తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmastra Teaser | బ్రహ్మాస్త్ర కొత్త టీజర్‌లో నాగార్జున

Brahmastra Teaser | బ్రహ్మాస్త్ర కొత్త టీజర్‌లో నాగార్జున

HT Telugu Desk HT Telugu

31 May 2022, 15:33 IST

    • బాలీవుడ్‌లో మచ్‌ అవేటడ్‌ మూవీ బ్రహ్మాస్త్ర. సరిగ్గా ఇవాళ్టి (మే 31) నుంచి వంద రోజుల్లో (సెప్టెంబర్‌ 9) రిలీజ్‌ కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్‌ మరో టీజర్‌ను మంగళవారం రిలీజ్‌ చేశారు. ఈ టీజర్‌ను విశాఖపట్నంలోనే రాజమౌళి, రణ్‌బీర్‌, అయాన్‌ ముఖర్జీ రిలీజ్‌ చేయడం విశేషం.
విశాఖపట్నంలో బ్రహ్మాస్త్ర టీమ్ తో పాటు దర్శకధీరుడు రాజమౌళి
విశాఖపట్నంలో బ్రహ్మాస్త్ర టీమ్ తో పాటు దర్శకధీరుడు రాజమౌళి (Twitter)

విశాఖపట్నంలో బ్రహ్మాస్త్ర టీమ్ తో పాటు దర్శకధీరుడు రాజమౌళి

రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌లాంటి క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ బ్రహ్మాస్త్ర. ఈ జోడీ తొలిసారి కలిసి నటించారు. ఈ మూవీ షూటింగ్‌లోనే ప్రేమలో పడ్డారు. రీసెంట్‌గా పెళ్లి కూడా చేసుకున్నారు. నిజానికి ఈ ప్రాజెక్ట్‌కు కరోనా దెబ్బ గట్టిగానే తగిలింది. ఎప్పుడో రెండేళ్ల కిందటే రిలీజ్‌ కావాల్సి ఉన్నా చాలా ఆలస్యమైంది. మొత్తానికి గత నెలలోనే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబర్‌ 9న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

Blink OTT Streaming: వీకెండ్‌లో ఈ కన్నడ సై-ఫి థ్రిల్లర్ మూవీ అస్సలు మిస్ కావద్దంటున్న ఓటీటీ ప్రేక్షకులు

Flop Movies With super hit songs: పాట హిట్.. బొమ్మ ఫట్.. తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్న ఫ్లాప్ మూవీస్ ఇవే

Korean Movies in Cannes: కేన్స్‌లో దుమ్ము రేపిన ఈ కొరియన్ సినిమాలను ఏ ఓటీటీల్లో చూడాలంటే..

Love Me Trailer: భయపెడుతున్న వైష్ణవి చైతన్య లవ్ మి ట్రైలర్.. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు?

ఇక ఇప్పుడు రిలీజ్‌కు సరిగ్గా వంద రోజులు ఉండటంతో ఓ కొత్త టీజర్‌ రిలీజ్‌ చేశారు. దీనికోసమే రణ్‌బీర్‌, రాజమౌళి, అయాన్‌ ముఖర్జీ విశాఖపట్నం వచ్చారు. ఈ టీజర్‌లోనే చివరికి ట్రైలర్‌ను జూన్‌ 15న రిలీజ్‌ చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ఈ కొత్త టీజర్‌లో నాగార్జునతోపాటు అమితాబ్‌ బచ్చన్‌, మౌనీరాయ్‌లను కూడా చూడొచ్చు.

ఐదేళ్ల కిందట షూటింగ్‌ ప్రారంభమైన ఈ సినిమా.. ఈ ఏడాది రిలీజ్‌ కాబోతోందంటేనే ఎంత ఆలస్యమైందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో నాగార్జున ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించాడు. బ్రహ్మాస్త్ర మూవీలో ఇది ఫస్ట్‌పార్ట్‌. దీని పేరు శివ. ఇక ఈ కొత్త టీజర్‌ను ఆలియా భట్‌ తన ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. మరో వంద రోజుల్లో బ్రహ్మాస్త్ర మీదవుతుంది.. ట్రైలర్‌ జూన్‌ 15న రానుంది అని చెప్పింది.

అంతకుముందు విశాఖపట్నంలో రాజమౌళి, రణ్‌బీర్‌, అయాన్‌ ముఖర్జీలకు ఘన స్వాగతం లభించింది. వాళ్లకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో బ్రహ్మాస్త్రకు సంబంధించి ఏదో ముఖ్యమైన అప్‌డేట్‌ రాబోతోందని ఊహించారు. మేకర్స్‌ ఇప్పుడిలా టీజర్‌తో సర్‌ప్రైజ్‌ చేశారు. బ్రహ్మాస్త్ర మూవీని తెలుగులో రాజమౌళి సమర్పిస్తున్న విషయం తెలిసిందే.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం