తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sitaramam Ott Release Date: సీతారామం ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే..

Sitaramam OTT Release Date: సీతారామం ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే..

06 September 2022, 10:23 IST

  • Sitaramam OTT Release Date: సీతారామం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. దుల్క‌ర్ స‌ల్మాన్‌, మృణాల్ ఠాకూర్ జంట‌గా న‌టించిన సీతారామం ఏడాది టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌లో ఒక‌టిగా నిలిచింది. రెండు రోజుల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలవుతోంది.

దుల్క‌ర్ స‌ల్మాన్‌,మృణాల్ ఠాకూర్
దుల్క‌ర్ స‌ల్మాన్‌,మృణాల్ ఠాకూర్ (Twitter)

దుల్క‌ర్ స‌ల్మాన్‌,మృణాల్ ఠాకూర్

Sitaramam OTT Release Date: సీతారామం ఓటీటీలో సెప్టెంబరు 9న విడుదల కాబోతోంది. తెలుగు, తమిళ్, మళయాలం భాషల్లో ఓటీటీలో రిలీజ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌ వీడియో ఓటీటీలో ఈ సీతారామం మూవీ రిలీజ్ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Blink OTT Streaming: వీకెండ్‌లో ఈ కన్నడ సై-ఫి థ్రిల్లర్ మూవీ అస్సలు మిస్ కావద్దంటున్న ఓటీటీ ప్రేక్షకులు

Flop Movies With super hit songs: పాట హిట్.. బొమ్మ ఫట్.. తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్న ఫ్లాప్ మూవీస్ ఇవే

Korean Movies in Cannes: కేన్స్‌లో దుమ్ము రేపిన ఈ కొరియన్ సినిమాలను ఏ ఓటీటీల్లో చూడాలంటే..

Love Me Trailer: భయపెడుతున్న వైష్ణవి చైతన్య లవ్ మి ట్రైలర్.. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు?

దుల్క‌ర్ స‌ల్మాన్‌, మృణాల్ ఠాకూర్ జంట‌గా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సీతారామం అద్భుత ప్రేమ‌కావ్యంగా తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తోంది. సీతారామం విడుద‌లై నెల రోజుల దాటినా బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా క‌లెక్ష‌న్స్ జోరు త‌గ్గ‌లేదు. నెల రోజుల్లో ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 84 కోట్ల గ్రాస్‌ను రాబ‌ట్టింది. గ‌త కొన్ని నెల‌లుగా వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌త‌మైన టాలీవుడ్‌కు బింబిసార‌, కార్తికేయ‌-2తో పాటు సీతారామం విజయాలు ఊర‌ట‌నిచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో సీతారామం మూవీ రూ. 40 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. దేశ‌భ‌క్తికి ప్రేమ‌క‌థ‌ను జోడించి ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి ఈ సినిమాను తెర‌కెక్కించాడు. ఇందులో లెఫ్టినెంట్ రామ్ గా దుల్క‌ర్‌ సల్మాన్, సీత పాత్ర‌లో మృణాల్ ఠాకూర్ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి. కీల‌క పాత్ర‌లో ర‌ష్మిక క్యారెక్ట‌ర్ సినిమాకు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది.

కాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ (Sitaramam OTT Release Date) పై అభిమానుల్లో ఆస‌క్తి నెలకొంది. ప్రస్తుతం ఈ ఉత్కంఠకు తెరవీడింది. సెప్టెంబ‌ర్ 9న అమెజాన్ ప్రైమ్‌లో సీతారామం రిలీజ్ అవుతోంది. భారీ ధ‌ర‌కు సీతారామం డిజిట‌ల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. ఈ సినిమాలో సుమంత్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో న‌టించాడు.

సీతారామం కథ ఇదే..

లెఫ్టినెంట్ రామ్‌కు అనుకోకుండా ఓ రోజు సీతామహాలక్ష్మి అనే అమ్మాయి నుండి ఉత్తరం వస్తుంది. ఆ లెటర్‌పై ఫ్రమ్ అడ్రస్ ఉండదు. ఉత్త‌రాల ద్వారా ఇద్ద‌రి మ‌ధ్య మొద‌లైన అనుబంధం ప్రేమ‌కు దారితీస్తుంది. ఓ ప్యాలెస్‌లో కళాకారిణిగా సీత పనిచేస్తుందని తెలుసుకుంటాడు. సీతకు తన ప్రేమను వ్యక్తం చేయగా, అతడి ప్రతిపాదనను ఆమె అంగీకరించదు.

ఈలోగా రామ్ శత్రుసైనికులకు చిక్కుతాడు. సీత కోసం రామ్ ఓ ఉత్తరం రాస్తాడు. ఆ లెటర్‌ను ఇరవై ఏళ్ల త‌ర్వాత సీత‌కు చేర‌వేసే బాధ్య‌త‌ను ఆఫ్రీన్ (రష్మిక మందన) తీసుకుంటుంది.

తన అన్వేష‌ణ‌లో రామ్‌, సీత గురించి ఆఫ్రీన్ ఏం తెలుసుకున్నది? ఆ ఉత్త‌రాన్ని చేర‌వేసే బాధ్య‌త‌ను ఆఫ్రీన్ చేప‌ట్ట‌డానికి కార‌ణ‌మేమిటి?

అసలు సీత ఎవరు? రామ్‌తో పెళ్లికి ఆమె ఎందుకు నిరాకరించింది? రామ్‌తో పెళ్లికి సీత ఎందుకు అంగీక‌రించ‌లేదు? నిజాయితీపరుడైన రామ్‌పై దేశద్రోహిగా ఎందుకు ముద్రపడింది? ఈ ప్రశ్నలకు జవాబు దొరకాలంటే ఈనెల 9న ఓటీటీలో విడుదలయ్యే సీతారామం మూవీ చూడండి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం