తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Akshay Kumar Indian Citizenship: అక్షయ్ కుమార్ ఇక భారతీయుడే.. ప్రూఫ్ షేర్ చేసిన హీరో

Akshay Kumar Indian citizenship: అక్షయ్ కుమార్ ఇక భారతీయుడే.. ప్రూఫ్ షేర్ చేసిన హీరో

Hari Prasad S HT Telugu

15 August 2023, 13:35 IST

    • Akshay Kumar Indian citizenship: అక్షయ్ కుమార్ ఇక భారతీయుడే.. దీనికి సంబంధించిన ప్రూఫ్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మంగళవారం (ఆగస్ట్ 15) అతడు షేర్ చేశాడు.
తాను భారతీయుడినంటూ ప్రభుత్వం జారీ చేసిన పత్రాలు చూపిన అక్షయ్ కుమార్
తాను భారతీయుడినంటూ ప్రభుత్వం జారీ చేసిన పత్రాలు చూపిన అక్షయ్ కుమార్

తాను భారతీయుడినంటూ ప్రభుత్వం జారీ చేసిన పత్రాలు చూపిన అక్షయ్ కుమార్

Akshay Kumar Indian citizenship: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇక నుంచి భారతీయుడే. ఇన్నాళ్లూ కెనడా పౌరసత్వం ఉన్న అతనికి.. తాజాగా భారతీయ పౌరసత్వం లభించింది. దీనికి సంబంధించిన ఆధారాన్ని అక్షయ్ బయటపెట్టాడు. ప్రభుత్వం తాను భారతీయ పౌరుడని గుర్తిస్తూ జారీ చేసిన పత్రాలను మంగళవారం (ఆగస్ట్ 15) ఇండిపెండెన్స్ డే సందర్భంగా ట్విటర్ లో షేర్ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గేమ్ చేంజర్ హీరోయిన్ డెబ్యూ ఎంట్రీ.. కియారా డ్రెస్ ప్రత్యేకతలు ఇవే!

Karthika Deepam Chandu: కార్తీక దీపం చందు ఆత్మ‌హ‌త్య - ప‌విత్ర జ‌యరాం చ‌నిపోయిన ఐదు రోజుల‌కే బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

Prabhas: ప్ర‌భాస్ చేతుల మీదుగా మొద‌లై రిలీజ్ కానీ దీపికా ప‌డుకోణ్ ఫ‌స్ట్ స్ట్రెయిట్ తెలుగు మూవీ ఏదో తెలుసా!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలోకి 10 సినిమాలు.. కచ్చితంగా చూడాల్సినవి 3 మాత్రమే.. ఎక్కడ చూస్తారంటే?

భారతీయ పౌరసత్వం లేకున్నా దశాబ్దాలుగా బాలీవుడ్ లో హీరోగా నటిస్తూ వస్తున్న అక్షయ్ పై చాన్నాళ్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా అతడు పలు దేశభక్తి సినిమాల్లోనూ నటించాడు. మొత్తానికి తాను భారతీయుడినని ప్రభుత్వం గుర్తించడంతో ఆ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఇక నుంచి మనసు, పౌరసత్వం రెండూ హిందుస్థానీయే.. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.. జై హింద్ అనే క్యాప్షన్ తో తన పౌరసత్వ పత్రాలను అక్షయ్ షేర్ చేయడం విశేషం.

2019లో హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ లో పాల్గొన్న అక్షయ్.. తాను భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోనున్నట్లు వెల్లడించాడు. మొత్తానికి ఇన్నాళ్లకు తాను చెప్పినట్లే పౌరసత్వాన్ని పొందాడు. అయితే తనకు కెనడా పౌరసత్వం ఉన్నంత మాత్రాన ఇండియన్ ను కాకుండా పోనని, తాను భారతీయుడేనని అక్షయ్ కొన్నాళ్లుగా చెబుతూ వస్తున్నాడు.

2019లోనే తాను దరఖాస్తు చేసుకున్నానని, అయితే ఆ తర్వాత కరోనా మహమ్మారి రావడంతో రెండు, రెండున్నరేళ్లు ఆలస్యంగా తనకు పౌరసత్వం వచ్చినట్లు అక్షయ్ వెల్లడించాడు. త్వరలోనే తనకు పూర్తిస్థాయి పాస్‌పోర్ట్ లభించనుందని కూడా గతంలో అతడు చెప్పాడు. ఈ మధ్యే అతడు ఓఎంజీ2 మూవీలో నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించింది. 11 ఏళ్ల కిందట వచ్చిన ఓ మై గాడ్ మూవీకి ఇది సీక్వెల్. పంకజ్ త్రిపాఠీ కూడా నటించాడు. ఇక సూర్య నటించిన ఆకాశమే హద్దురా మూవీ రీమేక్ లోనూ అక్షయ్ నటిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతోంది. ఇక టైగర్ ష్రాఫ్ తో కలిసి నటిస్తున్న బడే మియా చోటే మియా మూవీ వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా రిలీజ్ కానుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం