తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Curry And Cyanide Review: కర్రీ అండ్ సైనైడ్ రివ్యూ.. 14 ఏళ్లలో 6 హత్యలు.. ఇంటిసభ్యులనే కడతేర్చిన మహిళ క్రైమ్ స్టోరీ

Curry And Cyanide Review: కర్రీ అండ్ సైనైడ్ రివ్యూ.. 14 ఏళ్లలో 6 హత్యలు.. ఇంటిసభ్యులనే కడతేర్చిన మహిళ క్రైమ్ స్టోరీ

Sanjiv Kumar HT Telugu

10 January 2024, 5:20 IST

  • Curry And Cyanide The Jolly Joseph Case Review Telugu: కేరళలో జూలీ జోసేఫ్ అనే మహిళ ఆరు హత్యలు చేసిన నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీ సిరీస్ కర్రీ అండ్ సైనైడ్ ది జూలీ జోసేఫ్ కేస్. ఆమె ఎలా హత్యలు చేసిందో కర్రీ అండ్ సైనైడ్ రివ్యూలో తెలుసుకుందాం.

ఆరుగురు ఇంటి సభ్యులనే చంపిన మహిళ రియల్ క్రైమ్ స్టోరీ.. కర్రీ అండ్ సైనైడ్ రివ్యూ
ఆరుగురు ఇంటి సభ్యులనే చంపిన మహిళ రియల్ క్రైమ్ స్టోరీ.. కర్రీ అండ్ సైనైడ్ రివ్యూ

ఆరుగురు ఇంటి సభ్యులనే చంపిన మహిళ రియల్ క్రైమ్ స్టోరీ.. కర్రీ అండ్ సైనైడ్ రివ్యూ

టైటిల్: కర్రీ అండ్ సైనైడ్ ది జూలీ జోసేఫ్ కేస్

ట్రెండింగ్ వార్తలు

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

TV Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Laya: ఆ డైరెక్టర్ చంపుతానని బెదిరించాడు.. 18 ఏళ్లకు నిజం బయటపెట్టిన హీరోయిన్ లయ

నటీనటులు: రెమో రాయ్, రోజో థామస్, రెంజీ విల్సన్, కేజీ సైమన్, బీఏ అలూర్ నిజ జీవిత పాత్రలు)

దర్శకత్వం: క్రిస్టో టామీ

ప్రొడక్షన్: ఇండియా టుడే ఒరిజనల్స్

సంగీతం: తుషార్ లాల్

స్క్రీన్ ప్లే: షాలిని ఉషాదేవి

సినిమాటోగ్రఫీ: షెహనాద్ జలాల్, హరి కె వేదాంతం

ఎడిటింగ్: శృతి సుకుమారన్

రిలీజ్ డేట్: డిసెంబర్ 22, 2023

ఓటీటీ వేదిక: నెట్ ఫ్లిక్స్

Review Of Curry And Cyanide In Telugu: ఇటీవల ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న రియల్ క్రైమ్ స్టోరీ కర్రీ అండ్ సైనైడ్ ది జూలీ జోసేఫ్ కేస్. 2019లో కేరళలోని కూడతై గ్రామంలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసుకు సంబంధించిన నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు ఈ కర్రీ అండ్ సైనైడ్ డాక్యుమెంటరీ సిరీస్‌.

ఈ సిరీస్ ఏకంగా 30 దేశాల్లో టాప్ 10 స్థానంలో దూసుకుపోయింది. అంతేకాకుండా ఇందులోని ప్రధాన నిందితురాలు జూలీపై సోషల్ మీడియాలో మీమ్స్ సైతం వచ్చాయి. ఈ నేపథ్యంలో కర్రీ అండ్ సైనైడ్ ది జూలీ జోసేఫ్ డాక్యుమెంటరీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

కేరళలోని కూడతై గ్రామానికి చెందిన జూలీ జోసఫ్, రాయ్ థామస్ ఉత్తరాల ద్వారా ప్రేమించుకుంటారు. ఇంట్లో ఇరు కుటుంబసభ్యులను ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంటారు. రాయ్ థామస్‌కు అమ్మ అన్నమ్మ థామస్, నాన్న టామ్ థామస్. చెల్లెలు రెంజీ థామస్, సోదరుడు రోజో థామస్ ఉంటారు. పేరెంట్స్ ఇద్దరూ రిటైర్డ్ టీచర్స్. జూలీ జోసేఫ్ ఎంకామ్ చదడవంతో పెళ్లి చేసుకున్నాకా ఉద్యోగం చేస్తే ఇద్దరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవిస్తారు అని రాయ్ థామస్ తల్లి అన్నమ్మ వివాహానికి ఒప్పుకుంటుంది.

పెళ్లై ఒక బాబు (రెమో రాయ్) పుట్టిన కొన్ని రోజులకు జూలీ థామస్‌ను ఉద్యోగం చేయమని తరచుగా చెబుతుంది అన్నమ్మ. ఈ క్రమంలోనే 2002లో హార్ట్ ఎటాక్‌తో అన్నమ్మ చనిపోతుంది. తర్వాత ఆరేళ్లకు 2008లో టామ్ థామస్ కూడా తనువు చాలిస్తాడు. అనంతరం రెండేళ్లకు భర్త రాయ్ థామస్ కూడా అనుమానస్పదంగా చనిపోతాడు. ఇలా థామస్ కుటుంబంలో ఒక్కొక్కరిగా ఎందుకు చనిపోతున్నారు? వారిని చంపింది జూలీనే అని ఎలా తెలుసుకున్నారు? వారిని ఆమె ఎలా చంపింది? ఎందుకు చంపింది? అనే విషయాలు తెలియాలంటే కర్రీ అండ్ సైనైడ్ డాక్యుమెంటరీ చూడాల్సిందే.

విశ్లేషణ:

నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఎక్కువగా బయోపిక్ సినిమాలు వస్తుంటాయి. కానీ, కొన్నిసార్లు సమాజంలో జరిగిన సంచలన వార్తలను వెబ్ సిరీసులు‌, సినిమాల రూపంలోనే మాత్రమే కాకుండా డాక్యుమెంటరీ సిరీస్ తరహాలో కూడా తెరకెక్కిస్తారు. ఈ డాక్యుమెంటరి సిరీస్‌లో నిజ జీవిత సంఘటనలలో పాల్గొన్నవారు, బాధితులు, వారికి సంబంధించిన వారే స్వయంగా అప్పటి విషయాలను చెబుతారు. అలా తెరకెక్కించిందే కర్రీ అండ్ సైనైడ్ ది జూలీ జోసేఫ్ కేస్.

ప్రేమ-పెళ్లి

జూలీ జోసేఫ్ అరెస్ట్‌తో ఈ డాక్యుమెంటరీ ప్రారంభం అవుతుంది. జూలీ, రాయ్ పరిచయం, పెళ్లి నుంచి ఏం జరిగిందో రాయ్ కుటుంబ సభ్యులు రెంజీ (జూలీ మరదలు), రెమో (జూలీ పెద్ద కుమారుడు), రోజో (జూలీ బావమరిది) ఒక్కక్కరుగా చెబుతుంటారు. అలాగే ఈ కేసుకు సంబంధించిన లీగల్ తదితర విషయాలను.. బీఏ అలూర్ (జూలీ డిఫెన్స్ లాయర్), నిఖిలా హెన్రీ (జర్నలిస్ట్), కేజీ సైమన్ (కేస్ ఇన్వెస్టిగేషన్ హెడ్), మేఘన శ్రీవాస్తవ్ (క్రిమినల్ అండ్ లీగల్ సైకాలజీ ఎక్స్‌పర్ట్), సీఎస్ చంద్రిక (రచయిత) వివరిస్తుంటారు.

పోస్ట్ మార్టమ్‌తో

అన్నమ్మ థామస్, టామ్ థామస్, రాయ్ థామస్‌తోపాటు అన్నమ్మ సోదరుడు మాథ్యూ మంచాడియల్, షాజు జచారియ ఏడాదిన్నర పాప అల్ఫైన్, జచారియ భార్య సిలీలను కూడా జూలీ హత్య చేస్తుంది. ఈ హత్యలు జరిగినప్పుడు వాళ్ల మానసకి పరిస్థితి ఏంటనేది రెంజీ, రెమో, రోజో చెప్పారు. అలాగే రాయ్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడనే జూలీ చెప్పిన కారణంతో అనుమానం వచ్చి పోస్ట్ మార్టమ్ కోసం పట్టుపబడతాడు మాథ్యూ మంచాడియల్.

లీగల్ చిక్కులు

అప్పుడు రాయ్ సైనైడ్ తీసుకున్నాడని తెలియడం, తర్వాత కొన్నాళ్లకు మాథ్యూ, అనంతరం రెండేళ్లకు 2016లో జూలీ భర్త దగ్గరి బంధువు షాజు జచారియా భార్య, పాప చనిపోవడంతో కేసు తీవ్రంగా మారుతుంది. అదంతా ఎలా జరిగిందో చూపించారు. కానీ, వీరందరిని జూలీ ఒక్కరే చంపిందా.. ఎవరెవరి సహాయం తీసుకుందో వివరంగా చెప్పలేదు. ఇందులో కొన్ని లీగల్ చిక్కులు ఉండటంతో కొన్ని విషయాలను చూపించలేదని తెలుస్తోంది.

ఇద్దరు అరెస్ట్

డాక్యుమెంటరీ మొత్తం రాయ్ థామస్ కుటుంబం వైపు నుంచి చూపించారు. జూలీ ఏమనుకుంది.. తను ఏం చేయాలనుకుందో స్పష్టంగా వివరించలేదు. కానీ, జూలీకి సైనైడ్ అమ్మిన, అందుకు సహాయం చేసిన ఎమ్ఎస్ మాథ్యూ, ప్రాజీ కుమార్‌లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇలా కొన్ని విషయాలను వదిలేసిన ఓవరాల్‌గా జూలీ హత్యలు చేయడానికి కారణం, చేసిన తీరు కళ్లకు కట్టినట్లు చూపించారు. ఫిక్షనల్ స్టోరీస్ చూసి బోర్ కొట్టినవాళ్లు ఈ జూలీ కేస్‌ను (కర్రీ అండ్ సైనైడ్ ది జూలీ జోసేఫ్ కేస్) చూడొచ్చు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం