Curry And Cyanide OTT: ఓటీటీలోకి వచ్చిన రియల్ క్రైమ్ స్టోరీ కర్రీ అండ్ సైనైడ్.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?-curry and cyanide the jolly joseph case ott streaming on netflix from december 22 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Curry And Cyanide Ott: ఓటీటీలోకి వచ్చిన రియల్ క్రైమ్ స్టోరీ కర్రీ అండ్ సైనైడ్.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Curry And Cyanide OTT: ఓటీటీలోకి వచ్చిన రియల్ క్రైమ్ స్టోరీ కర్రీ అండ్ సైనైడ్.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Sanjiv Kumar HT Telugu

Curry And Cyanide The Jolly Joseph Case OTT: రియల్ క్రైమ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించిన కర్రీ అండ్ సైనైడ్ డాక్యుమెంటరీ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది ఈ క్రైమ్ థ్రిల్లర్.

కర్రీ అండ్ సైనైడ్: ది జూలీ జోసేఫ్ కేస్ ఓటీటీ స్ట్రీమింగ్

Curry And Cyanide OTT Streaming: క్రైమ్ థ్రిల్లర్ మూవీస్, వెబ్ సిరీస్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు మూవీ లవర్స్. వారికోసమే అన్నట్లుగా తాజాగా ఓ రియల్ క్రైమ్ స్టోరీ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చి అలరిస్తోంది. కేరళలో జరిగిన ఓ రియల్ క్రైమ్ స్టోరీని ఇప్పటికే చాలా మంది సినిమాగా తెరకెక్కించారు. మరికొందరు డాక్యుమెంటరీ, సీరియల్‌గా కూడా మలిచి విడుదల చేశారు.

సంచలనంగా మారిన కేస్

ఈ కేరళ క్రైమ్ స్టోరీ ఆధారంగా ఇప్పటికీ మూడు చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా డాక్యుమెంటరీ వచ్చింది. అదే "కర్రీ అండ్ సైనైడ్: ది జూలీ జోసేఫ్ కేస్". కేరళలోని కోజికోడ్ కూడతాయి గ్రామానికి చెందిన జూలీ జోసేఫ్ 14 సంవత్సరాల్లో మొత్తం 6 హత్యలు చేసింది. తన కుటుంబ సభ్యులనే తాను హత్య చేయడం అప్పట్లో సంచలనంగా మారింది.

తెలుగులో కూడా

ముఖ్యంగా ఆమె ఆరు హత్యలు ఎలా చేసింది, ఎందుకు చేసిందో తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు. ఈ రియల్ క్రైమ్ కథను ఆధారంగా తీసుకునే అనేక సినిమాలు రాగా తాజాగా కర్రీ అండ్ సైనైడ్ ది జూలీ జోసేఫ్ కేస్ పేరుతో డాక్యుమెంటరీ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కర్రీ అండ్ సైనైడ్ డిసెంబర్ 22 నుంచి ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, మలయాళం, హిందీ, తమిళం, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

2019లో అరెస్ట్

జూలీ జోసేఫ్ తన కుటుంబ సభ్యులనే సైనైడ్ పెట్టి చంపేస్తుంది. ఆమె వారికి సైనైడ్ ఎలా ఇచ్చింది, ఆ హత్యలను ఎలా కవర్ చేసింది. చివరకు ఆమె పోలీసులకు ఎలా చిక్కింది వంటి అనేక ఆసక్తిర అంశాలతో కర్రీ అండ్ సైనైడ్ ఉందని సమాచారం. ఇదిలా ఉంటే 2019లో జూలీతోపాటు ఆమెకు సైనైడ్ సరఫరా చేసిన మరో ఇద్దరు నిందితులు ఎమ్ఎస్ మాథ్యూ, ప్రాజీ కుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.