తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahabharat Series: మహాభారతం ఆధారంగా వెబ్ సిరీస్ - ఏ ఓటీటీలో రిలీజ్ కానుందంటే

Mahabharat series: మహాభారతం ఆధారంగా వెబ్ సిరీస్ - ఏ ఓటీటీలో రిలీజ్ కానుందంటే

HT Telugu Desk HT Telugu

10 September 2022, 18:36 IST

  • Mahabharat series: భారతీయ పురాతన ఇతిహాసం మహాభారతం ఆధారంగా ఓ వెబ్ సిరీస్ రూపొందుతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ కానున్న ఈ వెబ్ సిరీస్ కు దర్శకనిర్మాతలు ఎవరంటే...

మహాభారత్
మహాభారత్ (Twitter)

మహాభారత్

ట్రెండింగ్ వార్తలు

Lampan OTT: బాల్యాన్ని గుర్తుచేసేలా ఉన్న వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.. ఏ ప్లాట్‍ఫామ్‍లో చూడొచ్చంటే..

Mega vs Allu fans: మెగా, అల్లు అభిమానుల మధ్య పెరుగుతూనే ఉన్న గ్యాప్! మీమ్‍లతో ఫ్యాన్స్ వార్

Scam 2010 Web Series: స్కామ్ 2010.. మరో వెబ్ సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. ఈసారి సుబ్రతా రాయ్ స్కామ్

Jayanthi Kannappan: కొడుకు మృతితో బాధ.. ఇద్దరి మధ్య దూరం: లలితతో ప్రకాశ్ రాజ్ విడాకులపై జయంతి కన్నప్పన్ వ్యాఖ్యలు

Mahabharat series: బాలీవుడ్ తో పాటు దక్షిణాదిలో పురాణాలు, చరిత్రను వెండితెరపై ఆవిష్కరించే ట్రెండ్ పెరిగింది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమా రామాయణం ఆధారంగా రూపొందుతోంది. అలాగే సమంత టైటిల్ పాత్రలో నటిస్తున్న శాకుంతల పౌరాణిక కథాంశంతోనే తెరకెక్కుతోంది. తాజాగా పురాతన ఇతిహాసం మహాభారతం త్వరలో సిరీస్ రూపంలో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

లైవ్ యాక్షన్ విధానంలో అత్యున్నత సాంకేతిక పరిజనంతో రూపొందుతున్న ఈ సిరీస్ కు అల్లు అరవింద్, మధు మంతెన నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ హాట్ స్టార్ లో మహాభారత్ వెబ్ సిరీస్ రిలీజ్ కాబోతున్నది. ఈ విషయాన్ని హాట్ స్టార్ శనివారం ప్రకటించింది.తెలుగుతో పాటు అన్ని లాంగ్వేజెస్ లో మహాభారత్ సిరీస్ అందుబాటులో ఉండబోతున్నట్లు ప్రకటించింది.

‘ఇప్పటివరకు వ్రాయబడిన గొప్ప ఇతిహాసం. మునుపెన్నడూ చూడని స్థాయిలో తిరిగి చెప్పబడింది. ఒక అద్భుతమైన దృశ్య కావ్యం కోసం చూస్తు ఉండండి’ అంటూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. అల్లు ఎంటర్ టైనర్ మెంట్స్ పేరుతో అల్లు అరవింద్ ఫ్యామిలీ ఇటీవలే కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ పై రూపొందుతున్న తొలి ప్రాజెక్ట్ ఇదే.

ఇందులో బాలీవుడ్, టాలీవుడ్ తో పాటు పలు భాషలకు చెందిన నటీనటుల్ని లైవ్ యాక్షన్ విధానంలో చూపించబోతున్నారు. దర్శకుడితో పాటు నటీనటుల వివరాల్ని త్వరలోనే వెల్లడించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం