తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Alia-ranbir | రణ్‌బీర్‌తో దిగిన క్లోజ్ ఫొటోలను షేర్ చేసిన ఆలియా

Alia-Ranbir | రణ్‌బీర్‌తో దిగిన క్లోజ్ ఫొటోలను షేర్ చేసిన ఆలియా

14 May 2022, 16:10 IST

    • వివాహమై ఒక నెల గడిచిన సందర్భంగా ఆలియా.. రణ్‌బీర్‌తో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసింది. వీరిద్దరికీ గత నెల 14వ తేదీన పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ఫొటోలను పంచుకుంది.
ఆలియా-రణ్‌బీర్
ఆలియా-రణ్‌బీర్ (Instagram)

ఆలియా-రణ్‌బీర్

బాలీవుడ్ నూతన వధూవరులైన ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ గత నెలలో పెళ్లితో ఒక్కటైన విషయం తెలిసిందే. ఐదేళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నప్పటికీ తమ ప్రేమ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకుండా గోప్యంగా ఉంచారు. ఎట్టకేలకు గత నెల 14వ తేదీన ముంబయిలో ఒక్కటై అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. తాజాగా వీరి పెళ్లి జరిగిన నెల రోజులు పూర్తయిన సందర్భంగా ఆలియా భట్ తమ ఫొటోలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇద్దరూ సన్నిహితంగా దిగిన చిత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

TV Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఈ ఫొటోల్లో రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ చాలా అన్యోన్యంగా, సన్నిహితంగా ఉన్నట్లు కనిపించారు. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ఆస్వాదిస్తున్న ఈ జంట తమ బంధం మరింత పదిలంగా ఉండాలని కోరుకుంటోంది. 2018లో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి వీరి ప్రేమ, పెళ్లి విషయంపై మీడియాలో అనేక రకాల కథనాలు వచ్చాయి. అయితే ఎప్పటికప్పుడు గోప్యంగా ఉంచుతూ.. తమ బంధం గురించి బహిర్గత పరచలేదు. కానీ ఎట్టకేలకు గత నెలలో ఇద్దరూ వివాహంతో ఒక్కటయ్యారు.

పెళ్లి తర్వాత ఆలియా భట్ భావోద్వేగంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. దీంతో పాటు ఫొటోలను కూడా షేర్ చేసింది. "ఈ రోజు మా ఇంట్లో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య అంగరంగ వైభవంగా నా పెళ్లి జరిగింది. గత ఐదేళ్లుగా మా రిలేషన్‌షిప్‌లో ఎంతో ఆనందంగా గడిపిన మా బాల్కనీ వద్ద ఈ వేడుక జరిగింది. కలిసి పంచుకున్న ఎన్నో జ్ఞపకాలు ఇక్కడ ఉన్నాయి. మరిన్నీ సృష్టించుకోబోతున్నాం. నవ్వులు, సరదాలు, సరసాలు, చిన్న చిన్న గొడవలు, వైన్ డిలైట్స్, చైనీస్ బైట్స్, మూవీ నైట్స్ ఇలా ఎన్నో జ్ఞాపకాలు పంచుకున్నాం. మా జీవితంలో అత్యంత ముఖ్యమైన సమయంలో ప్రేమను, వెలుగును ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది ఈ క్షణాన్ని మరింత ప్రత్యేకంగా చేసింది ప్రేమతో మీ రణ్‌బీర్-ఆలియా" అని పోస్ట్ పెట్టింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం