తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hansika Love Shaadi Drama: న‌న్ను విల‌న్‌ను చేశారు - సోహైల్ మొద‌టి పెళ్లిపై హ‌న్సిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

Hansika Love Shaadi Drama: న‌న్ను విల‌న్‌ను చేశారు - సోహైల్ మొద‌టి పెళ్లిపై హ‌న్సిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

10 February 2023, 20:49 IST

  • Hansika Love Shaadi Drama: గ‌త డిసెంబ‌ర్‌లో చిర‌కాల ప్రియుడు సోహైల్ కుతురియాతో ఏడ‌డుగులు వేసింది హ‌న్సిక‌. ఈ జంట పెళ్లి వీడియో ల‌వ్ షాదీ డ్రామా పేరుతో శుక్ర‌వారం డిస్నీ ప్ల‌స్‌ హాట్‌స్టార్‌లో రిలీజైంది. ఈ డాక్యుమెంట‌రీలో త‌మ పెళ్లి గురించి హ‌న్సిక ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించింది.

హ‌న్సిక‌
హ‌న్సిక‌

హ‌న్సిక‌

Hansika Love Shaadi Drama:: ప్ర‌స్తుతం పెళ్లి బంధంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది హ‌న్సిక‌. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో చిర‌కాల ప్రేమికుడు, వ్యాపార‌వేత్త సోహైల్ క‌తురియాను హ‌న్సిక పెళ్లాడింది. చాలా కాలంగా ప్రేమ‌లో ఉన్న ఈ జంట పెద్ద‌ల అంగీకారంతో డిసెంబ‌ర్ 4న ఏడ‌డుగులు వేశారు. వారి పెళ్లి వీడియో డాక్యుమెంట‌రీ ల‌వ్ షాదీ డ్రామా పేరుతో శుక్ర‌వారం డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో రిలీజైంది.

ట్రెండింగ్ వార్తలు

Swatantrya Veer Savarkar ott release date: స్వాతంత్య్ర వీర్ సావర్కర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఆ ప్రత్యేకమైన రోజునే..

Gam Gam Ganesha Trailer: ఆనంద్ దేవరకొండ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

Payal Rajput: చిక్కుల్లో పాయల్ రాజ్‌పుత్.. నిర్మాతల మండలికి రక్షణ ప్రొడ్యూసర్ ఫిర్యాదు

Top 10 IMDb rating movies: ప్రపంచ సినిమాలో అత్యుత్తమ ఐఎండీబీ రేటింగ్ కలిగిన టాప్ 10 మూవీస్ ఇవే.. ఈ ఓటీటీల్లో చూడండి

ఈ వీడియోలో త‌మ పెళ్లి గురించి హ‌న్సిక ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని పంచుకున్న‌ది. సోహైల్ క‌తురియాకి ఇది రెండో పెళ్లి. గ‌తంలో హ‌న్సిక స్నేహితురాలు రింకీని సోహైల్ క‌తురియా పెళ్లిచేసుకున్నాడు. వారి పెళ్లికి హ‌న్సిక హాజ‌రైంది. రింకీ నుంచి విడాకులు తీసుకున్న సోహైల్ హ‌న్సిక కొత్త జీవితాన్ని మొద‌లుపెట్టాడు.

అయితే సోహైల్, రింకీ విడిపోవ‌డానికి హ‌న్సిక‌నే కార‌ణ‌మంటూ ప‌లు వార్త‌లు వ‌చ్చాయి. త‌న స్నేహితురాలిని మోసం చేసిన హ‌న్సిక ఆమె భ‌ర్త‌ను పెళ్లి చేసుకుంటుందంటూ ప్ర‌చారం జ‌రిగింది. ఈ పుకార్ల‌పై ల‌వ్ షాదీ డ్రామా డాక్యుమెంట‌రీలో హ‌న్సిక స్పందించింది. త‌మ పెళ్లి కుదిరిన త‌ర్వాత సోహైల్ రింకీ విడాకులు తీసుకోవ‌డానికి తానే కార‌ణ‌మంటూ ప‌లు త‌ప్పుడు క‌థ‌నాలు సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌న‌మిచ్చాయ‌ని హ‌న్సిక అన్న‌ది.

స్నేహితురాలి భ‌ర్త‌ను దొంగ‌త‌నం చేశానంటూ త‌న‌ను విల‌న్‌గా చిత్రీక‌రించార‌ని హ‌న్సిక పేర్కొన్న‌ది. సెల‌బ్రిటీని కావ‌డంతోనే త‌న‌ను టార్గెట్ చేశార‌ని అన్న‌ది. మొద‌టి భార్య నుంచి సోహైల్ విడిపోవ‌డానికి తాను కార‌ణం కాద‌ని చెప్పింది. ఈ ప్ర‌చారంపై సోహైల్ కూడా స్పందించాడు. త‌మ విడాకుల‌కు హ‌న్సిక కార‌ణ‌మంటూ వ‌చ్చిన వార్త‌లు పూర్తిగా అబ‌ద్ధ‌మ‌ని తెలిపాడు. ఆ విష‌యంలో హ‌న్సిక త‌ప్పేమీ లేద‌ని చెప్పాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం