తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ss Rajamouli|అసిస్టెంట్స్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్స్ ఇచ్చిన రాజ‌మౌళి…

SS Rajamouli|అసిస్టెంట్స్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్స్ ఇచ్చిన రాజ‌మౌళి…

HT Telugu Desk HT Telugu

05 May 2022, 10:40 IST

  • ఆర్ఆర్ఆర్ తో కెరీర్‌లో మ‌రో పెద్ద విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నారు రాజ‌మౌళి. చారిత్ర‌క క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ చిత్రం ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ను  సాధించిన చిత్రాల్లో మూడోస్థానంలో నిలిచింది. ఈ విజ‌యంలో త‌న‌కు అండ‌గా నిలిచిన అసిస్టెంట్స్‌కు రాజ‌మౌళి స్పెష‌ల్ గిఫ్ట్‌ల‌ను అంద‌జేసిన‌ట్లు తెలిసింది.

రాజ‌మౌళి
రాజ‌మౌళి (twitter)

రాజ‌మౌళి

ఆర్ఆర్ఆర్ తో మ‌రోసారి తెలుగు సినిమా స‌త్తాను ప్ర‌పంచానికి చాటిచెప్పారు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. చారిత్ర‌క క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ సినిమా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా 1100 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను సాధించింది.  తొలిత‌రం స్వాతంత్ర్య‌స‌మ‌ర‌యోధులు అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీమ్ జీవితాల‌కు ఫిక్ష‌న‌ల్ హంగుల‌ను జోడిస్తూ ఈ సినిమా రూపొందింది.  ఈ సినిమాలో రాజమౌళి తన దర్శకత్వ ప్రతిభతో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ పాత్ర‌ల‌ను మ‌ల‌చిన విధానం, హీరోయిజం, ఎమోష‌న్స్ పండించిన తీరుపై  ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

TV Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

 ప్ర‌స్తుతం ఈ విజ‌యాన్ని రాజ‌మౌళి ప‌రిపూర్ణంగా ఆస్వాదిస్తున్నారు. తాజాగా ఈ స‌క్సెస్‌లో భాగ‌మైన డైరెక్ష‌న్ డిపార్ట్‌మెంట్‌తో పాటు స‌హాయ సిబ్బందికి రాజ‌మౌళి కాస్ట్‌లీ గిఫ్ట్‌ల‌ను అంద‌జేసిన‌ట్లు స‌మాచారం. అసిస్టెంట్స్ అంద‌రికి ఖ‌రీదైన ఐఫోన్‌ల‌ను బ‌హుమ‌తిగా ఇచ్చిన‌ట్లు చెబుతున్నారు. విజ‌యానికి గుర్తుగా ఈ స్పెషల్ గిఫ్ట్ లను అంద‌జేసిన‌ట్లు తెలిసింది.. అలాగే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బాహుబ‌లితో పాటు ఆర్ఆర్ఆర్ సినిమాకు కీర‌వాణి స‌తీమ‌ణి వ‌ల్లి లైన్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఆమెకూడా త‌న అసిస్టెంట్స్ అందరికి న‌గ‌దును బ‌హుమ‌తిగా అందించిన‌ట్లు స‌మాచారం.  రాజ‌మౌళి, వ‌ల్లి స్వ‌యంగా ఈ బ‌హుమ‌తుల‌ను ఇచ్చినట్లు  తెలిసింది.  

ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌లై నెల రోజులు దాటిన ఇప్ప‌టికీ చ‌క్క‌టి వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్‌బాబుతో అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌ను రాజ‌మౌళి తెర‌కెక్కించ‌బోతున్నారు. 

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం