తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  My Name Is Shruthi Ott Release: హ‌న్సిక క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ మై నేమ్ ఈజ్ శృతి ఓటీటీ రిలీజ్ డేట్ క‌న్ఫామ్

My Name is Shruthi OTT Release: హ‌న్సిక క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ మై నేమ్ ఈజ్ శృతి ఓటీటీ రిలీజ్ డేట్ క‌న్ఫామ్

10 December 2023, 9:34 IST

  • My Name is Shruthi OTT Release: హ‌న్సిక హీరోయిన్‌గా న‌టించిన మై నేమ్ ఈజ్ శృతి మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం.

మై నేమ్ ఈజ్ శృతి
మై నేమ్ ఈజ్ శృతి

మై నేమ్ ఈజ్ శృతి

My Name is Shruthi OTT Release: మై నేమ్ ఈజ్ శృతి మూవీతో దాదాపు నాలుగేళ్ల విరామం త‌ర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది హ‌న్సిక‌. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీ హ‌న్సిక‌కు స‌క్సెస్‌ను తెచ్చిపెట్ట‌లేక‌పోయింది. షూటింగ్ ఎప్పుడో పూర్త‌యినా అనివార్య కార‌ణాల వ‌ల్ల రిలీజ్ పోస్ట్‌పోన్ అవుతూ వ‌చ్చిన ఈ సినిమా ఎట్ట‌కేల‌కు న‌వంబ‌ర్ 17న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Krishna mukunda murari serial:ముకుందకు మురారి సేవలు.. మీరా నెల తప్పిందన్న భవానీ, షాక్ లో కృష్ణ

Karthika deepam 2:కార్తీకదీపం 2 సీరియల్..కాంచనని మోసం చేస్తున్న శ్రీధర్.. కార్తీక్ గురించి మరో నిజం తెలుసుకున్న పారిజాతం

Guppedantha Manasu Serial: వ‌సుతో రాజీవ్ పెళ్లి- శైలేంద్ర ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాప్ - రిషి రీఎంట్రీకి టైమొచ్చింది!

Preminchoddu: పిల్లలకు తల్లిదండ్రులు చూపించాల్సిన సినిమా.. తెలుగులో తమిళ ఫ్లేవర్‌తో ప్రేమించొద్దు

స్కిన్ మాఫియా అనే కొత్త కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ ఓంకార్ మై నేమ్ ఈజ్ శృతి సినిమాను తెర‌కెక్కించాడు. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో హ‌న్సిక యాక్టింగ్ బాగుంద‌నే పేరొచ్చిన క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం సినిమా వ‌ర్క‌వుట్ కాలేదు. తాజాగా మే నేమ్ ఈజ్ శృతి మూవీ ఓటీటీలోకి రాబోతోంది. డిసెంబ‌ర్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం.

స‌రిగ్గా థియేట‌ర్ల‌లో రిలీజైన నెల రోజుల్లో ఈ మూవీ ఓటీటీలోకి రాబోతున్న‌ట్లు తెలిసింది. తెలుగుతో పాటు త‌మిళ భాష‌ల్లో మై నేమ్ ఈజ్ శృతి అందుబాటులో ఉండ‌నున్న‌ట్లు చెబుతోన్నారు. త్వ‌ర‌లోనే మై నేమ్ ఈజ్ శృతి ఓటీటీ రిలీజ్ డేట్‌ను అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీలో ముర‌ళీశ‌ర్మ‌, న‌రేన్‌, పూజా రామ‌చంద్ర‌న్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఓ యాడ్ ఏజెన్సీలో ప‌నిచేసే శృతి స్కిన్ మాఫియా వ‌ల‌లో ఎలా ప‌డింది? ఆ మాఫియాను ఎదుర్కొంటూ ఆమె ఎలాంటి పోరాటాన్ని సాగించింద‌న్న‌దే ఈ సినిమా క‌థ‌.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం