Hansika Gandhari First Look: గాంధారిగా హ‌న్సిక - ఫ‌స్ట్‌టైమ్ డ్యూయ‌ల్ రోల్‌-hansika gandhari first look released hansika plays a dual role first time ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hansika Gandhari First Look: గాంధారిగా హ‌న్సిక - ఫ‌స్ట్‌టైమ్ డ్యూయ‌ల్ రోల్‌

Hansika Gandhari First Look: గాంధారిగా హ‌న్సిక - ఫ‌స్ట్‌టైమ్ డ్యూయ‌ల్ రోల్‌

Nelki Naresh Kumar HT Telugu
Dec 23, 2022 03:31 PM IST

Hansika Gandhari First Look: కెరీర్‌లో తొలిసారి హ‌న్సిక డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ది. హార‌ర్ క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా ఏదంటే...

 హ‌న్సిక
హ‌న్సిక

Hansika Gandhari First Look: ఇటీవ‌లే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది హ‌న్సిక‌. ప్రియుడు సొహైల్ క‌తురియాతో ఏడ‌డుగులు వేసింది. జైపూర్‌లో వైభ‌వంగా హ‌న్సిక, సొహైల్ పెళ్లి వేడుక జ‌రిగింది. పెళ్లి ప‌నుల‌తో ఇన్నాళ్లు బిజీగా గ‌డిపిన ఈ ముద్దుగుమ్మ తిరిగి సినిమాల‌పై దృష్టిసారించింది.

హ‌న్సిక క‌థానాయిక‌గా గాంధారి పేరుతో త‌మిళంలో ఓ సినిమా రూపొందుతోంది. లేడీ ఓరియెంటెడ్ క‌థాంశంతో రూపొందుతోన్న ఈ హార‌ర్‌ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఢీ గ్లామ‌ర్ లుక్‌లో హ‌న్సిక క‌నిపిస్తోంది. ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇందులో హ‌న్సిక ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్న‌ది.

డ్యూయ‌ల్ రోల్‌లో హ‌న్సిక క‌నిపించ‌డం ఇదే తొలిసారి. క‌ణ్ణ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 24న ఈ సినిమాను త‌మిళంతో పాటు తెలుగులో రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ సినిమాతో పాటుగా ప్ర‌స్తుతం హ‌న్సిక తెలుగులో మై నేమ్ ఈజ్ శృతి, 105 మిన‌ట్స్ సినిమాలు చేస్తోంది. ఈ రెండు సినిమాలో లేడీ ఓరియెంటెడ్ క‌థాంశాల‌తోనే రూపొందుతోన్నాయి.

గ‌త కొన్నాళ్లుగా క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు దూరంగా ఉంటున్న హ‌న్సిక లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌పై దృష్టిసారిస్తోంది.

IPL_Entry_Point