తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Siima Awards 2022: ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ - నటిగా పూజాహెగ్డే సైమా అవార్డ్స్ - తెలుగు విజేతలు వీరే

siima awards 2022: ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ - నటిగా పూజాహెగ్డే సైమా అవార్డ్స్ - తెలుగు విజేతలు వీరే

11 September 2022, 11:00 IST

  • సైమా అవార్డ్స్ వేడుకలో అల్లు అర్జున్ పుష్ప సినిమా మెరిసింది.  ఉత్తమ సినిమాతో పాటు పలు విభాగాల్లో అవార్డులు అందుకున్నది. 

అల్లు అర్జున్
అల్లు అర్జున్ (twitter)

అల్లు అర్జున్

సైమా అవార్డ్స్ వేడుకలు శనివారం బెంగళూరులో మొదలయ్యాయి. తొలిరోజు తెలుగు, కన్నడ సినిమాలకు అవార్డులను అందజేశారు. టాలీవుడ్ నుంచి పుష్ప సినిమా అత్యధిక అవార్డులను దక్కించుకున్నది. ఉత్తమ సినిమాగా పుష్ప సినిమా అవార్డును సొంతం చేసుకున్నది. ఈ సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్, బెస్ట్ డైరెక్టర్ గా సుకుమార్ సైమా అవార్డులను అందుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Love Me Trailer: భయపెడుతున్న వైష్ణవి చైతన్య లవ్ మి ట్రైలర్.. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు?

Lampan OTT: బాల్యాన్ని గుర్తుచేసేలా ఉన్న వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.. ఏ ప్లాట్‍ఫామ్‍లో చూడొచ్చంటే..

Mega vs Allu fans: మెగా, అల్లు అభిమానుల మధ్య పెరుగుతూనే ఉన్న గ్యాప్! మీమ్‍లతో ఫ్యాన్స్ వార్

Scam 2010 Web Series: స్కామ్ 2010.. మరో వెబ్ సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. ఈసారి సుబ్రతా రాయ్ స్కామ్

పుష్ప సినిమాకు గాను బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ జగదీష్ ప్రసాద్, బెస్ట్ లిరిసిస్ట్ చంద్రబోస్ అవార్డులు గెలుచుకున్నారు. ఉత్తమ నటిగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాకుగాను పూజాహెగ్డే అవార్డును సొంతం చేసుకున్నది. బెస్ట్ సపోర్టింగ్ రోల్ లో వరలక్ష్మి శరత్ కుమార్ (క్రాక్) అవార్డ్ అందుకున్నది.

ఉప్పెన సినిమాతో బెస్ట్ డెబ్యూ హీరోగా వైష్ణవ్ తేజ్, బెస్ట్ డెబ్యూ హీరోయిన్ గా కృతిశెట్టి, డెబ్యూ డైరెక్టర్ గా బుచ్చిబాబు అవార్డులను దక్కించుకున్నారు. క్రిటిక్స్ ఛాయిస్ విభాగంలో బెస్ట్ యాక్టర్ గా నవీన్ పొలిశెట్టి అవార్డు గెలుచుకున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం