తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Srh Vs Pbks: టాస్ గెలిచిన పంజాబ్.. మార్పుల్లేకుండా హైదరాబాద్: తుది జట్లు ఇవే

SRH vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్.. మార్పుల్లేకుండా హైదరాబాద్: తుది జట్లు ఇవే

09 April 2024, 19:18 IST

    • SRH vs PBKS: పంజాబ్ కింగ్స్‌తో పోరుకు సన్‍రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకుంది పంజాబ్. తుది జట్లు ఎలా ఉన్నాయంటే..
SRH vs PBKS: టాస్ గెలిచిన పంజాజ్.. మార్పుల్లేకుండా హైదరాబాద్: తుది జట్లు ఇవే
SRH vs PBKS: టాస్ గెలిచిన పంజాజ్.. మార్పుల్లేకుండా హైదరాబాద్: తుది జట్లు ఇవే

SRH vs PBKS: టాస్ గెలిచిన పంజాజ్.. మార్పుల్లేకుండా హైదరాబాద్: తుది జట్లు ఇవే

SRH vs PBKS: ఐపీఎల్ 2024 సీజన్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) ఒడిదొడుకుల మధ్య సాగుతోంది. నాలుగు మ్యాచ్‍ల్లో రెండింట గెలిచింది. ఈ సీజన్‍లో ఇప్పటి వరకు హోం గ్రౌండ్‍లో రెండు భారీ విజయాలతో మెప్పించిన హైదరాబాద్.. బయటి స్టేడియాల్లో రెండు మ్యాచ్‍ల్లో ఓడింది. నేడు (ఏప్రిల్ 9) పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) టీమ్‍ను ఎస్‍ఆర్‌హెచ్ ఢీకొంటోంది. ముల్లాన్‍పూర్ వేదికగా పంజాబ్‍తో నేడు తలపడుతోంది హైదరాబాద్. ఈ మ్యాచ్‍లో పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకున్నాడు. దీంతో హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్‍కు దిగనుంది.

ట్రెండింగ్ వార్తలు

Virat Kohli on retirement: మళ్లీ మీకు కనిపించను.. రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

IPL 2024: ఒక్క మ్యాచ్ ఆడ‌కుండా కోట్లు సంపాదించారు - ఈ ఐపీఎల్‌లో బెంచ్‌కే ప‌రిమిత‌మైన స్టార్ క్రికెట‌ర్లు వీళ్లే

India vs Pakistan: టీ20 ప్రపంచకప్‍లో ఇండియా, పాకిస్థాన్ సమరం జరిగే స్టేడియం ప్రారంభం.. లాంచ్ చేసిన పరుగుల వీరుడు

Sunrisers Hyderabad: రాజస్థాన్ వరుస పరాజయాలు.. సన్‍రైజర్స్ హైదరాబాద్‍కు ఆ గోల్డెన్ ఛాన్స్

గత మ్యాచ్‍లో చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిచిన తుదిజట్టును పంజాబ్‍తో పోరుకు కొనసాగించింది హైదరాబాద్. జట్టులో మార్పులు చేయలేదు. పంజాబ్ కూడా తుదిజట్టులో ఛేంజెస్ చేయలేదు.

“ఈ సీజన్‍లో మా ప్రదర్శనపై సంతోషంగానే ఉన్నాం. రెండు గెలిచాం. మాకు చాలా బలాలు ఉన్నాయి. డెప్త్ కూడా ఉంది. గత మ్యాచ్ టీమ్‍నే కొనసాగిస్తున్నాం” అని టాస్ సమయంలో ప్యాట్ కమిన్స్ చెప్పాడు. కాగా, స్టార్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ చెప్పాడు.

సన్‍రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్ రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), షహబాజ్ అహ్మద్, నితీశ్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమాద్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, నటరాజన్, జయదేవ్ ఉనాద్కత్

హైదరాబాద్ సబ్ ఇంపాక్ట్ ఆప్షన్లు: ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్, రాహుల్ త్రిపాఠి

పంజాబ్ కింగ్స్ తుదిజట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్ స్టో, ప్రభ్‍సిమ్రన్ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సామ్ కరన్, సికిందర్ రజా, శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్షదీప్ సింగ్

పంజాబ్ సబ్ ఇంపాక్ట్ ఆప్షన్లు: ప్రభ్‍సిమ్రన్ సింగ్, నాథన్ ఎలిస్, తనయ్ త్యాగరాజన్, రాహుల్ చాహర్, రిషి ధావన్

గత మ్యాచ్‍లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై సన్‍రైజర్స్ హైదరాబాద్ అలవోక విజయం సాధించింది. ఉప్పల్‍లో ఏప్రిల్ 5న జరిగిన ఆ మ్యాచ్‍లో 6 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది. 166 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే హైదరాబాద్ ఛేదించింది. అభిషేక్ శర్మ (12 బంతుల్లో 37 పరుగులు) మరోసారి హిట్టింగ్ తఢాకా చూపించగా.. ఐడెన్ మార్క్ రమ్ (50) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ట్రావిస్ హెడ్ (31) రాణించాడు. మొత్తంగా సూపర్ విక్టరీతో దుమ్మురేపింది ఎస్‍ఆర్‌హెచ్. పంజాబ్‍తో మ్యాచ్‍లోనూ ఈ దూకుడు కొనసాగించాలని పట్టుదలగా ఉంది.

పంజాబ్ కూడా ఈ సీజన్‍లో నాలుగు మ్యాచ్‍ల్లో రెండు గెలిచింది. గత మ్యాచ్‍లో గుజరాత్‍పై ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. యువ ప్లేయర్ శశాంక్ సింగ్ (61 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీ, అశుతోష్ శర్మ (31) దూకుడైన బ్యాటింగ్‍తో కింగ్స్ టీమ్‍ను గెలిపించారు. ఓటమి అంచుల నుంచి గెలుపుకు చేర్చారు.

తదుపరి వ్యాసం