తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bhagavanth Kesari Ott Release: భగవంత్ కేసరి ఓటీటీలోకి వచ్చేస్తోంది.. మరికొన్ని గంటల్లోనే..

Bhagavanth Kesari OTT Release: భగవంత్ కేసరి ఓటీటీలోకి వచ్చేస్తోంది.. మరికొన్ని గంటల్లోనే..

Hari Prasad S HT Telugu

23 November 2023, 16:42 IST

    • Bhagavanth Kesari OTT Release: భగవంత్ కేసరి మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. గత నెలలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కాగా.. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రాబోతోంది.
ఓటీటీలోకి వచ్చేస్తున్న భగవంత్ కేసరి మూవీ
ఓటీటీలోకి వచ్చేస్తున్న భగవంత్ కేసరి మూవీ

ఓటీటీలోకి వచ్చేస్తున్న భగవంత్ కేసరి మూవీ

Bhagavanth Kesari OTT Release: ఈ ఏడాది నందమూరి బాలకృష్ణ నటించి, రూ.100 కోట్లు వసూలు చేసిన రెండో సినిమా భగవంత్ కేసరి ఓటీటీలోకి వచ్చేస్తోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దుమ్ము దులిపిన తర్వాత ఇప్పుడు ప్రైమ్ వీడియోలోకి రాబోతోంది. గురువారం (నవంబర్ 23) అర్ధరాత్రి 12 గంటలకు ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ, కాజల్, శ్రీలీల నటించారు. ఇప్పుడీ సినిమా తెలుగు వెర్షన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 19న రిలీజైన ఈ సినిమాకు తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ ఏడాది మొదట్లో వీర సింహా రెడ్డి తర్వాత మరోసారి రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన రెండో బాలయ్య బాబు సినిమాగా నిలిచింది.

ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ నటించాడు. తమన్ మ్యూజిక్ అందించాడు. షైన్ స్క్రీన్స్ మీడియా సినిమాను తెరకెక్కించింది. భ‌గ‌వంత్ కేస‌రి ప‌క్కా బాల‌కృష్ణ మార్క్ మూవీ. ఆయ‌న శైలి మాస్‌, యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు రివేంజ్ డ్రామాను జోడించి ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఈ క‌థ‌ను రాసుకున్నాడు. బాల‌కృష్ణ‌, శ్రీలీల ఎమోష‌న్స్ ప్ర‌ధానంగా సినిమా సాగుతుంది. బాల‌కృష్ణ‌కు ఇలాంటి సినిమాలు కొత్త కాదు.

డైరెక్ట‌ర్‌గా అనిల్ రావిపూడి మాత్రం త‌న పంథాకు భిన్నంగా ఫ‌స్ట్‌టైమ్ మాస్ స‌బ్జెక్ట్‌తో ఈ సినిమా చేశాడు. క‌థ లాజిక్‌ల‌ను ప‌క్క‌న‌పెట్టి బాలకృష్ణ‌లోని హీరోయిజం ద్వారా పాస్ మార్కులు కొట్టేయాల‌ని ప్ర‌య‌త్నించాడు అనిల్ రావిపూడి. తెలంగాణ స్లాంగ్‌, డైలాగ్స్ సినిమా అడ్వాంటేజ్‌గా నిలిచాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం