తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gadar 2 Box Office Collections: చరిత్ర స‌ృష్టించిన గదర్ 2.. ఇండిపెండెన్స్ డేనాడు ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్లు

Gadar 2 box office Collections: చరిత్ర స‌ృష్టించిన గదర్ 2.. ఇండిపెండెన్స్ డేనాడు ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్లు

Hari Prasad S HT Telugu

16 August 2023, 7:48 IST

    • Gadar 2 box office Collections: చరిత్ర స‌ృష్టించింది గదర్ 2 మూవీ. ఇండిపెండెన్స్ డేనాడు ఆల్ టైమ్ హై కలెక్షన్లు సాధించిన ఇండియన్ సినిమాగా నిలవడం విశేషం.
గదర్ 2 మూవీలో అమీషా పటేల్, సన్నీ డియోల్
గదర్ 2 మూవీలో అమీషా పటేల్, సన్నీ డియోల్

గదర్ 2 మూవీలో అమీషా పటేల్, సన్నీ డియోల్

Gadar 2 box office Collections: బాలీవుడ్ మూవీ గదర్ 2 ఇండిపెండెన్స్ డేనాడు రికార్డు కలెక్షన్లు రాబట్టింది. భారత స్వాతంత్ర్య దినోత్సవం నాడు అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించడం విశేషం. ఈ సినిమా మంగళవారం ఏకంగా రూ.55.5 కోట్లు వసూలు చేసింది. దీంతో మూవీ మొత్తం కలెక్షన్లు రూ.229 కోట్లకు చేరింది.

ట్రెండింగ్ వార్తలు

Vijay Sethupathi: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కొత్త ప్రయోగం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా ఏసీఈ

NNS May 18th Episode: పుట్టింటికి అరుంధతి.. సరస్వతిని చంపేస్తున్న మనోహరి.. అందరికీ తెలియనున్న నిజం​​​!

బోల్డ్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ డైరెక్ట‌ర్ - ముగ్గురు హీరోయిన్ల‌తో రొమాన్స్‌

Kiara Advani: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గేమ్ చేంజర్ హీరోయిన్ డెబ్యూ ఎంట్రీ.. కియారా డ్రెస్ ప్రత్యేకతలు ఇవే!

గదర్ 2 రిలీజైన తర్వాత ఒక్క రోజులో వచ్చిన అత్యధిక కలెక్షన్లు కూడా ఇవే. సన్నీ డియోల్, అమీషా పటేల్ కలిసి నటించిన ఈ సినిమా తొలి రోజు నుంచే బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. సినిమాకు మిక్స్‌డ్ రియాక్షన్లు వచ్చినా, మరీ దారుణంగా తీశారని ట్రోలింగ్ జరిగినా.. కలెక్షన్ల విషయంలో మాత్రం గదర్ 2 ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు.

తొలి రోజు రూ.40 కోట్లు, రెండో రోజు రూ.43 కోట్లు, మూడో రోజు రూ.51 కోట్లు, నాలుగో రోజు రూ.38 కోట్లు, ఐదో రోజు రూ.55.5 కోట్లు వసూలు చేసింది. 22 ఏళ్ల కిందట వచ్చిన గదర్ మూవీకి ఇది సీక్వెల్. 2001లో వచ్చిన ఆ సినిమా కూడా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఇప్పటికీ కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఇండియా, పాకిస్థాన్ నేపథ్యంలో సాగే సన్నీ, అమీషా ప్రేమ కథ ఎంతగానో ఆకట్టుకుంది.

ఇప్పుడు వచ్చిన సీక్వెల్ 1971లో ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో సాగింది. ఈ సినిమాను సరిగ్గా ఇండిపెండెన్స్ డే ముందు రిలీజ్ చేయాలన్న మేకర్స్ ప్లాన్ సక్సెసైంది. మూవీ రిలీజ్ కు ముందే దేశవ్యాప్తంగా తిరుగుతూ సన్నీ, అమీషా ఈ మూవీని ప్రమోట్ చేశారు. వాళ్ల శ్రమ ఫలించింది. ఈ సినిమా సులువుగా రూ.250 కోట్ల కలెక్షన్ల మార్క్ అందుకోనుంది.

గదర్ ను డైరెక్ట్ చేసిన అనిల్ శర్మనే ఈ గదర్ 2ని డైరెక్ట్ చేశాడు. ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఉత్కర్ష్ శర్మ కూడా ఈ మూవీ ద్వారా మరోసారి తెరపైకి వచ్చాడు. తారా సింగ్ (సన్నీ డియోల్), సకీనా (అమీషా)ల కొడుకుగా ఉత్కర్ష్ నటించాడు. పాకిస్థాన్ ఆర్మీ చెరబట్టిన తన కొడుకును విడిపించుకునేందుకు తారా సింగ్ చేసిన యుద్ధం ఆధారంగా ఈ గదర్ 2 తెరకెక్కించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం