తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Simha Re Releasedate: ప‌ద‌మూడేళ్ల త‌ర్వాత రీ రిలీజ్ కాబోతున్న బాల‌కృష్ణ సింహా

Simha Re ReleaseDate: ప‌ద‌మూడేళ్ల త‌ర్వాత రీ రిలీజ్ కాబోతున్న బాల‌కృష్ణ సింహా

04 March 2023, 13:19 IST

  • Simha Re ReleaseDate: బాల‌కృష్ణ హీరోగా న‌టించిన సింహా సినిమా ప‌ద‌మూడేళ్ల త‌ర్వాత మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. ఈ సినిమా ఎప్పుడు రీ రిలీజ్ కానుందంటే...

బాల‌కృష్ణ
బాల‌కృష్ణ

బాల‌కృష్ణ

Simha Re ReleaseDate: టాలీవుడ్‌లో హీరో బాల‌కృష్ణ‌, ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీనుల‌ది సూప‌ర్‌హిట్ కాంబినేష‌న్‌. 2010లో రూపొందిన సింహా సినిమాతోనే వీరిద్ద‌రి కాంబినేష‌న్ మొద‌లైంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన సింహా సినిమా 2010 ఏడాదిలో హ‌య్యెస్ట్ గ్రాసింగ్ సినిమాగా నిలిచింది.

ట్రెండింగ్ వార్తలు

Laya: ఆ డైరెక్టర్ చంపుతానని బెదిరించాడు.. 18 ఏళ్లకు నిజం బయటపెట్టిన హీరోయిన్ లయ

Sunil: మ‌మ్ముట్టి సినిమాలో విల‌న్‌గా సునీల్ - ట‌ర్బోతో మ‌ల‌యాళంలోకి ఎంట్రీ - ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

Vijay Sethupathi: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కొత్త ప్రయోగం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా ఏసీఈ

NNS May 18th Episode: పుట్టింటికి అరుంధతి.. సరస్వతిని చంపేస్తున్న మనోహరి.. అందరికీ తెలియనున్న నిజం​​​!

దాదాపు ప‌ద‌మూడేళ్ల విరామం త‌ర్వాత సింహా సినిమా మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. మార్చి 11న థియేట‌ర్ల‌లో ఈ సినిమాను రీ రిలీజ్ చేయ‌బోతున్నారు. సింహా సినిమాలో బాల‌కృష్ణ డ్యూయ‌ల్ రోల్‌లో న‌టించాడు. శ్రీమ‌న్నారాయ‌ణ‌ అనే లెక్చ‌ర‌ర్‌గా, స‌మాజంలోని అన్యాయాన్ని ఎదురించే న‌ర‌సింహా అనే డాక్ట‌ర్‌గా ప‌వ‌ర్‌ఫుల్ రోల్స్‌లో క‌నిపించాడు.

బాల‌కృష్ణ యాక్టింగ్‌, ఆయ‌న‌పై తెర‌కెక్కించ‌న యాక్ష‌న్ సీక్వెన్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. ఈ సినిమాలో న‌య‌న‌తార‌, స్నేహా ఉల్లాల్‌, న‌మిత హీరోయిన్లుగా న‌టించారు.

దాదాపు 18 కోట్ల వ్య‌యంతో రూపొందిన సింహా సినిమా 40 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. సింహా సినిమాకు గాను బెస్ట్ యాక్ట‌ర్‌గా బాల‌కృష్ణ నంది అవార్డును అందుకున్నాడు. ఇటీవ‌లే సంక్రాంతికి రిలీజైన వీర‌సింహారెడ్డి సినిమాతో కెరీర్‌లో అతిపెద్ద విజ‌యాన్ని అందుకున్నాడు బాల‌కృష్ణ‌. ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు బాల‌కృష్ణ‌.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం