తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hansika Motwani Engagement: హన్సికా మోత్వానీ ఎంగేజ్‌మెంట్‌.. వరుడు ఇతడే

Hansika Motwani Engagement: హన్సికా మోత్వానీ ఎంగేజ్‌మెంట్‌.. వరుడు ఇతడే

HT Telugu Desk HT Telugu

02 November 2022, 15:51 IST

    • Hansika Motwani Engagement: హన్సికా మోత్వానీ ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. ఆమె సోహైల్‌ కథూరియాను డిసెంబర్‌లో పెళ్లి చేసుకోనుంది. ఐఫిల్‌ టవర్‌ ముందు హన్సికకు అతడు ప్రపోజ్‌ చేస్తున్న ఫొటో వైరల్‌గా మారింది.
హన్సికకు ప్రపోజ్ చేస్తున్న సోహైల్ కథూరియా
హన్సికకు ప్రపోజ్ చేస్తున్న సోహైల్ కథూరియా

హన్సికకు ప్రపోజ్ చేస్తున్న సోహైల్ కథూరియా

Hansika Motwani Engagement: టాలీవుడ్‌ నటి హన్సికా మోత్వానీ నిశ్చితార్థం ఓ వ్యాపారవేత్తతో జరిగింది. అతని పేరు సోహైల్‌ కథూరియా. వీళ్ల పెళ్లి గతంలో వార్తలు వచ్చినట్లే డిసెంబర్‌లో జరగనుంది. తాజాగా హన్సిక కొన్ని ఫొటోలను షేర్‌ చేసుకుంది. అందులో ప్రపంచ వింతల్లో ఒకటైన పారిస్‌లోని ఐఫిల్ టవర్‌ ముందు మోకాలిపై కూర్చొని సోహైల్‌ తనకు ప్రపోజ్‌ చేస్తున్న ఫొటో కూడా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Prabhas: నా బుజ్జిని చూస్తారా: కల్కి 2898 ఏడీపై ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్

Prasanna Vadanam OTT Release date: ప్రసన్న వదనం ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఇలా చేస్తే 24 గంటలు ముందుగానే చూడొచ్చు..

Devara fear song promo: దేవర ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ప్రోమో చూశారా.. అదిరిపోయిన బీజీఎం

Suresh Babu on Theatres: ఓటీటీ మమ్మల్ని దెబ్బ కొడుతోంది.. థియేటర్లలను ఫంక్షన్ హాల్స్‌గా మార్చాల్సిందే: సురేశ్ బాబు

'మ్యారీ మీ' అని గులాబీలతో రాసి ఉండగా, దాని ముందు హార్ట్‌ షేప్‌లో ఏర్పాటు చేసిన క్యాండిల్స్‌లో ఇద్దరూ నిల్చోవడం ఇందులో చూడొచ్చు. ఈ ఫొటో చాలా రొమాంటిక్‌గా ఉంది. హన్సిక, సోహైల్‌ ఇద్దరూ చాలా రోజులుగా స్నేహితులుగా ఉన్నారు. వీళ్లు ఓ సంస్థలో పార్ట్‌నర్‌లు కూడా. ఆ తర్వాత వీళ్ల స్నేహం ప్రేమగా మారి, ఇప్పుడు నిశ్చితార్థానికి దారి తీసింది.

"ఇప్పుడు & ఇక ఎప్పటికీ" అనే క్యాప్షన్‌తో హన్సిక ఈ ఫొటోలను షేర్‌ చేసింది. ఈ ఫొటోలను హన్సిక షేర్‌ చేయగానే ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ వందల కొద్దీ మెసేజ్‌లు వచ్చాయి. అనుష్క శెట్టి కూడా కంగ్రాచులేషన్స్‌ అంటూ హన్సికను విష్‌ చేసింది. ఇక నటి ఖుష్బూ కూడా ఈ ఫొటోలపై కామెంట్ చేస్తూ.. "ఓ వావ్‌.. కంగ్రాచులేషన్స్‌ మై డియర్‌.. విషింగ్ యు ద బెస్ట్‌" అని రాసింది.

ఇక బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌ స్పందిస్తూ.. కంగ్రాచులేషన్స్ హన్సికా అని కామెంట్‌ చేశాడు. అటు మరో నటి ఇషా గుప్తా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ హన్సిక, సోహైల్‌ ఫొటోను పోస్ట్ చేసింది. ఇక ఈ ఇద్దరి పెళ్లి డిసెంబర్ 4న జరగనున్నట్లు సమాచారం. జైపూర్‌లోని ముండోతా ప్యాలెస్‌ను ఇప్పటికే పెళ్లి కోసం బుక్‌ చేసుకున్నారు. ఈ కోట 450 ఏళ్ల కిందటిది. డిసెంబర్‌ 2 నుంచి 4 వరకూ మూడు రోజుల పాటు ఈ ప్యాలెస్‌లో హన్సిక పెళ్లి వేడుకలు జరగనున్నాయి.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం