తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Ban U19: మ్యాచ్ మధ్యలో టీమిండియా కెప్టెన్‌తో ఫైట్.. కారణం? వీడియో వైరల్

IND vs BAN U19: మ్యాచ్ మధ్యలో టీమిండియా కెప్టెన్‌తో ఫైట్.. కారణం? వీడియో వైరల్

Sanjiv Kumar HT Telugu

21 January 2024, 11:29 IST

  • IND vs BAN Under 19 World Cup Heat Argument: అండర్ 19 ప్రపంచకప్‌లో శుభారంభం చేసి అదరగొట్టింది టీమిండియా. అయితే తొలి మ్యాచ్ మధ్యలో టీమిండియా కెప్టెన్‌తో బంగ్లాదేశ్ ఆటగాళ్లు గొడవకు దిగారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

మ్యాచ్ మధ్యలో టీమిండియా కెప్టెన్‌తో ఫైట్.. కారణం? వీడియో వైరల్
మ్యాచ్ మధ్యలో టీమిండియా కెప్టెన్‌తో ఫైట్.. కారణం? వీడియో వైరల్

మ్యాచ్ మధ్యలో టీమిండియా కెప్టెన్‌తో ఫైట్.. కారణం? వీడియో వైరల్

IND vs BAN Under 19 World Cup U19 Fight: అండర్ 19 వరల్డ్ కప్ 2024 తొలి మ్యాచ్‌లో మంచి విజయం సాధించి శుభారంభం చేసింది భారత్. సౌత్ ఆఫ్రికాలోని బ్లూమ్‌ఫోంటెన్ వేదికగా బంగ్లాదేశ్‌తో శనివారం గ్రూప్ ఏ తొలి లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో 84 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై టీమిండియా గెలుపొందింది. దీంతో భారత్ క్రికెట్ అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు. వరల్డ్ కప్‌లో టీమిండియా బోణీ కొట్టిందంటూ పోస్టులు పెడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Rohit Sharma vs Hardik Pandya: హార్దిక్ పాండ్యా రాగానే లేచి వెళ్లిపోయిన రోహిత్, సూర్యకుమార్

Team India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవిపై కన్నేసిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్.. ద్రవిడ్ తర్వాత అతడేనా?

T20 Worlcup : టీమిండియా టీ20 వరల్డ్ కప్​​ జట్టులో హార్దిక్ వద్దని చెప్పిన రోహిత్​.. కానీ!​

GT vs KKR IPL 2024: మ్యాచ్ వర్షార్పణం.. ప్లేఆఫ్స్ రేసును నుంచి గుజరాత్ ఔట్.. కోల్‍కతాకు టాప్-2 పక్కా

ఎంతో ఆసక్తికరంగా సాగిన అండర్ 19 వరల్డ్ కప్ 2024 తొలి మ్యాచ్‌లో భారత్, బంగ్లా ప్లేయర్స్ కొట్టుకునేంత పని చేశారు. ఈ తొలి మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ ఉదయ్ సహారన్ ఒక్కసారిగా తన సహనం కోల్పోయాడు. మైదానంలో మ్యాచ్ మధ్యలోనే బంగ్లాదేశ్ ఆటగాడు అరిఫుల్ ఇస్లాంతో ఉదయ్ సహారన్ మాటల యుద్ధానికి దిగాడు. తర్వాత సహారన్ వెళ్లిపోతుంటే.. మరో బంగ్లాదేశ్ ఆటగాడు మహ్ఫుజుర్ రహ్మాన్ రబ్బీ తన క్లో ప్లేయర్ అరిఫుల్ ఇస్లాంకు మద్దతుగా నిలిచాడు.

అరిఫుల్ ఇస్లాంకు సపోర్ట్‌గా మహ్ఫుజుర్ రహ్మాన్ రబ్బీ నిలవడంతో మరింత ఆగ్రహానికి లోనయ్యాడు ఉదయ్ సహారన్. దాంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతగా మారింది. ఒకరినొకరు దగ్గరిగా వచ్చి కొట్టుకునేంత పని చేశారు. అయితే, మధ్యలో అంపైర్ జోక్యం చేసుకోని చెరో వైపు పంపించడంతో గొడవ సద్దుమణిగింది. ఈ సంఘటన భారత ఇన్నింగ్స్ 25వ ఓవర్‌లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఉదయ్ సహారన్ సహనం కోల్పోడానికి, గొడవకు గల కారణం మాత్రం తెలియరాలేదు.

మ్యాచ్ మధ్యలో టీమిండియా కెప్టెన్ ఉదయ్ సహారన్‌తో బంగ్లాదేశ్ ప్లేయర్స్ గొడవ పడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. కాగా అండర్ 19 వరల్డ్ కప్ 2024 తొలి మ్యాచ్‌లో కెప్టెన్ ఉదయ్ సహారన్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా క్రికెట్ టీమ్ 7.2 ఓవర్లలో కేవలం 32 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ సమయంలోనే ఓపెనర్ ఆదర్శ్ సింగ్, కెప్టెన్ ఉదయ్ సహారన్ చెరో హాఫ్ సెంచరీలతో టీమిండియా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ యంగ్ టీమ్ మూడో వికెట్‌కు 116 పరుగులు జోడించి.. కీలక భాగస్వామిగా నిలిచింది. ఆదర్శ్ సింగ్ 76 పరుగులు చేయగా.. ఉదయ్ సహారన్ 64 రన్స్ చేశాడు. ఇక 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది టీమిండియా.

బంగ్లాదేశ్ బౌలర్లలో మారుఫ్ మృధ 5 వికెట్స్ తీసి సత్తా చాటాడు. చౌదుర్ రిజ్వాన్, మహ్ఫుజుర్ రహ్మాన్ రబ్బీ చెరో వికెట్ తీసుకున్నారు. ఇలా అండర్ 19 వరల్డ్ కప్ 2024 తొలి మ్యాచ్ ఆసక్తిగా సాగింది. మధ్యలో చిన్న గొడవతో కాస్తా నిరంతరాయం కలిగింది. ఇదిలా ఉంటే, అండర్ 19 వరల్డ్ కప్ 2024 టోర్నమెంట్‌లో తదుపరి గ్రూప్ ఏలో వచ్చే గురువారం (జనవరి 25) ఐర్లాండ్ క్రికెట్ జట్టుతో టీమిండియా తలపడనుంది.

తదుపరి వ్యాసం