తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dheekshith Shetty About Dasara: 'దసరా'లో ఛాన్స్ రావడమే సక్సెస్‌లా భావిస్తున్నా.. సినిమాపై దీక్షిత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Dheekshith Shetty About Dasara: 'దసరా'లో ఛాన్స్ రావడమే సక్సెస్‌లా భావిస్తున్నా.. సినిమాపై దీక్షిత్ ఆసక్తికర వ్యాఖ్యలు

12 March 2023, 7:59 IST

    • Dheekshith Shetty About Dasara: నాని హీరోగా నటించిన దసరా చిత్రంలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కూడా కీలక పాత్ర పోషించారు. ప్రమోషన్లలో భాగంగా విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆతడు దసరా మూవీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
దీక్షిత్ శెట్టి
దీక్షిత్ శెట్టి

దీక్షిత్ శెట్టి

Dheekshith Shetty About Dasara: నేచురల్ స్టార్ నాని నటించిన పాన్ ఇండియా చిత్రం దసరా మూవీ మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా ప్రమోషన్లలో విరివిగా పాల్గొంటున్న చిత్రబృందం సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువచేసే ప్రయత్నం చేస్తోంది. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్ర పోషించారు. దసరా ప్రమోషన్లలో భాగంగా దీక్షిత్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

India Biggest Overseas Hit: చైనాలో 30 కోట్లకుపైగా టికెట్స్ అమ్ముడుపోయిన ఇండియన్ సినిమా ఇదే.. RRR కాదు!

Single Screen Theatres: సినీ ల‌వ‌ర్స్‌కు షాక్‌ - తెలంగాణ‌లో సింగిల్ స్క్రీన్ థియేట‌ర్లు మూత - కార‌ణం ఇదే

Double Ismart Teaser: బూతులతో డబుల్ ఇస్మార్ట్ టీజర్.. రామ్ పోతినేని-పూరి జగన్నాథ్ మ్యాజిక్ రిపీట్ అవుద్దా?

Rajinikanth: ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌తో భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియ‌న్ మూవీ తీయోచ్చు - ద‌ళ‌ప‌తి విజ‌య్ రికార్డ్ బ్రేక్‌

"దసరా లాంటి పాన్ ఇండియా చిత్రంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో అవకాశం రావడమే ఓ సక్సెస్‌గా బావిస్తున్నాను. మీట్ క్యూట్‌లో చూసి నన్ను ఈ సినిమాలో తీసుకున్నారు. నాని గారితో పనిచేయడం చాలా గొప్పగా ఉంది. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ఆయన నిజంగానే నేచురల్ స్టార్. సెట్‌కు ఎప్పుడూ పది నిమిషాల ముందే వచ్చేవారు. చాలా క్రమశిక్షణ కలిగి నటులు. ఆయన నుంచి ఎంతో స్ఫూర్తి పొందాను" అని దీక్షిత్ శెట్టి చెప్పాడు.

కీర్తి సురేష్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై మాట్లాడుతూ.. "మహానటి సినిమాలో కీర్తి సురేష్‌ పర్ఫార్మెన్స్ చూశాను. చాలా గొప్ప నటి. ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకుంటానని అస్సలు అనుకోలేదు. ఆమెతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది.దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పర్ఫెక్షనిస్టు. తను అనుకున్న ఔట్ పుట్ వచ్చేవరకు ఎక్కడా రాజీ పడలేదు. చాలా క్లారిటీ, విజన్ ఉన్న దర్శకుడు. ఆయనతో పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది. " అని అన్నాడు. దసరా సినిమాలో తన రోల్ సినిమా అంతటా ఉంటుందని, సూరి అనే పాత్రలో నటించానని తెలిపాడు.

దసరా సినిమా కోసం కన్నడ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని దీక్షిత్ తెలిపాడు. ఇప్పుడు సినిమాకు భాషతో సంబంధం లేదని, కేజీఎఫ్, పుష్ప, ఆర్ఆర్ఆర్ తర్వాత సినిమాలన్నింటినీ ఇండియన్ చిత్రాలుగా సెలబ్రేట్ చేసుకుంటున్నామని తెలిపారు. దసరా చిత్రంపై కన్నడలో చాలా క్రేజ్ ఉందని స్పష్టం చేశాడు. దియా తర్వాత థియేటర్లలో విడుదలవుతున్న సినిమా దసరానే అని, ఇందుకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపాడు.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా చిత్రం పీరియాడికల్ యాక్షన్ జోనర్‌లో తెరకెక్కింది. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రంలో సముద్రఖని కీలక పాత్ర పోషించారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా పాన్ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని 2023 మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం