తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hanuman Day 1 Collection: హనుమాన్ ఫస్ట్ డే కలెక్షన్స్ అదుర్స్.. హిట్‌ కొట్టాలంటే అన్నికోట్లు రావాల్సిందే!

Hanuman Day 1 Collection: హనుమాన్ ఫస్ట్ డే కలెక్షన్స్ అదుర్స్.. హిట్‌ కొట్టాలంటే అన్నికోట్లు రావాల్సిందే!

Sanjiv Kumar HT Telugu

13 January 2024, 14:13 IST

  • Hanuman 1st Day Collection: క్రేజీ బజ్ క్రియేట్ చేసుకున్న హనుమాన్ మూవీ జనవరి 12న విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతోంది. అలాగే బాక్సాఫీస్ బరిలో కూడా హనుమాన్ కలెక్షన్లతో సత్తా చాటుతోంది. హనుమాన్ మూవీకి తొలిరోజు ఎన్ని కోట్లు వచ్చాయనే లెక్కల్లోకి వెళితే..

హనుమాన్ ఫస్ట్ డే కలెక్షన్స్ అదుర్స్.. హిట్‌ కొట్టాలంటే అన్నికోట్లు రావాల్సిందే!
హనుమాన్ ఫస్ట్ డే కలెక్షన్స్ అదుర్స్.. హిట్‌ కొట్టాలంటే అన్నికోట్లు రావాల్సిందే! (Instagram)

హనుమాన్ ఫస్ట్ డే కలెక్షన్స్ అదుర్స్.. హిట్‌ కొట్టాలంటే అన్నికోట్లు రావాల్సిందే!

Hanuman Day 1 Worldwide Collection: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన సినిమా హనుమాన్. భారీ అంచనాల నడుమ సంక్రాంతి బరిలోకి జనవరి 12న థియేటర్లలో విడుదలైన హనుమాన్ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద కూడా భారీగానే వసూళ్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Malayalam Movie: వామ్మో ఇదేం టైటిల్‌ -ఈ కొత్త మ‌ల‌యాళం మూవీ పేరు చెప్ప‌డానికి నోరు తిర‌గ‌డం క‌ష్ట‌మే!

NNS May 17th Episode: మళ్లీ భూలోకానికి అరుంధతి.. ఈసారి యముడు కూడా.. అమర్​కి తలంటిన భాగీ.. పిల్లలను రెచ్చగొట్టిన మనోహరి

Brahmamudi May 17th Episode: బ్రహ్మముడి- అనామికకు కల్యాణ్ విడాకులు- లేచిపోదామన్న అప్పు- తాతయ్య వార్నింగ్- కావ్యకు 2 డేస్

Ntr Prashanth Neel Movie: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీ టైటిల్ ఇదేనా? - కేజీఎఫ్‌కు మించి యాక్ష‌న్‌…ఎలివేష‌న్స్?

హనుమాన్ ప్రీ రిలీజ్ బిజినెస్

హనుమాన్ మూవీకి వరల్డ్ వైడ్‌గా బాగానే మార్కెట్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ మూవీకి రూ. 29.65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. దాంతో సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 31 కోట్లుగా ఫిక్స్ అయింది. అంటే రూ. 31 కోట్లు రాబడితేనే హనుమాన్ మూవీ హిట్ అయినట్లు. ఇక ఈ రూ. 29.65 కోట్లలో తెలంగాణ రాష్ట్రంలోని నైజాం ఏరియాలో రూ. 7.15 కోట్లు, సీడెడ్‌లో రూ. 4 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 9.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది.

హనుమాన్ బడ్జెట్

హనుమాన్ చిత్రానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి రూ. 20.65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కర్ణాటక రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు చేసుకుంది. ఇక ఓవర్సీస్‌లో రూ. 4 కోట్ల, ఇతర ప్రాంతాలన్ని కలిపి రూ. 3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది హనుమాన్ మూవీ. తేజ సజ్జా హీరోగా చేసిన హనుమాన్ చిత్రానికి రూ. 50 కోట్ల బడ్జెట్ అయినట్లు సమాచారం. ఇక హనుమాన్ సినిమాకు విడుదలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ ద్వారా రూ. 2.85 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి.

హనుమాన్ ఫస్ట్ డే కలెక్షన్స్

అలాగే హనుమాన్ చిత్రానికి తొలి రోజున రూ. 5.12 కోట్లు వసూలు అయ్యాయి. ప్రీమియర్స్, తొలి రోజు వసూళ్లు రెండు కలిపి ఏపీ, తెలంగాణలో రూ. 7.97 కోట్ల షేర్, రూ. 12.35 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయింది. వాటిలో నైజాంలో రూ. 3.66 కోట్లు, సీడెడ్‌లో రూ. 86 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 94 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 90 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 48 లక్షలు, గుంటూరులో రూ. 55 లక్షలు, కృష్ణాలో రూ. 34 లక్షలు, నెల్లూరులో 24 లక్షలు కలెక్ట్ అయ్యా.యి.

హనుమాన్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

ఇక కర్ణాటకలో హనుమాన్ చిత్రానికి తొలి రోజు రూ. 1.10 కోట్లు, హిందీతోపాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.55 కోట్లు కలెక్షన్స్ వసూలు అయ్యాయి. ఇవన్నీ కలుపుకుని హనుమాన్ మూవీకి ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ. 13.77 కోట్ల షేర్, రూ. 24.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే, రూ. 31 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోవాలంటే హనుమాన్ సినిమాకు ఇంకా రూ. 17.23 కోట్లు రావాలి.

హనుమాన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్

శుక్రవారం రోజున గుంటూరు కారం సినిమా పోటీ ఉన్నా హనుమాన్ సినిమా బాగానే కలెక్ట్ చేసింది. తొలి రోజు రూ. 13.77 కోట్లు కలెక్ట్ చేసిన హనుమాన్ మరో 17 కోట్లను ఆదివారం లోపు కలెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు కారం సినిమాకు నెగెటివ్ టాక్, సైంధవ్‌కు మిక్స్‌డ్ టాక్ రావడంతో ప్రేక్షకులు హనుమాన్ వైపుకే మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. అలా హనుమాన్‌కు తక్కువ రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం