తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Pakistan Semifinal: ఇంగ్లండ్ డ్రెస్సింగ్ రూమ్‌కు తాళం వేయండి - పాక్‌కు ఫ‌న్నీ ఐడియా ఇచ్చిన అక్ర‌మ్‌

pakistan semifinal: ఇంగ్లండ్ డ్రెస్సింగ్ రూమ్‌కు తాళం వేయండి - పాక్‌కు ఫ‌న్నీ ఐడియా ఇచ్చిన అక్ర‌మ్‌

10 November 2023, 9:52 IST

  • Pakistan Semifinal: వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సెమీస్ చేర‌డానికి పాకిస్థాన్ జ‌ట్టుకు వ‌సీం అక్ర‌మ్ ఫ‌న్నీ ఐడియా ఇచ్చాడు. ఇంగ్లండ్ డ్రెస్సింగ్ రూమ్ లాక్ చేస్తే ఆట‌గాళ్లు టైమ్ ఔట్ అయ్యి పాకిస్థాన్ సెమీస్ చేరుతుంద‌ని అన్నాడు. అత‌డి ఐడియాపై సోష‌ల్ మీడియాలో జోకులు పేలుతోన్నాయి

పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌
పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌

పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌

Pakistan Semifinal: గురువారం శ్రీలంక‌ను చిత్తుగా ఓడించి సెమీస్ బెర్తును దాదాపు ఖాయం చేసుకొని పాకిస్థాన్‌కు షాకిచ్చింది న్యూజిలాండ్‌. ఇంగ్లండ్‌, పాకిస్థాన్ మ్యాచ్ రిజ‌ల్ట్‌తో సంబంధం లేకుండానే సెమీస్‌లో ఇండియాతో త‌ల‌ప‌డేందుకు న్యూజిలాండ్ రెడీ అయ్యింది.ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసి 300 ప‌రుగులు చేసినా ఇంగ్లండ్‌ను ప‌ద‌మూడు ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేయాల్సివుంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Team India in T20 world cup 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌కు వెళ్తే డేంజరే.. ఎందుకో చూడండి

Babar Azam Record: టీ20ల్లో బాబర్ ఆజం మరో వరల్డ్ రికార్డు.. విరాట్ కోహ్లినే మించిపోయాడు

Deepak Chahar: ఇది రియ‌ల్ లైఫ్ సైంధ‌వ్ మూవీ - హీరోగా నిలిచిన టీమిండియా క్రికెట‌ర్‌ దీప‌క్ చాహ‌ర్‌

DC vs LSG: లక్నోకు భారీ దెబ్బేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. తన చివరి లీగ్ మ్యాచ్‍లో అలవోకగా గెలిచిన పంత్ సేన

అలా కాకుండా ఇంగ్లండ్ మూడు వంద‌ల ప‌రుగులు చేస్తే పాకిస్థాన్ ఆ టార్గెట్‌ను ఆరు ఓవ‌ర్ల‌లోనే ఛేజ్ చేయాల్సివుంటుంది. అప్పుడే పాక్ సెమీస్ బెర్తు ఖాయమవుతుంది. అది అసాధ్యం కావ‌డంతో పాకిస్థాన్ సెమీస్ దారులు మూసుకుపోయాయి. లీగ్ ద‌శ లోనే పాక్ జ‌ట్టు ఇంటిముఖం ప‌ట్ట‌నుంది. దాంతో పాకిస్థాన్ సెమీస్ బెర్తుపై సోష‌ల్ మీడియాలో ఫ‌న్నీ మీమ్స్ ట్రోల్ అవుతోన్నాయి. పాకిస్థాన్ సెమీస్ చేర‌డానికి ఆ జ‌ట్టు దిగ్గ‌జ ఆట‌గాడు వ‌సీమ్ అక్ర‌మ్ ఓ ఫ‌న్నీ ఐడియా ఇచ్చాడు.

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ మొద‌ట బ్యాటింగ్ చేసి ఎంత వీలైతే అంత స్కోరు చేయాలి.ఆ త‌ర్వాత ఇంగ్లండ్ బ్యాటింగ్ దిగ‌కుండా ఆజ‌ట్టు డ్రెస్సింగ్ రూమ్‌కు ఇర‌వై నిమిషాల పాటు తాళం వేస్తే ఆట‌గాళ్లంద‌రూ టైమ్ ఔట్ అవుతారు. అప్పుడు పాకిస్థాన్ సెమీస్ చేరుకుంటుంది అని స‌ల‌హా ఇచ్చాడు. అక్రమ్ ఐడియాను పాకిస్థాన్ టీవీ ఛానెల్ యాంకర్ బయటపెట్టాడు. అక్ర‌మ్ ఐడియా బాగుంద‌ని, అత‌డు చెప్పిన‌ట్లు చేయ‌మ‌ని పాకిస్థాన్ ఆట‌గాళ్ల‌ను ట్రోట్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్‌.

మ‌రోవైపు మ్యాచ్ ప్రారంభానికి ముందే ఇంగ్లండ్ డ్రెస్సింగ్ రూమ్‌కు తాళం వేస్తే మ్యాచ్ జ‌ర‌గ‌దు కాబ‌ట్టి పాకిస్థాన్ సెమీస్ చేరుతుంద‌ని పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్ మిస్బా ఉల్ హాక్ కామెంట్స్ చేశారు. అక్ర‌మ్‌, మిస్బా ఉల్ హ‌క్ కామెంట్స్ తెగ వైర‌ల్ అవుతోన్నాయి.

తదుపరి వ్యాసం