తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  1134 Movie: ప్రయోగాత్మకంగా నో బడ్జెట్‌ మూవీ 1134.. రిలీజ్ డేట్ ఫిక్స్

1134 Movie: ప్రయోగాత్మకంగా నో బడ్జెట్‌ మూవీ 1134.. రిలీజ్ డేట్ ఫిక్స్

Sanjiv Kumar HT Telugu

09 December 2023, 8:30 IST

  • No Budget Movie 1134: సినీ ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు, చిన్న చిత్రాలు ఎన్నో సందడి చేస్తూనే ఉంటాయి. అలాంటిది నో బడ్జెట్‌గా రూపొందిన మూవీనే 1134. ఈ 1134 విడుదల తేది ఎప్పుడు? అసలు ఏంటీ నో బడ్జెట్ అనే వివరాల్లోకి వెళితే..

1134 Movie: ప్రయోగాత్మకంగా నో బడ్జెట్‌ మూవీ 1134.. రిలీజ్ డేట్ ఫిక్స్
1134 Movie: ప్రయోగాత్మకంగా నో బడ్జెట్‌ మూవీ 1134.. రిలీజ్ డేట్ ఫిక్స్

1134 Movie: ప్రయోగాత్మకంగా నో బడ్జెట్‌ మూవీ 1134.. రిలీజ్ డేట్ ఫిక్స్

1134 Movie Release Date: ప్రస్తుతం కొత్త కాన్సెప్ట్ తో వస్తోన్న చిత్రాలకు ఆదరణ లభిస్తోంది. ఇలాంటి ఓ డిఫరెంట్ ప్రయోగమే ‘1134’ మూవీ. డిఫరెంట్ టైటిల్‌తో థ్రిల్లింగ్ ప్రధానంగా ఈ సినిమాను రూపొందించారు నూతన దర్శకుడు డైరెక్టర్ శరత్ చంద్ర తడిమేటి. శాన్వీ మీడియా బ్యానర్‌పై రాబోతోన్న ఈ మూవీకి భరత్ కుమార్ పాలకుర్తి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Vijay Sethupathi: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కొత్త ప్రయోగం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా ఏసీఈ

NNS May 18th Episode: పుట్టింటికి అరుంధతి.. సరస్వతిని చంపేస్తున్న మనోహరి.. అందరికీ తెలియనున్న నిజం​​​!

బోల్డ్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ డైరెక్ట‌ర్ - ముగ్గురు హీరోయిన్ల‌తో రొమాన్స్‌

Kiara Advani: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గేమ్ చేంజర్ హీరోయిన్ డెబ్యూ ఎంట్రీ.. కియారా డ్రెస్ ప్రత్యేకతలు ఇవే!

రాబరీ నేపథ్యంలో బలమైన కథా, కథనంతో ఈ సినిమా సాగనుందని ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్‌ను చూస్తూనే అర్థం అవుతోంది. 2 నిమిషాల 28 సెకనుల నిడివితో వచ్చిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. సొంతంగా తనే కథ రాసుకొని హై టెక్నికల్ వాల్యూస్‌తో అన్నివర్గాల ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యేలా ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ శరత్ చంద్ర తడిమేటి.

తాజాగా 1134 మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. 1134 మూవీని డిసెంబర్ 15న విడుదల చేయనున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. రాంధుని క్రియేషన్స్, శాన్వీ మీడియా బ్యానర్‌‌లపై తెరకెక్కుతున్న ఈ 1134 చిత్రంలో కృష్ణ మడుపు, గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ, ఫణి భార్గవ్,నర్సింగ్ వాడేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ మురళీ కార్తికేయ సంగీతం అందిస్తున్నారు.

నజీబ్ షేక్, జితేందర్ తలకంటి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. అయితే 1134 మూవీ ఒక షూస్ట్రింగ్ బడ్జెట్ మూవీ. అంటే.. చాలా తక్కువ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించారు. అసలు ఈ డబ్బుతో ఒక సినిమాను ఎంత మాత్రం తెరకెక్కించలేం అనేంత తక్కువ వ్యయంతో 1134 సినిమాను నిర్మించారు. అందుకే 1134 చిత్రాన్ని నో బడ్జెట్ మూవీగా పిలుస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం