Hansika Motwani Wedding: హన్సిక మోత్వానీ పెళ్లి.. ప్యాలెస్‌ బుక్ చేసుకున్న బ్యూటీ-hansika motwani wedding to be happen in december as she already booked a palace for the event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hansika Motwani Wedding: హన్సిక మోత్వానీ పెళ్లి.. ప్యాలెస్‌ బుక్ చేసుకున్న బ్యూటీ

Hansika Motwani Wedding: హన్సిక మోత్వానీ పెళ్లి.. ప్యాలెస్‌ బుక్ చేసుకున్న బ్యూటీ

HT Telugu Desk HT Telugu
Oct 18, 2022 03:49 PM IST

Hansika Motwani Wedding: హన్సిక మోత్వానీ పెళ్లి డిసెంబర్‌లో జరగబోతోంది. ఇప్పటికే ఈ పెళ్లి కోసం జైపూర్‌లోని ముండోతా ఫోర్ట్‌ అండ్‌ ప్యాలెస్‌ను బుక్‌ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

హన్సికా మోత్వానీ
హన్సికా మోత్వానీ (Twitter)

Hansika Motwani Wedding: అప్పుడెప్పుడో సుమారు 20 ఏళ్ల కిందట వచ్చిన కోయి మిల్‌గయా మూవీతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హన్సికా మోత్వానీ. ఆ తర్వాత నాలుగేళ్లకు అంటే 2007లో 16 ఏళ్ల వయసులోనే అల్లు అర్జున్‌ సరసన దేశముదురు మూవీతో టాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఇప్పుడీ ముద్దుగుమ్మ 31 ఏళ్ల వయసులో పెళ్లి పీటలు ఎక్కబోతోంది.

ఆమె డిసెంబర్‌లో పెళ్లి చేసుకోబోతోందని, ఇప్పటికే జైపూర్‌లోని ముండోతా ఫోర్ట్‌ అండ్‌ ప్యాలెస్‌ బుక్‌ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 450 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్యాలెస్‌లో చాలా ఘనంగా హన్సిక పెళ్లి జరగబోతోందని ఇండియా టీవీ రిపోర్ట్‌ చేసింది. ఇప్పటి నుంచే ఈ ప్యాలెస్‌లో ఆమె పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా ఆ రిపోర్ట్‌ వెల్లడించింది.

అయితే ఆమె పెళ్లి వేదిక గురించి వార్తలు బయటకు వచ్చినా.. ఆమె ఎవరిని పెళ్లి చేసుకోబోతోంది? డిసెంబర్‌లో ఏ తేదీన పెళ్లి అనే విషయాలు మాత్రం ఇంకా తెలియలేదు. ఆమె చివరిసారి 2019లో తెనాలి రామకృష్ణ మూవీలో కనిపించింది. ఆ తర్వాత 2022లో పలు తమిళ, తెలుగు ప్రాజెక్ట్‌లతో బిజీ అయింది. ఈ ఏడాది హన్సిక చేతిలో చాలా ప్రాజెక్టులే ఉన్నాయి.

తమిళంలో ఆమె మహా అనే మూవీ చేసింది. ఇది ఆమెకు 50వ సినిమా కావడం విశేషం. ఈ మూవీ తెలుగులోనూ డబ్‌ అయింది. గత నెల 9వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమ్‌ అవుతోంది. ఈ మహా మూవీలో ఆమె తన మాజీ లవర్‌ శింబుతో కలిసి నటించింది. కోలీవుడ్‌లో 2013 నుంచి వీళ్ల మధ్య ప్రేమాయణం హాట్‌ టాపిక్‌గా ఉంది. వీళ్లు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చినా.. తర్వాత ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు.

ఈ ఏడాది హన్సిక 105 మినిట్స్‌, మై నేమ్‌ ఈజ్‌ శృతి అనే తెలుగు సినిమాల్లోనూ నటించింది. ఇవి కాకుండా మరో ఐదు తమిళ సినిమాలు కూడా హన్సిక చేతిలో ఉండటం విశేషం. ఇక హన్సిక ఓటీటీలోకి కూడా అడుగుపెట్టబోతోంది. ఆమె డైరెక్టర్‌ ఎం రాజేష్‌ ఎంవై3 అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. దీనికితోడు నషా అనే తెలుగు వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తోంది.

IPL_Entry_Point