Hi Nanna Day 1 Collection: హాయ్ నాన్న ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ - నాని కెరీర్‌లో లోయెస్ట్ - అంటే సుంద‌రానికంటే త‌క్కువే!-hi nanna day 1 worldwide box office collection nani mrunal thakur movie disappointed at box office ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Hi Nanna Day 1 Worldwide Box Office Collection Nani Mrunal Thakur Movie Disappointed At Box Office

Hi Nanna Day 1 Collection: హాయ్ నాన్న ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ - నాని కెరీర్‌లో లోయెస్ట్ - అంటే సుంద‌రానికంటే త‌క్కువే!

Nelki Naresh Kumar HT Telugu
Dec 08, 2023 12:22 PM IST

Hi Nanna Day 1 Collection: నాని హాయ్ నాన్న మూవీ తొలిరోజు బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ‌ప‌రిచింది. నాని రీసెంట్ మూవీస్‌లో అతి త‌క్కువ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా హాయ్ నాన్న నిలిచింది.

నాని హాయ్ నాన్న మూవీ
నాని హాయ్ నాన్న మూవీ

Hi Nanna Day 1 Collection: హాయ్ నాన్న మూవీ హీరో నాని న‌టించిన‌ రీసెంట్ మూవీస్‌లో అతి త‌క్కువ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా నిలిచింది. శుక్ర‌వారం రిలీజైన హాయ్ నాన్న‌ తొలిరోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప‌ద‌కొండు కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను, ఐదున్న‌ర కోట్ల షేర్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. తెలుగు రాష్ట్రాల్లో మొద‌టిరోజు కేవ‌లం రెండు కోట్ల తొంభై ల‌క్ష‌ల క‌లెక్ష‌న్స్‌ మాత్ర‌మే వ‌చ్చాయి. నైజాం ఏరియాలో కోటిన్న‌ర వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ మూవీ మిగిలిన చోట్ల పూర్తిగా తేలిపోయింది.

ట్రెండింగ్ వార్తలు

తెలుగు రాష్ట్రాల‌తో పోలిస్తే ఓవ‌ర్‌సీస్‌లో మాత్రం ప‌ర్వాలేద‌నిపించింది. శుక్ర‌వారం రోజు ఓవ‌ర్‌సీస్‌లో రెండు కోట్ల‌కుపైనే క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. నాని గ‌త సినిమా ద‌స‌రా తొలిరోజు 14 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను సొంతం చేసుకోగా ఆ సినిమా ద‌రిదాపుల్లోకి కూడా హాయ్ నాన్న నిల‌వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

నాని కెరీర్‌లో డిజాస్ట‌ర్‌గా నిలిచిన అంటే సుంద‌రానికి (తొలిరోజు మూడు కోట్ల ఎన‌భై ల‌క్ష‌లు ) కంటే హాయ్ నాన్న‌కు త‌క్కువ క‌లెక్ష‌న్స్ రావ‌డం గ‌మ‌నార్హం. మ‌ల్టీప్లెక్స్ ప్రేక్ష‌కుల అభిరుచుల‌కు త‌గ్గ క‌థ‌, క‌థ‌నాల‌తో సినిమా తెర‌కెక్క‌డం, క‌థాగ‌మ‌నం నిదానంగా సాగ‌డం తొలిరోజు వ‌సూళ్ల‌పై ఎఫెక్ట్ ప‌డింది.

నాని, మృణాల్ ఠాకూర్ యాక్టింగ్‌, కెమిస్ట్రీ బాగున్నా క‌థ‌లో కొత్త‌ద‌నం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. వాట‌న్నింటి వ‌ల్లే తొలిరోజు వ‌సూళ్లు త‌గ్గాయ‌ని చెబుతోన్నారు. వ‌ర‌ల్డ్ వైడ్‌గా దాదాపు 27 కోట్ల వ‌ర‌కు హాయ్ నాన్న ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది.

తొలిరోజు వ‌సూళ్ల‌ను బ‌ట్టి చూస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా? లేదా? అన్న‌ది స‌స్పెన్స్‌గా మారింది. హాయ్ నాన్న సినిమాతో శౌర్యువ్ ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. శృతిహాస‌న్, బేబీ కియారా కీల‌క పాత్ర‌లు పోషించారు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.