తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Sohel: పబ్లిసిటీకి డబ్బుల్లేవ్: బూట్‍కట్ బాలరాజు ఈవెంట్‍లో ఎమోషనల్ అయిన సోహెల్

Bigg Boss Sohel: పబ్లిసిటీకి డబ్బుల్లేవ్: బూట్‍కట్ బాలరాజు ఈవెంట్‍లో ఎమోషనల్ అయిన సోహెల్

29 January 2024, 23:27 IST

    • Bigg Boss Syed Sohel - Bootcut Balaraju: బూట్‍కట్ బాలరాజు సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో సయ్యద్ సోహెల్ ఎమోషనల్ అయ్యారు. ఈ చిత్రానికి పబ్లిసిటీ చేసేందుకు డబ్బులు లేవంటూ.. ప్రేక్షకులకు రిక్వెస్ట్ చేశాడు.
బూట్‍కట్ బాలరాజు ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో సయ్యద్ సోహెల్
బూట్‍కట్ బాలరాజు ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో సయ్యద్ సోహెల్

బూట్‍కట్ బాలరాజు ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో సయ్యద్ సోహెల్

Bigg Boss Syed Sohel - Bootcut Balaraju: బిగ్‍బాస్ ఫేమ్ సయ్యద్ సోహెల్ హీరోగా నటించిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా గతేడాది రిలీజ్ అయింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీకి మంచి టాక్ వచ్చింది. అయితే, కమర్షియల్‍గా ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఇప్పుడు, సోహెల్ హీరోగా నటించిన బూట్‍కట్ బాలరాజు సినిమా రిలీజ్‍కు రెడీ అయింది. మరో నాలుగు రోజుల్లో అంటే ఫిబ్రవరి 2వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీ నిర్మాణంలోనూ సోహెల్ భాగస్వామిగా ఉన్నాడు. ఈ తరుణంలో బూట్‍కట్ బాలరాజు ప్రీ-రిలీజ్ ఈవెంట్‍ను మూవీ టీమ్ నేడు (జనవరి 29) నిర్వహించింది.

ట్రెండింగ్ వార్తలు

Heeramandi 2: హీరామండి వెబ్ సిరీస్‍ రెండో సీజన్ వస్తుందా? డైరెక్టర్, యాక్టర్ ఏం చెప్పారంటే..

OTT Web Series: నేహా శర్మ పాపులర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

బూట్‍కట్ బాలరాజు ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో సయ్యద్ సోహెల్ ఎమోషనల్‍గా మాట్లాడారు. ఇంత కంటే పబ్లిసిటీ చేసేందుకు తన వద్ద డబ్బులు లేవని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ చూడాలని రిక్వెస్ట్ చేశాడు. స్టేజీపైనే మోకాళ్లపై కూర్చొని ఎమోషనల్ అయ్యారు.

“ఇంతకన్నా ఎక్కువ ఏమీ అడగలేను. నా సినిమా చూడండి. బూట్‍కట్ బాలరాజు మూవీకి అందరూ వెళ్లండి. నా దగ్గర పైసలు లేవు పబ్లిసిటీకి. ఇదే నా ప్లాట్‍ఫామ్. అన్నీ చెప్పేశా. జీవితంలో ఏం జరిగిందో అన్నీ చెప్పేశా. నా సినిమా చూడండి.. ఇంతకన్నా ఏమీ చెప్పను” అని సోహెల్ ఎమోషనల్‍గా మాట్లాడారు.

బిగ్‍బాస్‍లో ఉన్నప్పుడు తాను ఎలా అల్లరి చేశానో.. ఎలా మాట్లాడానో బూట్‍కట్ బాలరాజులోనూ అలాగే ఉంటుందని సోహెల్ చెప్పారు. ఫన్‍తో పాటు ఈ చిత్రంలో ఎమోషన్ కూడా బలంగా ఉంటుందని తెలిపారు.

బూట్‍కట్ బాలరాజు సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు యంగ్ హీరో సందీప్ కిషన్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం అతిథులుగా వచ్చారు. సోహెల్ కచ్చితంగా సక్సెస్ అవుతాడనే నమ్మకం తనకు ఉందని బ్రహ్మానందం చెప్పారు.

బూట్‍కట్ బాలరాజు సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍ను ప్రముఖ యాంకర్ సుమ హోస్ట్ చేశారు. అయితే, ఈ ఈవెంట్ కోసం సుమ రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఉచితంగా చేసేందుకు అంగీకరించారని సోహెల్ ఇటీవల చెప్పారు. సుమ అడ్డా గేమ్ షోలో పాల్గొన్న సోహెల్ ఈ విషయాన్ని వెల్లడించారు. సుమకు థ్యాంక్స్ చెప్పారు.

బూట్‍కట్ బాలరాజు సినిమాలో సోహెల్ సరసన మేఘలేఖ హీరోయిన్‍గా నటించారు. సునీల్, సిరి హన్మంతు, ఇంద్రజ, అవినాశ్, సద్దాం, వివేక్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శ్రీ కోనేటి దర్శకత్వం వహించారు. భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించారు. మహమ్మద్ పాషా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవలే వచ్చిన బూట్‍కట్ బాలరాజు ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ మూవీ ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఇటీవల జరిగిన బూట్‍కట్ బాలరాజు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో సోహెల్ చేసిన కామెంట్లు చర్చనీయాంశం అయ్యాయి. తాను ఈ మూవీ ప్రమోషన్ల కోసం సాయం అడిగితే యువ హీరోలు ఎవరూ ముందుకు రాలేదని, కనీసం ఫోన్లో మాట్లాడేందుకు కూడా ఆసక్తి చూపలేదని సోహెల్ అన్నారు. సీనియర్ హీరో వెంకటేశ్ మాత్రమే ఆల్ ది బెస్ట్ అని తనకు రిప్లే ఇచ్చారని సోహెల్ తెలిపారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం