్ క్రైమ్‌ను యాడ్ చేశారు మన వర్మ. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఎప్పుడు విడుదల కాగా.. తాజాగా చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

ఇండియాలో మొదటి లెస్బియన్ ప్రేమ కథగా వస్తోన్న ఈ సినిమా ట్రైలర్ సెగలు పుట్టిస్తోంది. నైనా గంగూలీ, అప్సరా రాణి అందాల అరబోతతో ట్రైలర్ చూస్తేనే పిచ్చేక్కించేశారు వర్మ. మరి ఇంక సినిమా చూస్తే ఏ రేంజ్‌లో ఉంటుందోనని సినీ ప్రియులు ఇప్పుడే అంచనాలను పెంచేసుకుంటున్నారు. ట్రైలర్ చూస్తుంటే శృంగారం శృతిమించిందే అనిపిస్తోంది. లిప్ లాక్‌లు, రొమాంటిక్ సన్నివేశాలకు కొరతే లేనట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ శృంగార సన్నివేశాలకు తోడు క్రైమ్‌ను జోడించడంతో వయెలెన్స్‌కు ఎక్కువగానే ఉందని తెలుసుకోవచ్చు.

ఇద్దర అమ్మాయిల గాఢ ప్రేమకు నిదర్శనమే ఈ సినిమా అని రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. ప్రేమకు లింగ బేధం లేదని ఈ చిత్రం ద్వారా వర్మ చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది. మొదట ఈ సినిమాకు డేంజరస్ అని పేరు పెట్టారు. అయితే అనంతరం ఆ పేరును తొలగించి మా ఇష్టం అనై టైటిల్‌తో ఇద్దరు అమ్మాయిల ప్రేమ కథన్ శీర్షికతో ఈ సినిమా రానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 8వ తేదీని ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం