తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guntur Kaaram Third Song: గుంటూరు కారం నుంచి మరో మాస్ బీట్ సాంగ్ రెడీ: అదే హైలైట్: వివరాలివే..

Guntur Kaaram Third Song: గుంటూరు కారం నుంచి మరో మాస్ బీట్ సాంగ్ రెడీ: అదే హైలైట్: వివరాలివే..

25 December 2023, 19:35 IST

    • Guntur Kaaram Third Song: గుంటూరు కారం సినిమా నుంచి మరో మాస్ సాంగ్ సిద్ధమైంది. ఫుల్ డ్యాన్స్ నంబర్‌గా ఈ పాట ఉంటుందని తెలుస్తంది. ఈ పాటకు సంబంధించి ఓ పోస్టర్ కూడా పోస్ట్ చేసింది మూవీ యూనిట్ వివరాలివే..
Guntur Kaaram Third Song: గుంటూరు కారం నుంచి మరో మాస్ బీట్ సాంగ్ రెడీ
Guntur Kaaram Third Song: గుంటూరు కారం నుంచి మరో మాస్ బీట్ సాంగ్ రెడీ

Guntur Kaaram Third Song: గుంటూరు కారం నుంచి మరో మాస్ బీట్ సాంగ్ రెడీ

Guntur Kaaram Third Song: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ‘గుంటూరు కారం’ సినిమాకు ఫుల్ హైప్ ఉంది. చాలా ఏళ్ల తర్వాత వారిద్దరి కాంబో రిపీట్ అవుతుండటంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా 2024 జనవరి 12న గుంటూరు కారం సినిమాను రిలీజ్ చేయనున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి మూడో పాట రెడీ అయింది.

ట్రెండింగ్ వార్తలు

Guppedantha Manasu May 20th Episode: గుప్పెడంత మనసు- శైలేంద్రపై రాజీవ్ హత్యాయత్నం- ధరణి కాళ్లు పట్టుకున్న భర్త

krishna mukunda murari serial: అబార్షన్ చేయించుకున్న మీరా.. బిడ్డ కోసం గుండెలు పగిలేలా ఏడ్చిన కృష్ణ

Jr NTR Movies on OTT: హ్యాపీ బర్త్‌డే ఎన్టీఆర్: మ్యాన్ ఆఫ్ మాసెస్ సూపర్ హిట్ సినిమాలు ఈ ఓటీటీల్లో చూసేయండి

Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. 'దీపకి, నీ కొడుక్కి ఏంటి సంబంధం'నిలదీసిన జ్యోత్స్న.. కార్తీక్ పై దీప ఫైర్

గుంటూరు కారం మూడో పాట గురించి మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. “సూపర్ ఫ్యాన్స్! వాల్యూమ్‍ను పెంచేందుకు రెడీగా ఉండండి. గుంటూరు కారం నుంచి హై వోల్టేజ్ స్పైసీ మాస్ నంబర్ వేడివేడిగా వచ్చేస్తోంది. డ్యాన్స్‌తో ఫ్లోర్‌ను ఫైర్ చేసేందుకు సిద్ధంగా ఉండండి” అని హాసినీ, హారిక క్రియేషన్స్ ట్వీట్ చేసింది. మహేశ్ బాబు, శ్రీలీల మాస్ డ్యాన్స్ చేస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసింది. గుంటూరు కారం చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

సాంగ్ రిలీజ్ డేట్ ఇదే!

గుంటూరు కారం మూవీ నుంచి ఈ మూడో పాట త్వరలో వస్తుందని మూవీ యూనిట్ తెలిపింది. ఇప్పటికైతే డేట్ వెల్లడించలేదు. అయితే, ఈ సాంగ్ ఎప్పుడు రానుందో సమాచారం వచ్చింది. ఈ మూడో పాట ప్రోమోను డిసెంబర్ 29న, ఫుల్‍ సాంగ్‍ను డిసెంబర్ 30వ తేదీన రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ నిర్ణయించుకుందట. ఈ విషయంపై అతిత్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

గుంటూరు కారం నుంచి రానున్న ఈ థర్డ్ సాంగ్‍లో మహేశ్ బాబు ఊరమాస్ డ్యాన్స్ స్టెప్‍లు హైలైట్‍గా ఉంటాయని తెలుస్తోంది. మహేశ్, శ్రీలీల డ్యాన్స్ ఈ పాటలో అదిరిపోతుందని టాక్. మూవీ యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ కూడా అదే విధంగా ఉంది.

గుంటూరు కారం నుంచి రానున్న ఈ మాస్ సాంగ్.. న్యూఇయర్ వేడుకల్లో మోతెక్కిపోతుందని ఇప్పటికే చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రోమో కూడా అదిరిపోయేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. రెండో పాట ‘ఓ మై బేబీ’ పట్ల ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేశారు. అయితే, అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యేలా ఈ మూడో పాట ఉండనుందని తెలుస్తోంది.

గుంటూరు కారం సినిమాలో మరో హీరోయిన్‍గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరాం, ప్రకాశ్ రాజ్, సునీల్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. హాసినీ, హారిక క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఈ మూవీని నిర్మిస్తున్నారు. అతడు, ఖలేజా తర్వాత మహేశ్ - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమాగా గుంటూరు కారం ఉంది. ఈ చిత్రం 2024 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం