తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Siraj In Odi Ranking: వ‌న్డే ర్యాంకింగ్స్‌లో సిరాజ్ నంబ‌ర్ వ‌న్ - హైద‌రాబాదీ పేస‌ర్ అరుదైన ఘ‌న‌త‌

Siraj in Odi Ranking: వ‌న్డే ర్యాంకింగ్స్‌లో సిరాజ్ నంబ‌ర్ వ‌న్ - హైద‌రాబాదీ పేస‌ర్ అరుదైన ఘ‌న‌త‌

HT Telugu Desk HT Telugu

20 September 2023, 14:29 IST

  • Siraj in Odi Ranking: టీమిండియా పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. బుధ‌వారం ఐసీసీ ప్ర‌క‌టించిన వ‌న్డే ర్యాంకింగ్స్‌లో నంబ‌ర్ వ‌న్ స్థానాన్ని ద‌క్కించుకున్నాడు.

మ‌హ్మ‌ద్ సిరాజ్
మ‌హ్మ‌ద్ సిరాజ్

మ‌హ్మ‌ద్ సిరాజ్

Siraj in Odi Ranking: ఆసియా క‌ప్ ఫైన‌ల్‌లో అద్భ‌త‌మైన బౌలింగ్‌తో మెరిసిన‌ టీమిండియా పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ వ‌న్డే ర్యాంకింగ్స్ నంబ‌ర్ వ‌న్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. బుధ‌వారం ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్‌ను ప్ర‌క‌టించింది. ఇందులో బౌల‌ర్ల జాబితాలో 694 పాయింట్ల‌తో సిరాజ్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు.

ట్రెండింగ్ వార్తలు

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

RCB vs CSK: బాదేసిన బెంగళూరు.. డుప్లెసిస్, కోహ్లీ, పాటిదార్ మెరుపులు.. చెన్నై ముందు భారీ టార్గెట్.. ప్లేఆఫ్స్ చేరాలంటే..

Rohit Sharma: రోహిత్ శర్మతో మాట్లాడిన నీతా అంబానీ.. వీడియో వైరల్.. ఆ అంశం గురించే అంటున్న ఫ్యాన్స్

Virat Kohli : విరాట్​ కోహ్లీ గల్లీ క్రికెట్​ టీమ్​లో నలుగురు స్టార్​ ప్లేయర్స్​..

ఆసియా క‌ప్ ఫైన‌ల్‌కు ముందు తొమ్మిది స్థానంలో ఉన్న సిరాజ్ ఏకంగా ఎనిమిది స్టానాల‌ను మెరుగుప‌రుచుకొని టాప్ ప్లేస్‌లోకి దూసుకొచ్చాడు. సిరాజ్ దెబ్బ‌కు నంబ‌ర్ వ‌న్ ర్యాంక్‌లో నిలిచిన జోస్ హెజిల్‌వుడ్ సెకండ్ ప్లేస్‌కు ప‌డిపోయాడు. బౌల్ట్ మూడో స్థానంలో నిలిచాడు.

శ్రీలంక‌తో జ‌రిగిన ఆసియా క‌ప్ ఫైన‌ల్‌లో సిరాజ్ 21 ర‌న్స్ ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు. ఒకే ఓవ‌ర్‌లో నాలుగు వికెట్లు తీసి చ‌రిత్ర‌ను సృష్టించాడు. సిరాజ్ పేస్ దెబ్బ‌కు శ్రీలంక 50 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ప‌ది వికెట్ల తేడాతో శ్రీలంక‌ను ఓడించి ఆసియా క‌ప్ టైటిల్‌ను టీమిండియా సొంతం చేసుకున్న‌ది. టీమిండియా స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ తొమ్మిది స్థానంలో నిలిచాడు.

శుభ్‌మ‌న్ గిల్ సెకండ్ ప్లేస్‌

ఆసియా క‌ప్‌లో బంగ్లాదేశ్‌పై సెంచ‌రీతో రాణించిన టీమిండియా ఓపెన‌ర్ శుభ్‌మ‌న్‌గిల్ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు. టాప్ ప్లేస్‌ను పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజాం ద‌క్కించుకున్నాడు. బాబ‌ర్ ఆజాంకు కొద్ది పాయింట్ల తేడాతో గిల్ సెకండ్ ప్లేస్‌లో కొన‌సాగుతోన్నాడు. శుభ్‌మ‌న్‌గిల్‌తో పాటు విరాట్ కోహ్లి (ఎనిమిదో స్థానం), రోహిత్ శ‌ర్మ (ప‌దో స్థానం) టాప్ టెన్‌లో నిలిచారు.

తదుపరి వ్యాసం