తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hi Nanna Gaaju Bomma Song Lyrics: మనసుకు హత్తుకునే హాయ్ నాన్నలోని గాజు బొమ్మ సాంగ్ లిరిక్స్ ఇవే

Hi Nanna Gaaju Bomma Song Lyrics: మనసుకు హత్తుకునే హాయ్ నాన్నలోని గాజు బొమ్మ సాంగ్ లిరిక్స్ ఇవే

Hari Prasad S HT Telugu

08 December 2023, 14:00 IST

    • Hi Nanna Gaaju Bomma Song Lyrics: నాని, మృణాల్ ఠాకూర్ నటించిన హాయ్ నాన్న మూవీలోని మనసుకు హత్తుకునే పాట గాజు బొమ్మ సాంగ్ లిరిక్స్ మీకోసం ఇక్కడ ఇస్తున్నాం.
గాజు బొమ్మ పాటలో నాని, బేబీ కియారా ఖన్నా
గాజు బొమ్మ పాటలో నాని, బేబీ కియారా ఖన్నా

గాజు బొమ్మ పాటలో నాని, బేబీ కియారా ఖన్నా

Hi Nanna Gaaju Bomma Song Lyrics: హాయ్ నాన్న మూవీలోని గాజు బొమ్మ సాంగ్ అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. మనసుకు హత్తుకునే ఈ మెలోడియస్ సాంగ్ లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం. గురువారం (డిసెంబర్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చిన హాయ్ నాన్న మూవీ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది. నాని, మృణాల్ ఠాకూర్ నటించిన ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

Keerthy Suresh Kalki 2898 AD: కల్కి 2898 ఏడీలో కీర్తి సురేష్.. ప్రభాస్‌కు ప్రాణ మిత్రుడిగా మహానటి

Murari Movie: మురారి సినిమాలో మహేశ్‍కు జీడీగా సోనాలీ కంటే ముందు ఈ బాలీవుడ్ భామను అనుకున్నారట!

హాయ్ నాన్న మూవీలోని ఈ గాజు బొమ్మ పాటను ఖుషీ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ కంపోజ్ చేశాడు. పాటను కూడా అతడే పాడాడు. ఇక ఈ సాంగ్ కు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించాడు. ఈ మెలోడీ సాంగ్ ఎంతో వినసొంపుగా, హాయిగా సాగిపోయింది. హాయ్ నాన్న సినిమా స్టోరీ మొత్తాన్ని ఈ ఒక్క పాటలో ఎంతో హృద్యంగా చెప్పాడు రచయిత అనంత శ్రీరామ్. ఈ పాట లిరిక్స్ మీకోసం..

గాజు బొమ్మ పాట లిరిక్స్ ఇవే..

ఇటు రావె నా గాజు బొమ్మా

నేనే నాన్నా అమ్మా

ఎద నీకు ఉయ్యాల కొమ్మా

నిను ఊపే చెయ్యే ప్రేమా

వాలిపో ఈ గుండెపైనే

ఆడుకో ఈ గూటిలోనే

దూరం పోబోకుమా

చిన్ని చిన్ని పాదాలని

నేలై నేను మోయనా

చిందే క్షణంలో నువ్వు కింద పడినా

ఉంటావు నా నీడలా

నీ చెంతే రెండు చెవులుంచి

బయలెల్లనా

యే మాటా నీ నోట వెనువించినా

వింటానే

రానా నిమిషం లోనా

నేనన్నే వదిలేసైనా

తుళ్లే తుళ్లే నీ శ్వాసకే

కాపై నేనుండనా..

ఉచ్వాసనైనా నిశ్వాసనైనా

మేలించి పంపించనా

ఏకాంతులైనా అవి నన్ను దాటాక నే

ఆ రోజు చేరాలి నీ చూపునే

నీ రెప్ప పై ఉంటానే

పాపా కంటి పాపా

నా పాపా కంటి పాపా...

ఇటు రావె నా గాజు బొమ్మా

నేనే నాన్నా అమ్మా

ఎద నీకు ఉయ్యాల కొమ్మా

నిను ఊపే చెయ్యే ప్రేమా..

వాలిపో ఈ గుండెపైనే

ఆడుకో ఈ గూటిలోనే

దూరం పోబోకుమా

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం