తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Divi Vadthya Meets Denzel Washington: ఆస్కార్ విన్న‌ర్‌ను క‌లిసిన బిగ్‌బాస్ దివి

Divi Vadthya Meets Denzel Washington: ఆస్కార్ విన్న‌ర్‌ను క‌లిసిన బిగ్‌బాస్ దివి

08 October 2022, 10:33 IST

  • Divi Vadthya Meets Denzel Washington: ఆస్కార్ విన్న‌ర్ డేంజిల్ వాషింగ్‌ట‌న్‌ను బిగ్‌బాస్ దివి క‌లుసుకున్న‌ది. హాలీవుడ్ సినిమా ఈక్వ‌లైజ‌ర్ 3 సెట్స్‌ను సంద‌ర్శించింది.

దివి, డేంజిల్ వాషింగ్‌ట‌న్‌
దివి, డేంజిల్ వాషింగ్‌ట‌న్‌ (Instagram)

దివి, డేంజిల్ వాషింగ్‌ట‌న్‌

Divi Vadthya Meets Denzel Washington: ఆస్కార్ విన్న‌ర్ డేంజిల్ వాషింగ్‌ట‌న్‌ను బిగ్‌బాస్ దివి క‌లిసింది. హాలీవుడ్ సినిమా సెట్స్‌లో సంద‌డి చేసింది. చిరంజీవి(Chiranjeevi) హీరోగా న‌టించిన గాడ్‌ఫాద‌ర్ (Godfather)సినిమాలో మెయిన్ రోల్‌లో క‌నిపించింది దివి. బిగ్‌బాస్ సీజ‌న్ 4 (Biggboss)తో పాపుల‌ర్‌గా మారిన ఆమెకు త‌న సినిమాలో అవ‌కాశం ఇస్తాన‌ని గ్రాండ్ ఫినాలే రోజు చిరంజీవి మాట ఇచ్చారు.గాడ్‌ఫాద‌ర్‌లో అవ‌కాశం ఇచ్చి ఆ మాట‌ను నిల‌బెట్టుకున్నాడు. రేణుక అనే అమ్మాయిగా క‌థ‌ను మ‌లుపు తిప్పే క్యారెక్ట‌ర్‌లో దివి క‌నిపించింది.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

కాగా ఇటీవ‌లే టూర్ కోసం రోమ్ వెళ్లింది బిగ్‌బాస్ దివి. డేంజిల్ వాషింగ్‌ట‌న్ హీరోగా న‌టిస్తున్న హాలీవుడ్ సినిమా ఈక్వ‌లైజ‌ర్ సెట్స్‌ను దివి విజిట్ చేసింది. డేంజిల్ వాషింగ్‌ట‌న్ తో పాటు డైరెక్ట‌ర్ ఆంటోనీ ఫ‌కాతో దిగిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈక్వ‌లైజ‌ర్ సినిమాటోగ్రాఫ‌ర్ రాబ‌ర్డ్ రిచ‌ర్డ్‌స‌న్ తో ఉన్న ప‌రిచ‌యంతోనే ఈ సినిమా సెట్స్‌ను సంద‌ర్శించిన‌ట్లు దివి తెలిపింది.

మూడేళ్ల క్రితం రిచ‌ర్డ్‌స‌న్ హైద‌రాబాద్‌లో రూపొందించిన ఓ యాడ్ ఫిల్మ్‌కు తాను అసిస్టెంట్‌గా ప‌నిచేసిన‌ట్లు దివి పేర్కొన్న‌ది. అప్ప‌టినుంచి రిచ‌ర్డ్‌స‌న్‌తో ప‌రిచ‌యం ఉన్న‌ట్లు చెప్పింది. ఆ ప‌రిచ‌యంతోనే ఈక్వ‌లైజ‌ర్ 3 సినిమా సెట్స్‌ను సంద‌ర్శించాల‌నే కోరికను రిచ‌ర్డ్‌స‌న్‌తో పంచుకున్న‌ట్లు దివి తెలిపింది.

అత‌డి ద్వారా ఈసినిమా షూటింగ్ చూడాల‌నే క‌ల తీరింద‌ని అన్న‌ది. ఈ రోమ్ ట్రిప్‌ను జీవితాంతం గుర్తుండిపోయే మ‌ధుర జ్ఞాప‌కాల్ని మిగిల్చింద‌ని చెప్పింది. ఈక్వ‌లైజ‌ర్ సెట్స్‌లో సంద‌డి చేసిన ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకున్న‌దివి.

ప‌రంప‌ర సీజ‌న్ 2, మానీళ్ల ట్యాంక్ వెబ్‌సిరీస్‌ల‌తో ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది దివి. ప్ర‌స్తుతం ప‌లు వెబ్‌సిరీస్‌లు, సినిమాలు చేస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం