తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Election Results 2023 : 'తగ్గేదేలే!'.. 3 రాష్ట్రాల్లో బీజేపీ హవా- కాంగ్రెస్​కు భారీ షాక్​!

Election results 2023 : 'తగ్గేదేలే!'.. 3 రాష్ట్రాల్లో బీజేపీ హవా- కాంగ్రెస్​కు భారీ షాక్​!

Sharath Chitturi HT Telugu

03 December 2023, 11:09 IST

    • Election results 2023 : అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కాగా.. 3 రాష్ట్రాల్లో బీజేపీ హవా కనిపిస్తోంది.
'తగ్గేదేలే!'.. 3 రాష్ట్రాల్లో బీజేపీ హవా
'తగ్గేదేలే!'.. 3 రాష్ట్రాల్లో బీజేపీ హవా (PTI)

'తగ్గేదేలే!'.. 3 రాష్ట్రాల్లో బీజేపీ హవా

Assembly Election results 2023 : మధ్యప్రదేశ్​, రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్​లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని చూస్తుంటే.. మధ్యప్రదేశ్​లో బీజేపీ మరోమారు ఆధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక రాజస్థాన్​లో కాంగ్రెస్​కు షాక్​ తప్పేడట్టు లేదు. అటు ఛత్తీస్​గఢ్​లో కాస్త పోటీ-పోటీ కనిపిస్తున్నా.. బీజేపీ ముందంజలో ఉంది!

ట్రెండింగ్ వార్తలు

Transfers in AP : ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ - పల్నాడు కలెక్టర్ బదిలీ, పలువురు ఎస్పీలపై సస్పెన్షన్ వేటు

Khammam Bettings: ఏపీలో ఎన్నికల ఫలితాలపై తెలంగాణలో లెక్కలు.. జోరుగా బెట్టింగులు!

YS Jagan With IPac: ఐపాక్‌ బృందంతో జగన్ భేటీ.. మళ్లీ అధికారంలోకి వస్తున్నామని ధీమా..

Lok Sabha Elections Phase 5: ఐదో దశలో లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచిన ప్రముఖులు వీరే..

మధ్యప్రదేశ్​లో ఇలా..

మధ్యప్రదేశ్​లో మొత్తం 230 సీట్లు ఉండగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 116 స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది. ఇక ఆదివారం ఉదయం 10:30 గంటల సమయానికి.. బీజేపీ 152 సీట్లల్లో లీడ్​లో దూసుకెళుతోంది! కాంగ్రెస్​ కేవలం 74 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు నాలుగు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Madhya Pradesh Assembly Election results 2023 : మధ్యప్రదేశ్​లో కమలదళం విజయానికి దగ్గరవుతున్న నేపథ్యంలో.. ఆ రాష్ట్ర సీఎం శివరాజ్​ సింగ్​ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశిస్సులతో ఈసారి కూడా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

రాజస్థాన్​లో ఇలా..

రాజస్థాన్​లో బీజేపీ దూసుకెళుతోంది! 200 సీట్లకు 199చోట్ల ఎన్నికలు జరగ్గా.. ట్రెండ్స్​ ప్రకారం.. ఆదివారం ఉదయం 10:30 గంటల సమయానికి కమలదళం 109 చోట్ల ఆధిక్యంలో దూసుకెళుతోంది. కాంగ్రెస్​ 76 చోట్ల మాత్రమే లీడ్​లో ఉంది.

రాజస్థాన్​లో దశాబ్దాలుగా ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఇప్పుడు కూడా ఇదే రిపీట్​ అవుతున్నట్టు కనిపిస్తోంది.

ఛత్తీస్​గఢ్​లో కాంగ్రెస్​కు షాక్​..?

Chhattisgarh assembly election results : ఛత్తీస్​గఢ్​లో కాస్త హోరాహోరీ పోరు కనిపిస్తోంది. కానీ కాంగ్రెస్​కు గట్టి షాక్​ ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 90 సీట్లల్లో 46 స్థానాల మెజారిటీ కావాల్సి ఉండగా.. బీజేపీ ఇప్పటికే 48 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్​ కేవలం 38 సీట్లల్లో ముందంజలో ఉంది. ఇతరులు 4 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.

వాస్తవానకి ఛత్తీస్​గఢ్​లో కాంగ్రెస్​ మళ్లీ అధికారంలోకి వస్తుందని అందరు భావించారు. దాదాపు అన్ని ఎగ్జిట్​ పోల్స్​ కూడా ఇదే విషయాన్ని చెప్పాయి. కానీ పరిస్థితులు తారుమారు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

తెలంగాణలో మాత్రం.. కాంగ్రెస్​ పార్టీ విజయంవైపు దూసుకెళుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇక మిజోరంలో కూడా నేడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగాల్సి ఉంది. కానీ దీనిని సోమవారానికి వాయిదా వేశారు.

తదుపరి వ్యాసం