తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chandramukhi 2 Ott Release Date: చంద్ర‌ముఖి 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Chandramukhi 2 OTT Release Date: చంద్ర‌ముఖి 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

17 October 2023, 6:25 IST

  • Chandramukhi 2 OTT Release Date: కంగ‌నా ర‌నౌత్ చంద్ర‌ముఖి 2 ఓటీటీలోకి వ‌చ్చేది ఎప్పుడ‌న్న‌ది క్లారిటీ వ‌చ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

చంద్ర‌ముఖి 2
చంద్ర‌ముఖి 2

చంద్ర‌ముఖి 2

Chandramukhi 2 OTT Release Date: కంగ‌నా ర‌నౌత్, లారెన్స్ హీరోహీరోయిన్లుగా న‌టించిన చంద్ర‌ముఖి 2 ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అక్టోబ‌ర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోన్న‌ట్లు స‌మాచారం. త‌మిళం, తెలుగుతో పాటు మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో చంద్ర‌ముఖి 2 రిలీజ్ కానున్న‌ట్లు తెలిసింది. ర‌జ‌నీకాంత్ (Rajinikanth) క‌ల్ట్ క్లాసిక్ మూవీ చంద్ర‌ముఖికి సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాకు పి.వాసు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ట్రెండింగ్ వార్తలు

Brahmamudi May 17th Episode: బ్రహ్మముడి- అనామికకు కల్యాణ్ విడాకులు- లేచిపోదామన్న అప్పు- తాతయ్య వార్నింగ్- కావ్యకు 2 డేస్

Ntr Prashanth Neel Movie: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీ టైటిల్ ఇదేనా? - కేజీఎఫ్‌కు మించి యాక్ష‌న్‌…ఎలివేష‌న్స్?

Krishna mukunda murari serial:ముకుందకు మురారి సేవలు.. మీరా నెల తప్పిందన్న భవానీ, షాక్ లో కృష్ణ

Karthika deepam 2:కార్తీకదీపం 2 సీరియల్..కాంచనని మోసం చేస్తున్న శ్రీధర్.. కార్తీక్ గురించి మరో నిజం తెలుసుకున్న పారిజాతం

కంగ‌నా ర‌నౌత్ హీరోయిన్‌గా న‌టించ‌డం, కీర‌వాణి(Keeravani) మ్యూజిక్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ నిర్మాణంలో భారీ అంచ‌నాల న‌డుమ సెప్టెంబ‌ర్ 28న పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజైన ఈ సీక్వెల్‌ చంద్ర‌ముఖి మ్యాజిక్‌ను రిపీట్ చేయ‌లేపోయింది. దాదాపు 60కోట్ల‌కుపైగా బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా న‌ల‌భై కోట్ల‌లోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి నిర్మాత‌ల‌కు 20 కోట్ల వ‌ర‌కు న‌ష్టాల‌ను మిగిల్చింది.

తెలుగు వెర్ష‌న్ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ర‌జ‌నీకాంత్ చంద్ర‌ముఖి త‌ర‌హాలో హార‌ర్‌, థ్రిల్లింగ్ అంశాలు ఈ సీక్వెల్‌లో మిస్స‌య్యాయ‌నే విమ‌ర్శ‌లొచ్చాయి. చంద్ర‌ముఖి 2 సినిమాలో మ‌హిమా నంబియార్‌, ల‌క్ష్మీ మీన‌న్‌, సుభీక్ష ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

చంద్ర‌ముఖి 2 క‌థేమిటంటే?

చంద్ర‌ముఖి ప్యాలెస్ నుంచి చాలా ఏళ్ల క్రితం వెళ్లిపోయిన ఆత్మ మ‌ళ్లీ తిరిగొస్తుంది. మ‌ద‌న్ (లారెన్స్‌) కుటుంబాన్ని ఇబ్బందిపెడుతుంది. చంద్ర‌ముఖి ఆత్మ బారి నుంచి మ‌ద‌న్ త‌న కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ‌.

రిలీజ్‌కు ముందే లీక్‌...

ఓటీటీ రిలీజ్‌కు ముందే చంద్ర‌ముఖి 2 సినిమా ఆన్‌లైన్‌లో లీకైంది. త‌మిళ వెర్ష‌న్‌కు సంబంధించి హెచ్‌డీ ప్రింట్ పైర‌సీ సైట్‌తో పాటు కొన్ని సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో క‌నిపించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం