తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Fan Proposes To Mrunal: అభిమాని నుంచి మృణాల్‌కు మ్యారేజ్ ప్రపోజల్.. అదిరే రిప్లయి ఇచ్చిన బ్యూటీ

Fan Proposes to Mrunal: అభిమాని నుంచి మృణాల్‌కు మ్యారేజ్ ప్రపోజల్.. అదిరే రిప్లయి ఇచ్చిన బ్యూటీ

28 February 2023, 6:05 IST

    • Fan Proposes to Mrunal: బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌కు తన అభిమాని నుంచి ప్రపోజల్ వచ్చింది. ఇందుకు ఈ ముద్దుగుమ్మ కూడా స్పందించింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మృణాల్ ఠాకూర్
మృణాల్ ఠాకూర్

మృణాల్ ఠాకూర్

Fan Proposes to Mrunal: సీతారామం సినిమాతో తెలుగువారి హృదయాలను కొల్లగొట్టిన బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఈ చిత్రంలో తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో యువతను విపరీతంగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. అంతేకాకుండా తన అందం. అభినయంతో కుర్రకారు నుంచి విపరీతంగా ప్రపోజల్స్ అందుకుంటోంది. తాజాగా మృణాల్‌కు సోషల్ మీడియా వేదికగా అలాంటి ప్రపోజలే వచ్చింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ అభిమాని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మృణాల్‌కు మెసేజ్ పెట్టాడు. ఇందుకు ఈ ముద్దుగుమ్మ కూడా తన దైన రితీలో స్పందించింది. ఈ మేరకు వీడియోను పోస్ట్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

వీడియోను గమనిస్తే.. మృణాల్ తన కురులను అందంగా సర్దుకుంటూ కనిపిస్తుంది. ఈ వీడియో కింద పోస్టులో చూసేందుకు చాలా క్యూట్‌గా ఉంది. కానీ తర్వాత డిలీట్ చేస్తాను అని మృణాల్ పోస్టు పెట్టింది. ఇందుకు బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా కూడా స్పందించిది. డిలీట్ చేయొద్దు అంటూ కామెంట్ షేర్ చేసింది.

అసలు విషయానికొస్తే.. తనకు ఓ అభిమాని ప్రపోజ్ చేసిన పోస్టుకు రిప్లయి ఇస్తూ మృణాల్ ఈ వీడియోను షేర్ చేసింది. ఇంతకీ ఆ అభిమాని ఏం పోస్ట్ పెట్టాడంటే నా తరఫు నుంచి సంబంధం ఖరారైంది. అంటూ మృణాల్‌ను ప్రపోజ్ చేస్తూ పోస్ట్ చేశాడు. ఇందుకు ఈ బాలీవుడ్ బ్యూటీ స్పందిస్తూ.. నా తరఫు నుంచి వద్దనుకుంటున్నా అంటూ కామెంట్ పెట్టింది. దీంతో ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా ఈ పోస్టుపై విశేషంగా స్పందిస్తున్నారు.

ఆమె కామన్ మ్యాన్‌కు దక్కే మాహారాణి కాదు అని ఒకరు పోస్టు పెట్టగా.. అతడి క్రియేటివిటీకీ నువ్వు క్రెడిట్ ఇవ్వాల్సిందే అంటూ మరొకరు స్పందించారు. మీరు చాలా అందంగా ఉన్నారంటూ ఇంకో యూజర్ కామెంట్ షేర్ చేశారు. హృదయాలను ముక్కలు చేస్తున్నావంటూ మరో వ్యక్తి తన స్పందనను తెలియజేశారు.

ఇంక సినిమాల విషయానికొస్తే మృణాల్ ఠాకూర్ చివరగా సీతా రామం సినిమాలో కనువిందు చేసింది. ఇటీవలే అక్షయ్ కుమార్ నటించిన సెల్ఫీ చిత్రంలో ఓ పాటలో మెరిసింది. ఇది కాకుండా ఇషాన్ కట్టర్‌తో ఓ సినిమా, ఆదిత్య రాయ్ కపూర్‍‌తో ఓ క్రైమ్ థ్రిల్లర్‌లో నటించనుంది. ఆదిత్యరాయ్ కపూర్‌తో సినిమా ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఇదికాకుండా నానితో ఓ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాలో నటించనుంది. ఈ సినిమాకు శౌర్య దర్శకత్వం వహిస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం